సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఉప్మాలో పాము పిల్ల పడిన విషయం తెలియక దాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. యాదగరి తాలూకా అబ్బెతుమకూరు గ్రామంలోని విశ్వరాధ్య విద్యావర్థక రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో గురువారం ఉదయం విద్యార్థులకు అల్పాహారంగా ఉప్మా వడ్డించారు. దానిని తిన్న విద్యార్థుల్లో 56 మందికి నిమిషాల్లోనే వాంతులు, విరేచనాలయ్యాయి.
వెంటనే వారినిప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కలుషిత ఆహారమే కారణమని నిర్థారించారు. సిబ్బంది వెంటనే హాస్టల్‌కు వెళ్లి పరిశీలించగా ఉప్మా ఉన్న పాత్రలో చనిపోయిన పాముపిల్ల కనిపించింది. ఈ విషయాన్ని వైద్యులకు తెలపగా వారు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే పిల్లల తల్లిదండ్రులు ఆస్పత్రులకు చేరుకున్నారు.
హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి వసతి పాఠశాలను సందర్శించారు. ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment