Puneeth Rajkumar Death Reason: Hero Srikanth Reveals Facts Behind Puneeth Rajkumar Death - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: 'అసలు ఆరోజు పునీత్‌ జిమ్‌ చేయలేదు..అవన్నీ రూమర్స్‌'

Published Tue, Nov 2 2021 11:20 AM | Last Updated on Tue, Nov 2 2021 1:53 PM

Hero Srikanth Reveals Facts Behind Puneeth Rajkumar Death - Sakshi

Hero Srikanth Reveals Facts Behind Puneeth Rajkumar Death: కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆసక్మిక మరణం అందరిని కలిచివేసింది. ఎంతో ఫిట్‌గా కనిపించే పునీత్‌ చిన్నవయసులోనే కన్నుమూయడం యావత్‌ చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తెంది. పేరుకు కన్నడ హీరో అయినా ఎన్టీఆర్‌, బాలకృష్ణ సహా పలువురు టాలీవుడ్‌ హీరోలతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. ఇటీవలె ఆయన తెలుగులో యువరత్న అనే సినిమాను చేశారు. తాజాగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని హీరో శ్రీకాంత్‌ ఎమోషనల్‌ అయ్యారు. చదవండి:పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్‌

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జిమ్‌ చేయడం వల్లే ఆయన చనిపోయాడన్నది నిజం కాదు. ఆరోజు ఆయన అసలు జిమ్‌కే వెళ్లలేదు. నిజానికి ఆయన రాత్రి నుంచే అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కూడా అన్‌ఈజీగా ఉందని వాళ్ల ఫ్యామిలీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లారు.  పునీత్‌ వాళ్ల తండ్రి రాజ్‌కుమార్‌ కూడా గుండెపోటుతో చనిపోయారు. వాళ్ల అన్న శివరాజ్‌కుమార్‌కి కూడా గతంలో హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అలాగే పునీత్‌కి కూడా సడెన్ స్ట్రోక్ రావడం వల్లే మరణించారు.

ఇప్పటికీ పునీత్‌ మన మధ్య లేడంటే నమ్మలేకపోతున్నా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి దూరం అవడం జీర్ణించుకోలేకపోతున్నా అని పేర్కొన్నారు. కాగా పునీత్‌ నటించిన చివరి సినిమా జేమ్స్‌ ఇటీవలె షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ విలన్‌ పాత్ర పోషించారు. 

చదవండి: పునీత్‌ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా!
అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement