critical illness
-
ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. అందులోనూ క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటూంటారు. ఏదైన జబ్బుపడి ఆసుపత్రిలో చేరితేనే ఆ బీమా పరిహారం వస్తుంది. కానీ ట్రీట్మెంట్కు ముందు, తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడినపుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.క్రిటికల్ ఇల్నెస్ పాలసీలుక్యాన్సర్..లివర్..గుండెజబ్బు వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమికంగా గుర్తించినపుడే పరిహారం అందించే పాలసీలు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కేటగిరీలోకి వస్తాయి. ప్రమాదవశాత్తు ఏదైనా వ్యాధి బారిన పడినా పాలసీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. ఈ పాలసీలో భాగంగా బీమా సంస్థలు కనీసం రూ.5 లక్షల నుంచి బీమా అందిస్తున్నాయి. గరిష్ఠంగా ఎంత పాలసీ తీసుకోవాలనేది పాలసీదారుల ప్రత్యేక అవసరాలపై ఆధారపడుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే బీమా కంపెనీలు డబ్బు చెల్లిస్తాయి. కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చాక కూడా వైద్య ఖర్చులు భరించే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: క్రూడ్ దిగుమతులు 40 శాతం పెంపు.. అయినా భారత్‌కు మేలే!ఒక్కో ప్రాణాంతక వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలున్నాయి. కుటుంబంలో తీవ్ర వ్యాధులున్నవారికి ఎలాంటి పాలసీ నప్పుతుందో దాన్నే తీసుకోవచ్చు. ఈ రోగాలకు నిత్యం వైద్యం అవసరమవుతూనే ఉంటుంది. కాబట్టి చాలిచాలని జీతాలు, ఆదాయాల వల్ల కుటుంబం చితికిపోకుండా ఉండాలంటే ఈ పాలసీలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలసీ తీసుకునేముందు కచ్చితంగా అన్ని నిబంధనలు తెలుసుకోవాలంటున్నారు. -
తీవ్ర వ్యాధులపై బ్రహ్మాస్త్రం..!
జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అదే సమయంలో వైద్య శాస్త్రం పురోగతి, అత్యాధునిక టెక్నాలజీ, రోబోటిక్ పుణ్యమా అని మెరుగైన చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే, వైద్యుల కృషితో విజయవంతంగా అధిగమించొచ్చు. కానీ, ఇందుకు కావాల్సిందల్లా ముందస్తు సన్నద్ధత. అందుకే ఆరోగ్య బీమా ఎంత అవసరమో.. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో.. అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, ముందస్తుగా అనుకుని ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. కానీ, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ (మొండి వ్యాధులు, తీవ్ర అనారోగ్యం) కారణంగా ఎక్కువ రోజుల పాటు చికిత్స అవసరం పడితే ఏంటి పరిస్థితి..? రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్న కవరేజీ సరిపోతుందా..? చాలకపోవచ్చు. రెగ్యులర్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని రకాల వ్యాధుల్లోనూ గట్టెక్కిస్తుందని అనుకోవద్దు. తీవ్ర వ్యాధుల్లో చికిత్సల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే అప్పుడు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాలను అధిగమించేందుకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఆదుకుంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ విడిగా ప్లాన్ రూపంలోనూ లేదంటే రైడర్ రూపంలోనూ తీసుకోవచ్చు. పాలసీలో పేర్కొన్న ఏదైనా వ్యాధి బారిన పడినట్టు తేలితే నిబంధనల మేరకు పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. ఇండెమ్నిటీ పాలసీలు కేవలం ఆస్పత్రిలో అయ్యే వ్యయాలకే పరిహారాన్ని చెల్లిస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అలా కాదు. ఏక మొత్తంలో చెల్లింపులు చేస్తాయి. దీంతో ఆయా తీవ్ర వ్యాధుల చికిత్సకు అయ్యే భారీ వ్యయాలను తట్టుకోగలరు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కింద ఏకమొత్తంలో వచి్చన పరిహారాన్ని దేనికి అయినా వినియోగించుకోవచ్చు. చికిత్స కోసమే వినియోగించాలని లేదు. కనుక రెగ్యులర్ ఇండెమ్నిటీ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ కింద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, అదనంగా అయ్యే వ్యయాలను క్రిటికల్ ఇల్నెస్ కవరేజీతో గట్టెక్కొచ్చు. కానీ, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకున్న వెంటనే అమల్లోకి రాదు. ఓ చిన్న కొర్రీ ఉంటుంది. అదే సర్వైవల్ పీరియడ్. అలాగే, మరికొన్ని షరతులు కూడా ఉంటాయి. వీటిపై అవగాహనతోనే క్రిటికల్ ఇల్నెస్ కవర్ తీసుకోవాలి. సరై్వవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను ఇండివిడ్యువల్ ప్లాన్గాను, లేదంటే రైడర్‌గానూ తీసుకోవచ్చు. జీవిత బీమా కంపెనీలు దీన్ని ఎండోమెంట్, టర్మ్ ప్లాన్లకు రైడర్‌గా అందిస్తుంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండలోన్ పాలసీగా ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో సరై్వవల్ పీరియడ్ (జీవించి ఉండే కాలం) అనే క్లాజ్ ఉంటుంది. ఏదేనీ క్రిటికల్ ఇల్నెస్ (జాబితాలోని) బారిన పడితే పరిహారం అన్నది, వెంటనే రాదు. క్లెయిమ్ చేసుకోవాలంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత నిరీ్ణత రోజుల పాటు పాలసీదారు జీవించి ఉండాలి . ఉదాహరణకు 30 రోజుల సరై్వవల్ పీరియడ్ ఉందనుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతి నుంచి 30 రోజుల పాటు జీవించి ఉన్నప్పుడే క్లెయిమ్‌కు అర్హత వస్తుంది. ఈ 30 రోజుల్లోపు మరణించినట్టయితే బీమా సంస్థ నుంచి పరిహారం పొందేందుకు అర్హత లభించదు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా 30 రోజుల సరై్వవల్ పీరియడ్ అమలు చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ఈ సరై్వవల్ పీరియడ్‌ను తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే 30 రోజుల కాలాన్ని, 15 రోజులకు తగ్గించేందుకు అంగీకరిస్తోంది. ఇందుకు గాను 5 శాతం అదనంగా ప్రీమియంను చార్జ్ చేస్తోంది. మరో 5–10 శాతం అదనపు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వస్తే, అప్పుడు సరై్వవల్ పీరియడ్ 7 రోజులకు లేదంటే సున్నాకు తగ్గిస్తోంది’’అని ప్రమోట్ ఫిన్‌టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిషా సంఘ్వి తెలిపారు. వెయిటింగ్ పీరియడ్... పాలసీ కొనుగోలు చేసిన రోజు నుంచి 90–180 రోజుల వరకు క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా కానీ, క్లెయిమ్‌కు అర్హత లభించదు. ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత నుంచి పాలసీ అమలు సమయంలో ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్నా కానీ, కవరేజీ లేని కాలంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రముఖ బీమా సంస్థలు ఎక్కువ శాతం 90 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి. ఎన్నింటికి కవరేజీ..? క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో మొత్తంగా ఎన్ని వ్యాధులకు కవరేజీ వరిస్తుందన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశాల్లో ఒకటి. ఎందుకంటే నేడు జీవనశైలి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కొన్ని పాలసీలు లేదా రైడర్లు 10–20 వ్యాధులకు కవరేజీ ఆఫర్ చేస్తున్నాయి. 60 నుంచి 99 వ్యాధుల వరకు కవరేజీనిచ్చేవీ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉంటే, అంత మంచిదనుకుంటారేమో..? కానీ, ఇది తప్పుడు అభిప్రాయం. తీసుకునే ప్లాన్‌లో ముఖ్యమైన వ్యాధులకు, అది కూడా సమగ్రమైన కవరేజీ ఉందా? అన్నదే కీలకం. ‘‘60 లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీనిచ్చే ప్లాన్, కేన్సర్‌ను పలు దశలుగా వేరు చేసి ఆఫర్ చేయవచ్చు. మరో పాలసీలో కేవలం 25 వ్యాధులకే కవరేజీ ఉండొచ్చు. ఈ ప్లాన్ అన్ని కేన్సర్లను ఒక్కటిగానే పరిగణించి, నిర్ధారణ అయిన వెంటనే క్లెయిమ్‌కు అనుమతించొచ్చు’’అని ఎలిఫెంట్ డాట్ ఇన్ (అలియన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్) ప్రొడక్ట్ హెడ్ కల్పేష్ చవాన్ పేర్కొన్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం టాప్–5 తీవ్ర వ్యాధులకు సంబంధించి 90% క్లెయిమ్‌లు వస్తున్నాయి. టాప్–10 క్రిటికల్ ఇల్‌నెస్‌లు కాకుండా, ఇతర వ్యాధుల కారణంగా వచ్చే క్లెయిమ్‌లు చాలా తక్కువ. కనుక దాదాపు 60 అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉందంటే, వాటి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఏ ప్లాన్ తీసుకోవాలనే సందేహం రావచ్చు. అధిక వ్యాధులకు కవరేజీ ఇస్తూ, అందులో ఒక్కో వ్యాధి వారీ కవరేజీ పరిమితి లేకపోవడం, ఉన్నా మెరుగైన కవరేజీ, అన్ని కేన్సర్లను ఒకటిగానే పరిగణించేట్టు అయితే ఆ ప్లాన్‌ను తీసుకోవచ్చు. లేదంటే ఎలాంటి షరతుల్లేకుండా ఆఫర్ చేసే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, అది టాప్ 25–30 వ్యాధులకు కవరేజీ ఇచ్చేది అయినా నిస్సందేహంగా తీసుకోవచ్చు. సంఖ్య కంటే షరతులు, కవరేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్ – స్టాండెలోన్ ప్లాన్ క్రిటికల్ ఇల్‌నెస్‌ను రైడర్‌గా లేదంటే, స్టాండలోన్ పాలసీగా తీసుకుంటే ఏవైనా వ్యత్యాసాలు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. రైడర్ రూపంలో అయితే సులభంగా తీసుకోవచ్చు. బీమా పాలసీ తీసుకునే సమయంలోనే ఈ రైడర్‌ను కూడా ఎంపిక చేసుకుంటే, ఒకేసారి వైద్య పరీక్షలు చేస్తారు కనుక, మళ్లీ విడిగా తీసుకోవడాన్ని నివారించొచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్‌తోపాటు తీసుకుంటే కవరేజీ పరంగా పరిమితి ఉంటుంది. జీవిత బీమా కవరేజీ మించి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కవరేజీ తీసుకోవడానికి అనుమతించరు. అంటే కోరుకున్నంత కవరేజీ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. జీవిత బీమా ప్లాన్‌తో వచ్చే రైడర్లలో సాధారణంగా వ్యాధి ముదిరిన దశలోనే కవరేజీ అనే షరతు ఉంటుంది. ఉదాహరణకు కేన్సర్ మొదటి దశను ఇవి కవర్ చేయవు. అలాగే, రైడర్లలోనూ రెండు రకాలు ఉన్నాయి. కాంప్రహెన్సివ్ రైడర్ అయితే, బేస్ పాలసీ కవరేజీకి అదనంగా ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ అయితే, బేస్ పాలసీలో భాగంగానే కవరేజీ ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ తీసుకుని ఏదైనా తీవ్ర వ్యాధి బారిన పడి క్లెయిమ్‌కు వెళితే, ఆ మేరకు బేస్ కవరేజీ తగ్గిపోతుంది. స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో కవరేజీ విస్తృతంగా ఉంటుంది. పైగా జీవిత బీమా లేదా టర్మ్ ఇన్సూరెన్స్‌తో తీసుకునే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ జీవితాంతం పనిచేయదు. జీవిత బీమా ఎంత కాలానికి తీసుకుంటారో? అంత వరకే పరిమితం అవుతుంది. విడిగా తీసుకుంటే మీరు జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ సమగ్రంగా చదవడం ద్వారా వేటికి కవరేజీ వస్తుంది, వేటికి రాదు? షరతులు అన్నీ తెలుస్తాయి. స్టాండలోన్ ప్లాన్ ప్రీమియం, రైడర్‌తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. స్టాండలోన్ ప్లాన్‌లో ప్రీమియం ప్రతి కొన్నేళ్లకోసారి పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుదల, రైడర్‌తో పోలి్చనప్పుడు అధికంగా ఉంటుంది. రైడర్లో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, ప్రతికూలతలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. జీవితాంతం రెన్యువల్‌కు అవకాశం ఉందా? వ్యాధులకు విస్తృతమైన కవరేజీ ఉందా? సర్వైవల్ పీరియడ్ జీరో లేదంటే 7–15 రోజులుగా ఉందా? (వీలైనంత తక్కువ) అని కూడా చూడాలి. అలాగే, విడిగా ఒక్కో వ్యాధికి సంబంధించి కవరేజీ ఎందులో ఎక్కువ ఉంటే, అదే అనుకూలంగా పరిగణించొచ్చు. ఒకవేళ రైడర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తే, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్‌ను 85–90 ఏళ్ల కాలానికి తీసుకుని, రైడర్‌ను జోడించుకోవడం సరైనది. అప్పుడు జీవితాంతం టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటికే జీవిత బీమా పాలసీ తీసుకుని ఉంటే, అటువంటి వారు ఎలాంటి సందేహం లేకుండా స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను తీసుకోవడం సరైనది. మరీ ముఖ్యంగా కవరేజీ విస్తృతంగా ఉండాలని చెప్పి, భారీ ప్రీమియంతో కూడిన ప్లాన్ తీసుకుంటే, ఆర్థికంగా భారం అవుతుందేమో ఓసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా వ్యాధి బారిన పడితే, ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి, ప్రస్తుత బడ్జెట్‌ను భారంగా మార్చుకోరాదు. కనుక తమ పూర్వీకుల ఆరోగ్య చరిత్ర, వ్యాధుల రిస్‌్కను వైద్య నిపుణుల సూచనతో మదింపు వేసుకుని, అప్పుడు ఎంతకు కవరేజీ తీసుకోవాలనే విషయంలో స్పష్టతకు రావాలి. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, సాధారణ అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే ఆదుకోదు. కనుక రెగ్యులర్ హెల్త్ ప్లాన్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే క్రిటికల్ ఇల్‌నెస్‌ను బెనిఫిట్ ప్లాన్‌గా చెబుతారు. రెగ్యులర్ హెల్త్‌ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను ఒకే సంస్థ నుంచి తీసుకుంటే కొంత అనుకూలం. టాప్ క్రిటికల్ ఇల్‌నెస్‌లు / చికిత్సలు కేన్సర్, యాంజియోప్లాస్టీ(ప్రొసీజర్), హార్ట్ఎటాక్, అరోటా సర్జరీ, హార్ట్ వాల్వ్ వైఫల్యం, కార్డియో మయోపతి, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, సీఏబీజీ, క్రానిక్ లంగ్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, కోమ, స్ట్రోక్, అల్జీమర్స్, మసు్క్యలర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, బ్రెయిన్ సర్జరీ, పోలియోమైలైటిస్, మోటార్ న్యూరాన్ డిసీజ్, బ్యాక్టీరియల్ మెనింజైటిస, ఎన్సెఫలైటిస్, ఎయిడ్స్ (రక్త మార్పిడి వల్ల), థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు. కవరేజీ ఎంత..? గుండె జబ్బులకు సంబంధించి శస్త్రచికిత్సల ఖరీదు నేడు 2–5 లక్షల మధ్య ఉంది. వైద్య ద్రవ్యోల్బణం 10 శాతం పైనే ఉంటోంది. కనుక భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత చికిత్సల చార్జీలకు ఐదు నుంచి పది రెట్లు అధికంగా కవర్ తీసుకోవాలి. లేదంటే కనీసం నాలుగైదేళ్ల వార్షిక ఆదాయానికి సమానమైన కవర్ తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.5 లక్షలు ఉందంటే, కనీసం రూ.25 లక్షలు అవసరం. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి, ఇండెమ్నిటీ హెల్త్ కవరేజీ చాలనప్పుడు, అదనంగా అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు, ఆ కాలంలో నిలిచిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ మాత్రమైనా ఉండాల్సిందే. -
సహజీవనం ప్రమాదకరమైన జబ్బు
న్యూఢిల్లీ: సహజీవనం ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాన్ని సమాజం నుంచి పూర్తి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సహజీవన విధానానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని కోరారు. లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పాశ్చాత్య దేశాల్లో సహజీవన సంబంధాలు సర్వసాధారణం. కానీ, ఈ చెడ్డ విధానం మన సమాజంలో వ్యాధి మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని పరిణామాలు భయంకరంగా ఉంటున్నాయి. ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్ధావాకర్, అఫ్తాబ్ పూనావాలా లివ్–ఇన్ రిలేషన్ షిప్ ఎంతటి దారుణానికి దారి తీసిందో చూస్తున్నాం’ అని గుర్తుచేశారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించే మనదేశంలో విడాకుల శాతం 1.1 శాతం మాత్రమేనన్నారు. అదే అమెరికాలో విడాకుల శాతం 40 శాతం వరకు ఉంటోందన్నారు. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇలాంటి బంధాల విషయంలో ఇరువైపులా తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించారు. సామాజిక, వ్యక్తిగత విలువలు, కుటుంబాల నేపథ్యాలను బట్టి పెళ్లిళ్లను పెద్దలు కుదర్చటం మన దేశంలో అనాదిగా వస్తోందని గుర్తు చేశారు. ‘వసుధైవ కుటుంబకమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. మిగతా దేశాలతో పోలిస్తే మన సామాజిక వ్యవస్థ భిన్నమైంది. భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ భావనను యావత్తు ప్రపంచమే మెచ్చుకుంది’అని ఆయన తెలిపారు. -
రోసాలిన్ కార్టర్ కన్నుమూత
అట్లాంటా(అమెరికా): మానసిక వైద్య సంస్కరణల కోసం అహరి్నశలు కృషిచేసిన మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య, మానవతావాది రోసాలిన్ కార్టర్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల రోసాలిన్ ఆదివారం జార్జియా రాష్ట్రంలోని ప్లేన్స్ నగరంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘నాకు అత్యవసరమైన ప్రతిసారీ సరైన సలహాలిచి్చంది. చక్కని మార్గదర్శిగా ఉంటూ జీవితాంతం తోడుగా నిలిచింది’ అని 99 ఏళ్ల భర్త జిమ్మీ కార్టర్ పేర్కొన్నారు. -
అధిక కవరేజీ వైపు మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కస్టమర్లలో అధిక కవరేజీ ఉండే ప్లాన్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరిగిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ బాలసుబ్రమణియన్ తెలిపారు. యాక్సిడెంటల్ డిజేబిలిటీ, ప్రీమియం వెయివర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉండే టర్మ్ ప్లాన్లకు, జీవితంలోని వివిధ దశల్లో అవసరాలకు అనుగుణమైన కవరేజీనిచ్చే వినూత్న ప్లాన్లకు ఆదరణ పెరుగుతోందని వివరించారు. పొదుపునకు సంబంధించి కచ్చితమైన రాబడినిచ్చే సాధనాలపై ఆసక్తి ఏర్పడిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పిస్తూ జీవితకాలం ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ రిటర్వ్ ఆఫ్ ప్రీమియం వంటి వినూత్న పథకాలను తాము అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు కచ్చితమైన రాబడులిచ్చే పథకాలను కస్టమర్లు ఇష్టపడుతుండటంతో సుఖ్ సమృద్ధిలాంటి పథకాలు ఉన్నాయన్నారు. ఇవి కచ్చితమైన రాబడులతో పాటు బోనస్‌ల వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయని శ్రీనివాస్ చెప్పారు. రిటైర్మెంట్ ప్లానింగ్ ముఖ్యం.. జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవిత కాలం పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ కోసం తగిన ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోందని శ్రీనివాస్ చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుందని, ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్నదొక్కటే ఆదాయ మార్గంగా ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఆర్థికంగా ఒత్తిడి లేని రిటైర్మెంట్ జీవితం గడపాలంటే సరైన ప్రణాళిక వేసుకుని, తగిన సాధనాల్లో సాధ్యమైనంత ముందు నుంచీ ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని శ్రీనివాస్ వివరించారు. రిటైర్మెంట్ ప్రణాళికను ప్రధానంగా రెండు దశలుగా వర్గీకరించవచ్చని ఆయన చెప్పారు. మొదటి దశలో నిధిని ఏర్పాటు చేసుకోవడం, రెండో దశలో దాన్ని వినియోగించుకోవడం ఉంటుందన్నారు. జీవిత బీమా కంపెనీలు అందించే యులిప్స్, సాంప్రదాయ సేవింగ్స్ సాధనాల్లాంటివి దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకునేందుకు ఉపయోగపడగలవని శ్రీనివాస్ వివరించారు. అధిక రిస్కును భరించగలిగే వారు యులిప్‌లను ఎంచుకోవచ్చని, రిస్కులను ఎక్కువగా ఇష్టపడని వారు సాంప్రదాయ సేవింగ్స్ పథకాలను ఎంచుకోవచ్చన్నారు. యాన్యుటీలకు సంబంధించి జాయింట్ లైఫ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం స్థిరమైన ఆదాయం లభించగలదని ఆయన చెప్పారు. -
Insurance: బేసిక్ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం
ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది. కానీ, బేసిక్ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్ హెల్త్ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం. రైడర్ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్‌ను తీసుకోవచ్చు. లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్‌ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది. రూమ్ రెంట్ వెయివర్ రూమ్ రెంట్ వెయివర్ రైడర్ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ప్లాన్లలో స్టాండర్డ్ లేదా సెమీ ప్రైవేటు రూమ్లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్ రెంట్‌ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్ రెంట్ వెయివర్ రైడర్‌తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్ అవసరపడుతుంది. మెటర్నిటీ రైడర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్‌ను జోడించుకోవడం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్‌గా తీసుకోవడం మంచిది. కేన్సర్ లేదా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. వీటిని బెనిఫిట్ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్‌తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్ ప్లాన్‌ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్ప్లాన్తో పాటు తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవర్ ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే. వ్యక్తి ప్రమాద బీమా క్రిటికల్ ఇల్నెస్ మాదిరే పర్సనల్ యాక్సిడెంట్ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్ ఆదుకుంటుంది. ఓపీడీ కవరేజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్ పెషెంట్‌గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు. ఎన్సీబీ ప్రొటెక్షన్ ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్ చేసుకున్నా అప్పటికే ఎన్సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్ కాపాడుతుంది. -
మీకు ‘క్రిటికల్’ కవచం ఉందా?
ఉదయ్ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. వయసు 46ఏళ్లు. అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాల్లేవు. ఓ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. కానీ, బిల్లు రూ.11 లక్షలు అయ్యింది. కానీ, ఉదయ్‌కు రూ.5లక్షల వరకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అందులోనూ రూ.40 వేల వరకు కవరేజీ రాలేదు. దీంతో రూ.6.40 లక్షలను తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వైద్య ఖర్చులకు తగ్గ రక్షణ లేకపోతే పడే ఆర్థిక భారం ఎలా ఉంటుందన్నది ఈ ఉదాహరణ చూసి తెలుసుకోవచ్చు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పని ఒత్తిళ్లు ఇవన్నీ కలసి ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడతామో ఊహించలేకుండా ఉంది. అందుకే తమవంతుగా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంది. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.. కేన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం లేదా గుండె సంబంధిత తీవ్ర వ్యాధుల బారిన పడితే ఆ బాధ ఒక్కరికే పరిమితం కాదు. ఆ కుటుంబం మొత్తంపైనా ప్రభావం ఉంటుంది. ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. మంచి చికిత్స కోసం ఆస్పత్రిని ఎంపిక చేసుకోవడంతోపాటు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడితే అప్పటి వరకూ ప్రతీ నెలా వచ్చిన ఆదాయానికి కూడా బ్రేక్ పడొచ్చు. శాశ్వత ఉద్యోగ నష్టం ఏర్పడితే ఆర్థికంగా ఆ కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరికీ ముందు జాగ్రత్త, రక్షణ చర్యలు అవసరం. తీవ్ర అనారోగ్య సమస్యలన్నవి (క్రిటికల్ ఇల్నెస్) ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేము. ఉదాహరణకు కేన్సర్ మూడోదశలో ఉన్నవారికి దీర్ఘకాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ. కేన్సర్ రెండో దశలోనే బయటపడితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. గుండెపోటు తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూ త్ర పిండాల సమస్యలు వెలుగు చూస్తే దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. గుండెజబ్బులు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేవే అధికం. అందుకే వీటి విషయంలో సన్నద్ధత అవసరమని నిపుణులు సూ చిస్తుంటారు. కొన్ని వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం ఏర్పడతాయి. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం తదితర క్లిష్టమైన అనారోగ్యాలను మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం.. దేశంలో కేన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు (వార్షిక రేటు) పెరుగుతాయని అంచ నా. ప్రస్తుత 13.9 లక్షలతో పోలిస్తే 12% పెరగనున్నాయి. దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒక టి గుండె జబ్బుల కారణంగానే నమోదవుతోంది. మనదేశంలో 2018 నాటికి 1.29 కోట్ల జనాభా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా. ఆర్థిక భారం ఎంతో.. తీవ్ర అనారోగ్య సమస్యల్లో చికిత్సా వ్యయాలు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ తరహా వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరంపడతాయి. ‘‘కేన్సర్ అయితే ఒక్క విడత శస్త్రచికిత్స లేదా కీమోథెరపీతో సరిపోదు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్రైటింట్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా తెలిపారు. కేన్సర్ చికిత్సల కోసం రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని.. అత్యాధునిక చికిత్సలు తీసుకునేట్టు అయితే ఈ వ్యయం రూ.కోటి వరకు కూడా పెరిగిపోవచ్చని చెప్పారు. ‘‘గుండె జబ్బులకు చికిత్స కోసం మెట్రో ల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.1.5–15 లక్షల వరకు ఖర్చవుతుంది. స్టెంట్, బైపాస్ సర్జరీ లేదా వాల్వ్ మార్చడంపై ఈ వ్యయం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది’’అని ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ముఖ్య పంపిణీ అధికారి అనూప్శేత్ పేర్కొన్నారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి పైగా ఉంటోంది. అంటే చికిత్సల వ్యయాలు ఏటేటా ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. టైర్–2, టైర్ 3 పట్టణాలతో పోలిస్తే టైర్–1 పట్టణాల్లో చికిత్సల వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కనుక 35 ఏళ్లు దాటిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారికి తప్పకుండా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రణాళిక ప్రకారం.. ఆరోగ్యం విషయంలో ఊహించని ఖర్చులను తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరికీ ప్రణాళిక అవసరం. ‘‘తీవ్ర అనారోగ్యాల విషయమై ముందు జాగ్రత్త పడే వారు 3 రకాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది హాస్పిటలైజేషన్. ఆస్పత్రి లో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చులను బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాయంతో గట్టెక్కవచ్చు. కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం పాటు ఔషధాలు, పరీక్షలు అవసరంపడతాయి. కానీ, ఇండెమ్నిటీ ప్లాన్లు అన్నవి ఒక్కసారి ఒక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి క్లెయిమ్ చేశాక.. అదే ఏడాది మళ్లీ అదే అనారోగ్యానికి సంబంధించి పరిహారం అం దించవు. కనుక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అవసరం. మూడోది ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేలా ఉండాలి’’ అని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్డే సూచన. అందుకే భిన్న రకాల బీమా ప్లాన్లకుతోడు అత్యవసర నిధి కూడా అవసరం అని గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్లనే ఇండెమ్నిటీ ప్లాన్లు అని కూడా అంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు పరిహారం చెల్లిస్తాయి. జీవితంలో ఏ దశలో ఉన్నారు, ఏ పట్టణంలో నివసిస్తున్నారు, అక్కడ చికిత్సల వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా బేసిక్ ఇండెమ్నిటీ కవరేజీని నిర్ణయించుకోవాలి. ఢిల్లీ, ముంబై వంటి టైర్–1 పట్టణాల్లో అయితే రూ.20–25 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ఈ కవరేజీ కూడా నూరు శాతం రక్షణనివ్వదు. ఎందుకంటే కొన్ని చికిత్సల ఖర్చులు భారీగా ఉన్నాయి. ఉదాహరణకు లివర్ మార్పిడి చికిత్సకు రూ.40–50లక్షలు అవుతుంది’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్మాల్డే వివరించారు. టైర్–2, 3 పట్టణాల్లో ఉంటే కనీసం రూ.10 లక్షలు, అదే చిన్న పట్టణాల్లోని వారు కనీసం రూ.5లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవడం అవసరం. అధిక కవరేజీతో ప్లాన్ తీసుకోవాలంటే అందుకు ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు తక్కువ మొత్తంతో బేసిక్ ప్లాన్ తీసుకుని, అధిక కవరేజీనిచ్చే టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షల ప్లాన్ తీసుకుని, రూ. 15 లక్షల టాపప్ జోడించ వచ్చు. లేకుండా వస్తుంటాయి. కొన్ని కంపెనీలు స్వల్ప ప్రీమియం ను కూడా వసూ లు చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఇండెమ్నిటీ ప్లాన్‌కు పూర్తి భిన్నమైనది. బీమా ప్లాన్ జాబితాలోని తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే అప్పుడు ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లించేదే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. బేసిక్ హెల్త్ ప్లాన్‌లో కవర్ కాని ఖర్చులను ఈ ప్లాన్ ఆదుకుంటుంది. ఉద్యోగం ఆగిపోవడం లేదా కోల్పోవడం వల్ల ఆదాయ నష్టాన్ని ఈ రూపంలో కాస్తంత అయినా భర్తీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన వార్షిక స్థూల ఆదాయానికి 5–10 రెట్ల వరకు కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకోవడం సూచనీయం. అయితే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో ఒక నిబంధన విషయమై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ వెలుగు చూసిన తర్వాత సదరు రోగి కనీసం ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం చెల్లిస్తామనే నిబంధన ఉంటుంది. సాధారణంగా 30 రోజుల కాలాన్ని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు స్ట్రోక్ వచ్చి చనిపోతే పరిహారం రాదు. స్ట్రోక్ వచ్చి 30 రోజులు ప్రాణాలతో ఉంటేనే ఈ ప్లాన్‌లో పరిహారం లభిస్తుంది. వాస్తవానికి తీవ్ర అనారోగ్యంతో జీవించి ఉన్న వారికే భారీగా ఖర్చు ఎదురవుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 30 క్రిటికల్ ఇల్నెస్ల వరకూ కవరేజీనిచ్చే ప్లాన్లు మార్కెట్లో ఉన్నాయి. కేన్సర్ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారు ఆయా వ్యాధులకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లను ఎంచుకోవాలి. ప్రతీ క్రిటికల్ ఇల్నెస్లోనూ విడిగా ఏఏ సమస్యలకు కవరేజీ ఉంటుందన్న వివరాలు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో వివరంగా ఉంటుంది. ఎక్కువ రిస్క్‌లు ఉండే గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, కోమా, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి కవరేజీ తప్పకుండా ఉండేలా ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. పరిశీలన తర్వాతే..: నియమ, నిబంధనలను కచ్చితంగా చదివిన తర్వాతే క్రిటికల్ఇల్నెస్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను చూస్తే.. కొన్ని రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకే పూర్తి కవరేజీ లభిస్తుంది. కొన్నింటి విషయంలో చివరి దశలోనే పరిహారానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, లివర్ సమస్యల్లో అయితే క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది కేవలం పనిచేయని, పూర్వపు