ఆస్పత్రిలో చేరిన ములాయం | Samajwadi Party Founder Mulayam Singh Yadav Hospitalised | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన ములాయం

Published Fri, Apr 26 2019 4:23 PM | Last Updated on Fri, Apr 26 2019 4:23 PM

Samajwadi Party Founder Mulayam Singh Yadav Hospitalised - Sakshi

ములాయం ఆస్పత్రిలో చేరిక

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్ధాపక​ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ అస్వస్ధతతో శుక్రవారం లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలో చేరారు. ములాయం ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. కొద్ది గంటల్లోనే ములాయంను డిశ్చార్జి చేస్తామని పీజీఐ వైద్యులు వెల్లడించారు. సాధారణ చెకప్‌ కోసమే ములాయం ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారని చెప్పారు.

రొటీన్‌ చెకప్‌లో భాగంగా తనకు గ్యాస్ర్టో, నరాల సంబంధిత సమస్యలపై ఆయన ఫిర్యాదు చేశారని పరీక్షల అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడైనట్టు వైద్యులు తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో మొయినాబాద్‌ నుంచి బరిలో నిలిచిన ములాయం ఇటీవల తన బద్ధ శత్రువు, బీఎస్పీ చీఫ్‌ మాయావతితో కలిసి ప్రచార వేదికను పంచుకున్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement