హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల సోమవారం హైదరాబాద్లో కలిశారు. విజయవంతంగా అయుత మహా చండీ యాగం నిర్వహించినందుకు ఆమె ... కేసీఆర్ను అభినందించారు. మరిన్ని మంచిపనులు చేయాలంటూ పి.సుశీల...ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. కేసీఆర్ ఈ సందర్భంగా సుశీలకు శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం కేసీఆర్, ఆయన సతీమణి శోభా ...సుశీలతో ఫోటో దిగారు.