Kannada Actor Puneeth Rajkumar Hospitalized: Health Condition Critical - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: శోక సంద్రంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు... వారి భయమే నిజమైంది

Published Fri, Oct 29 2021 1:07 PM | Last Updated on Sat, Oct 30 2021 2:50 PM

Kannada Super Star Puneeth Raj Kumar Hospitalised,Condition Serious - Sakshi

Actor Puneeth Rajkumar Health Condition: ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్‌ చేస్తుండగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్‌ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. 

పునీత్‌ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆయన ఆస్పత్రిలో ఉండగానే.. కర్ణాటక సర్కార్‌ రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించడం... సినిమా థియేటర్లు మూసివేయాలని ఆదేశించడంతో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరొకవైపు తమ ప్రియతమ నటుడు క్షేమంగా బయటపడాలని దేవున్ని ప్రార్థించారు అభిమానులు. అయితే, వారి మొరని దేవుడు ఆలకించలేదు. పరిస్థితి విషమించడంతో కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తతో సినీ ప్రముఖులు.. పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పిస్తున్నారు.

పునీత్‌ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement