
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతోన్న ఆమెను ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిమ్లా(హిమాచల్ ప్రదేశ్) వెళ్లిన ఆమె.. అక్కడి గెస్ట్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఇబ్బందికి గురయ్యారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. సిమ్లా నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, చికిత్స వివరాలను తెలియజేస్తామని గంగారాం ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అధినేత్రి ఆస్పత్రిలో చేరడంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న సోనియా.. గత ఏడాది అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment