ఆస్పత్రి నుంచి సోనియా డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం కుదుటపడింది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి బుధవారం ఆమె డిశ్చార్జి అయ్యారు.
సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన సోనియాను గంగారాం ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమె వైరల్ ఫివర్‌తో బాధపడినట్టు వైద్యులు చెప్పారు. ఛాతీ, ఊపిరితిత్తుల వైద్యులు సోనియాకు చికిత్స చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగవడంతో ఈ రోజు డిశ్చార్జి చేశారు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా.. అమెరికాలో చికిత్స తీసుకున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది.