గంగారామ్ ఆస్పత్రికి సోనియా | Sonia shifted to Ganga Ram Hospital | Sakshi
Sakshi News home page

గంగారామ్ ఆస్పత్రికి సోనియా

Published Wed, Aug 3 2016 3:10 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

గంగారామ్ ఆస్పత్రికి సోనియా - Sakshi

గంగారామ్ ఆస్పత్రికి సోనియా

న్యూఢిల్లీ: జ్వరంతో బాధపడుతున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని బుధవారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేయవచ్చని వైద్యులు చెప్పారు. సీనియర్ వైద్యులు సోనియా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

మంగళవారం ఉత్తరప్రదేశ్లోని వారణాశిలో రోడ్డు షోలో పాల్గొన్న సోనియా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో సోనియా వారణాశి పర్యటనను కుదించుకుని ఢిల్లీ తిరిగొచ్చారు. నిన్న ఆర్మీ రీసెర్చ్, రెఫర్ ఆస్పత్రిలో సోనియాకు వైద్యం అందించారు. ఆమె డీహైడ్రేషన్, జ్వరం, హైబీపీతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ రోజు గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రిలో ఇంతకుముందు సోనియా చికిత్స పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement