కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోలుకుంటున్నారని సర్ గంగారామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కోలుకుంటున్నారని సర్ గంగారామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెను ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని తెలిపాయి.
‘ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆదివారం ఆస్పత్రిలో చేరిన సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె క్రమంగా కోలుకుంటున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశముంద’ని సర్ గంగారామ్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. 69 ఏళ్ల సోనియా గత ఏడాది ఇదే ఆస్పత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.