Sir Ganga Ram Hospital
-
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర జ్వరంతో న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందని చికిత్స తీసుకుంటున్నారని సదరు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐతే సోనియా గురువారమే ఆసుపత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీనియర్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ డాక్టర్ అరూప్ బసు మాట్లాడుతూ.. తమ వైద్యుల బృందం ఆమెను దగ్గరుండి మరీ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్ ఇవే..) -
National Herald Case: రాహుల్ అరెస్ట్ అవుతారా ??
-
ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు కోవిడ్ రోగులతో పాటు.. వారి కుటుంబసభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దేశ రాజధానిలో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన సర్ గంగా రాం ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న 25 మంది రోగులు మృతి చెందారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ‘‘ఆస్పత్రిలో కేవలం మరో రెండు గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి.. సుమారు 60 మంది రోగులు పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ అత్యవసరం’ అంటూ ఆస్పత్రి వర్గాలు ట్వీట్ చేశాయి. అంతేకాక ఢిల్లీ ప్రభుత్వానికి ఎస్ఓఎస్ పంపాయి. ఒకే రోజు 25 మంది మరణించడం ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం అని యాజమాన్యం వెల్లడించింది. సర్ గంగా రాం హాస్పిటల్ యాజమాన్యం ఎస్ఓఎస్ పంపిన 2 గంటల వ్యవధిలో ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. సర్ గంగా రాం ఆస్పత్రి ఢిల్లీలో ప్రసిద్ది చెందిన ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 142 మందికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉన్నట్లు సమాచారం. 25 sickest patients have died in last 24 hrs at the hospital. Oxygen will last another 2 hrs. Ventilators & Bipap not working effectively. Need Oxygen to be airlifted urgently. Lives of another 60 sickest patients in peril: Director-Medical, Sir Ganga Ram Hospital, Delhi — ANI (@ANI) April 23, 2021 గత మూడు రోజులుగా పలు ఆస్పత్రులు ఆక్సిజన్, బెడ్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. దాంతో పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు ‘‘ముందు ఆడగండి.. లేదంటే అప్పుగా పొందండి.. అది కూడా కుదరకపోతే దొంగతనం చేయండి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ రోగుల పరిస్థితి రోజురోజుకీ విషమిస్తుండడంతో ఆక్సిజన్ అవసరమూ ఎక్కువవుతోంది. మరోవైపు కరోనా తీవ్రత తర్వాత కేంద్రం ఆక్సిజన్ సరఫరాను స్వయంగా చేపట్టింది. నేరుగా దిగుమతి చేసుకునేందుకు వీల్లేకుండా ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కేటాయింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా గురువారమే ఢిల్లీలోని ఆస్పత్రులకు కేంద్రం ఆక్సిజన్ సిలిండర్లు పంపింది. కానీ, ఆ నిల్వలు నేటితోనే పూర్తయ్యాయి. మరోవైపు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ తమకు స్థానికంగా అవసరాలున్నాయని తమ రాష్ట్రం నుంచి ఆక్సిజన్ ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. చదవండి: ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం -
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తమ ఆస్పత్రిలో చేరినట్టు ఆ హాస్పిటల్ చైర్మన్ డీఎస్ రానా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. మరోవైపు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై సోనియా వారితో చర్చించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోనియా గాంధీ ఇదే ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కడుపు నొప్పి కారణంగా ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరారు.(ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక) -
ఆస్పత్రిలో చేరిన ప్రియాంక
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డెంగీ జ్వరంతో బాధపడుతోన్న ఆమెను ఆగస్టు 23న ఢిల్లీలోని శ్రీ గంగారాం వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో డెంగీ విజృంభణ: గడిచిన కొద్ది రోజులుగా ఢిల్లీ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 657 మంది డెంగీ బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చేరారు. వారిలో 325 మంది ఒక్క ఢిల్లీ నగరానికి చెందినవారే కావడం గమనార్హం. రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతుండటంతో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) పని తీరుపై విమర్శలదాడి పెరిగింది. -
కోలుకుంటున్న సోనియా గాంధీ
న్యూఢిల్లీ: ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కోలుకుంటున్నారని సర్ గంగారామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెను ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని తెలిపాయి. ‘ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆదివారం ఆస్పత్రిలో చేరిన సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె క్రమంగా కోలుకుంటున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశముంద’ని సర్ గంగారామ్ ఆస్పత్రి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. 69 ఏళ్ల సోనియా గత ఏడాది ఇదే ఆస్పత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. -
ఆస్పత్రి నుంచి సోనియా డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం కుదుటపడింది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి బుధవారం ఆమె డిశ్చార్జి అయ్యారు. సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన సోనియాను గంగారాం ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమె వైరల్ ఫివర్‌తో బాధపడినట్టు వైద్యులు చెప్పారు. ఛాతీ, ఊపిరితిత్తుల వైద్యులు సోనియాకు చికిత్స చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగవడంతో ఈ రోజు డిశ్చార్జి చేశారు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా.. అమెరికాలో చికిత్స తీసుకున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా
న్యూఢిల్లీ: అనారోగ్యం, భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులపాటు చికిత్స చేయించుకొని డిశ్చార్జి అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరిగి ఆస్పత్రిలో చేరారు. ఆమె మళ్లీ గురువారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. భుజానికి ఆపరేషన్ అనంతరం వేసిన కుట్లను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లారని చెప్పాయి. డిశ్చార్జి అయ్యే సమయంలో సోనియా బాగా నీరసంగా ఉండడంతో మరోసారి పరీక్షలు చేయించుకోవడానికి రావాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. మరో రెండు రోజులపాటు సోనియా ఆస్పత్రిలోనే ఉంటారు. ఉత్తరప్రదేశ్ నగరం వారణాసిలో ఈ నెల మూడు రోడ్‌షోలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. -
గంగారామ్ ఆస్పత్రికి సోనియా
న్యూఢిల్లీ: జ్వరంతో బాధపడుతున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని బుధవారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేయవచ్చని వైద్యులు చెప్పారు. సీనియర్ వైద్యులు సోనియా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో రోడ్డు షోలో పాల్గొన్న సోనియా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో సోనియా వారణాశి పర్యటనను కుదించుకుని ఢిల్లీ తిరిగొచ్చారు. నిన్న ఆర్మీ రీసెర్చ్, రెఫర్ ఆస్పత్రిలో సోనియాకు వైద్యం అందించారు. ఆమె డీహైడ్రేషన్, జ్వరం, హైబీపీతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ రోజు గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రిలో ఇంతకుముందు సోనియా చికిత్స పొందారు. -
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారని సర్ గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు. సోనియాకు ఆయన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె నిన్న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా గాంధీ అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆమెకు ఊపిరితిత్తుల మార్గంలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రికి తరలించారు.