నటుడు మిథున్‌ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత | Mithun Chakraborty BJP Chief Sukant Majumdar to Sourav Ganguly Meet Actor | Sakshi
Sakshi News home page

Mithun Chakraborty: నటుడు మిథున్‌ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత

Published Mon, Feb 12 2024 9:30 AM | Last Updated on Mon, Feb 12 2024 1:15 PM

Mithun Chakraborty BJP Chief Sukant Majumdar to Sourav Ganguly Meet Actor - Sakshi

బాలీవుడ్‌ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ  కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. 
 

కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్‌ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్‌ఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement