సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారని సర్ గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు. సోనియాకు ఆయన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె నిన్న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా గాంధీ అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆమెకు ఊపిరితిత్తుల మార్గంలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రికి తరలించారు.