
విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో ఇబ‍్బంది పడుతున్న ఆయన్ను స్టార్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్ హాస్పిటల్ వైద్యులు చికిత్స చేశారు.
అప్పటి నుంచి రంగారావు స్టార్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో హాస్పిటల్ చేర్పించారు. ప‍్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకు డయాలిసిస్ చేస్తున్నట్టుగా మాదాల రవి తెలిపారు.