ఆస్పత్రిలో చేరిన ప్రియాంక
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డెంగీ జ్వరంతో బాధపడుతోన్న ఆమెను ఆగస్టు 23న ఢిల్లీలోని శ్రీ గంగారాం వైద్యశాలలో చేర్పించారు.
ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీలో డెంగీ విజృంభణ: గడిచిన కొద్ది రోజులుగా ఢిల్లీ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 657 మంది డెంగీ బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చేరారు. వారిలో 325 మంది ఒక్క ఢిల్లీ నగరానికి చెందినవారే కావడం గమనార్హం. రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతుండటంతో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) పని తీరుపై విమర్శలదాడి పెరిగింది.