మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా | Sonia Gandhi hospitalised again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా

Aug 18 2016 10:23 PM | Updated on Oct 22 2018 9:16 PM

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా - Sakshi

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా

అనారోగ్యం, భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులపాటు చికిత్స చేయించుకొని డిశ్చార్జి అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరిగి ఆస్పత్రిలో చేరారు.

న్యూఢిల్లీ: అనారోగ్యం, భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులపాటు చికిత్స చేయించుకొని డిశ్చార్జి అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరిగి ఆస్పత్రిలో చేరారు. ఆమె మళ్లీ  గురువారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. భుజానికి ఆపరేషన్ అనంతరం వేసిన కుట్లను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లారని చెప్పాయి.

డిశ్చార్జి అయ్యే సమయంలో సోనియా బాగా నీరసంగా ఉండడంతో మరోసారి పరీక్షలు చేయించుకోవడానికి రావాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. మరో రెండు రోజులపాటు సోనియా ఆస్పత్రిలోనే ఉంటారు. ఉత్తరప్రదేశ్ నగరం వారణాసిలో ఈ నెల మూడు రోడ్‌షోలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement