routine checkup
-
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తమ ఆస్పత్రిలో చేరినట్టు ఆ హాస్పిటల్ చైర్మన్ డీఎస్ రానా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. మరోవైపు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్ మీటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై సోనియా వారితో చర్చించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోనియా గాంధీ ఇదే ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కడుపు నొప్పి కారణంగా ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరారు.(ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక) -
'అవన్నీ పుకార్లే.. క్షేమంగా ఉన్నారు'
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చిందన్న వార్తలు అవాస్తవమని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మన్యన్ చెప్పారు. మణిరత్నం హెల్త్ చెకప్ కోసమే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు. మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఈ రోజు ఉదయం జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 'మణిరత్నం, ఆయన భార్య సుహాసిని ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధారణ పరీక్షల్లో భాగంగా హెల్త్ చెకప్ చేయించుకున్నారు. చెన్నైలో అయితే అందరి దృష్టికి వెళ్తుందని, పుకార్లు వస్తాయనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో పరీక్షలు చేయించుకున్నారు' అని మన్యన్ చెప్పారు. కాగా 2004, 2009 లో యువ, రావణ్ చిత్రాలు తీసే సమయంలో మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చింది.