'అవన్నీ పుకార్లే.. క్షేమంగా ఉన్నారు' | Mani Ratnam fit, visited hospital for routine checkup | Sakshi
Sakshi News home page

'అవన్నీ పుకార్లే.. క్షేమంగా ఉన్నారు'

Published Wed, May 6 2015 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

'అవన్నీ పుకార్లే.. క్షేమంగా ఉన్నారు'

'అవన్నీ పుకార్లే.. క్షేమంగా ఉన్నారు'

న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చిందన్న వార్తలు అవాస్తవమని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మన్యన్ చెప్పారు. మణిరత్నం హెల్త్ చెకప్ కోసమే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు. మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఈ రోజు ఉదయం జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

'మణిరత్నం, ఆయన భార్య సుహాసిని ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధారణ పరీక్షల్లో భాగంగా హెల్త్ చెకప్ చేయించుకున్నారు. చెన్నైలో అయితే అందరి దృష్టికి వెళ్తుందని, పుకార్లు వస్తాయనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో పరీక్షలు చేయించుకున్నారు' అని మన్యన్ చెప్పారు. కాగా 2004, 2009 లో యువ, రావణ్ చిత్రాలు తీసే సమయంలో మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement