కొచ్చి: ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ,కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు రామ్ జెఠ్మలానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కేరళలోని క్రిమినల్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్ ఈ వీనింగ్ విత్ లెజెండ్’ పేరుతో న్యాయవాద వృత్తిలో 75 సం.రాల పాటు ఆయన చేసిన సేవలకు గాను ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కొచ్చీ వెళ్లారు. ఈ సందర్భంగా తనకు అన్ ఈజీగా ఉందని చెప్పడంతో వెంటనే న్యాయవాదులు ఆయనను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కానీ 24 గంటల పరిశీలన కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచినట్టు చెప్పారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు.
సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అస్వస్థత
Published Sat, Mar 25 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
Advertisement
Advertisement