
అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడిన అషూ బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది.
షో నుంచి బయటకు వచ్చాక ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలతో మరింత గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని యూత్‌లో మాంచి క్రేజ్ దక్కించుకుంది. నటిగా కంటే సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయిన అషూ నిత్యం తనకు సంబంధించి పలు పోస్టులను షేర్ చేస్తుంటుంది.
తాజాగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైంది. చేతికి సెలైన్‌తో నడవలేని స్థితిలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను అషూ ఫ్రెండ్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment