
నటుడు శరత్‌కుమార్‌కు అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, అఖిల భారత సమత్తువ కచ్చి నేత శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనకు తీవ్రంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబు సభ్యులు ఆయన్ని థౌజండ్ లైట్స్ సమీపంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు. అనంతరం శరత్‌కుమార్ సాయంత్రమే ఇంటికి వెళ్లిపోయినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు.
ఇటీవల శరత్ కుమార్ రాజకీయ పరంగానూ, వ్యక్తిగతంగానూ తీవ్ర అశాంతికి గురయ్యారని సమాచారం. ఆ మధ్య జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఆయన నటనకు దూరంగా ఉంటూ వచ్చారు.అదే విధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ఆయన పరాజయం పాలైయ్యారు. ఇటీవల విహారయాత్రకు విదేశాలు వెళ్లిన శరత్‌కుమార్ గత వారం చెన్నై నగరానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ కన్నడ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు కూడా.