
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తమ ఆస్పత్రిలో చేరినట్టు ఆ హాస్పిటల్ చైర్మన్ డీఎస్ రానా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. మరోవైపు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై సోనియా వారితో చర్చించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోనియా గాంధీ ఇదే ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కడుపు నొప్పి కారణంగా ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరారు.(ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక)
Comments
Please login to add a commentAdd a comment