స్థితికి తీసుకురాలేట్టయితేనే కవరేజీ లభిస్తుంది. అదే కేన్సర్, స్ట్రోక్, గుండెపోటు అయితే ఏ దశలో ఉన్నప్పటికీ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో కవరేజీ లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు రైడర్ రూపంలో వచ్చే క్రిటికల్ ఇన్లెస్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటికంటే కూడా విడిగా ప్లాన్‌ను తీసుకోవడం వల్ల సమగ్రమైన కవరేజీతో వస్తాయి. వీటిల్లో పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కేన్సర్ మూడో దశలోనే పరిహారం చెల్లిస్తామన్న నిబంధన ఉంటే, స్టేజ్–2 బయటపడినప్పటికీ పరిహారం రాదు. అందుకే వైద్యం కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ‘‘కనీసం రూ.3–5 లక్ష లు అయినా ఉండాలి. మెట్రోల్లో ఉండే వారికి రూ.8–10 లక్షలు అత్యవసర నిధిగా ఉంచుకోవడం అవసరం’’ అని మాల్డే సూచించారు. తీవ్ర వ్యాధులకు చికిత్సా వ్యయాలు కేన్సర్ ► శస్త్రచికిత్సకు రూ.3–6 లక్షలు ► కీమోథెరపీ ఒక్కో సెషన్‌కు రూ.50,000–2లక్షలు. సుమారు రూ.5–10 లక్షల వరకు ఖర్చు ► రేడియోథెరపీ రూ.2–20లక్షలు గుండె జబ్బులు ► యాంజియోగ్రఫీ రూ.20,000 ► యాంజియోప్లాస్టీ రూ.2.5–6.5లక్షలు ► వాల్వ్ సర్జరీ రూ.2.5–6లక్షలు ► బైపాస్ సర్జరీ రూ.2–5లక్షలు మూత్రపిండాల వైఫల్యం ► డయాలసిస్ రూ.2,000–5,000 ప్రతీ సెషన్‌కు (వారానికి మూడు పర్యాయాలు) ► మూత్రపిండాల మార్పిడి రూ.5–10లక్షలు ► బ్రెయిన్‌స్ట్రోక్ రూ.5–10 లక్షలు నోట్: ప్రాంతాలను బట్టి ఈ వ్యయాల్లో మార్పులు ఉంటుంటాయి. హెల్త్ ప్లాన్ ప్రీమియం ప్లాన్ కవరేజీ ప్రీమియం (రూ.లలో) (రూ.లలో) బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ 10 లక్షలు 8,265 క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ 30 లక్షలు 4,551 నోట్: 30 ఏళ్ల ఢిల్లీ నివాసికి సంబంధించిన అంచనాలు -
మాదాల రంగారావు పరిస్థితి విషమం
విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్ హాస్పిటల్ వైద్యులు చికిత్స చేశారు. అప్పటి నుంచి రంగారావు స్టార్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో హాస్పిటల్ చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకు డయాలిసిస్ చేస్తున్నట్టుగా మాదాల రవి తెలిపారు. -
‘అమ్మను బతికించండి’
ఉప్పల్: క్లిష్టమైన జబ్బుతో బాధ పడుతున్న ఓ మహిళ...వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని దాతలను ఆర్థిస్తోంది. దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాల్సిన స్థితిలో తీవ్ర వేదనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే....వరంగల్ జిల్లా బొబ్బరోనిపల్లెకు చెందిన ఇరుసవడ్ల విజయ కుమారుడి చదువు కోసం నగరానికి వచ్చి ఉప్పల్ చిలుకానగర్‌లో ఉంటోంది. మూడేళ్ల క్రితం ఆమె సర్వైకల్ స్పాండిలైటిస్, డోరసల్ స్పాండిలైటీస్ అనే వ్యాధి బారిన పడింది. వైద్యం కోసం దాదాపు రూ. 6 లక్షల వరకు ఖర్చు చేసింది. ఆపరేషన్ చేస్తే తప్ప నయం కాదని, రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు వెల్లడించినట్లు విజయ ‘సాక్షి’కి తెలిపారు. తన చదువు కోసం జీవితాన్ని ధారపోసిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే కుమిలిపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని కుమారుడు నరేష్ ఆవేదనతో తెలిపారు. దాతలు ఆర్థిక సహాయం చేస్తే తన తల్లిని కాపాడుకుంటానని విజ్ఞప్తి చేశారు. సహాయం చేయదల్చుకున్న దాతలు 9989291559లో సంప్రదంచవచ్చు. లేదా హైదరాబాద్ దుగ్గొండి శాఖలోని ఐ.నరేష్ ఎస్బీ ఐ ఖాతా నంబర్: 62457833963లో జమచేయొచ్చు -
మహిళకూ ఆరోగ్య బీమా అవసరమే..
మహిళలూ ప్రస్తుతం బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. హోమ్మేకర్గా తన ఇళ్లు, కుటుంబ భద్రతకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగంలో వృత్తిపరమైన బరువు బాధ్యతలను మోస్తున్నారు. ఇలా ప్రతి విషయం, విభాగంలో ఒక స్వతంత్ర నిర్ణేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె సైతం తన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడానికి, ఆయా సందర్భాల్లో సమస్యలను అధిగమించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్య వ్యయాల భారం... తరచూ చేయించుకునే ఆరోగ్య పరీక్షలు... క్రమం తప్పని వ్యాయామ ప్రణాళికలు... ఆరోగ్యవంతమైన ఆహారం ఇవన్నీ సరే. ఒక్కొక్కసారి ఆరోగ్యసమస్యలు అనుకోకుండా వచ్చిపడతాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. ఇలాంటి సమస్యను కూడా ఎదుర్కొనగలిగే స్థాయిలో ప్రణాళికలు రూపొం దించుకోవాల్సిన అవసరం ఉంది. కేన్సర్, బ్యాక్టీరియా పరమైన తీవ్ర ఇన్ఫెక్షన్లు, బ్రెయిన్ ఫీవర్ వంటి సమస్యలు ఆరోగ్యాన్ని ప్రమాదాల్లో పడేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ మహిళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న అంశమని టాటా మెమోరియల్ సెంటర్ ఇటీవలి ఒక అధ్యయనంలో తేల్చింది. మరో సమస్యాత్మకమైనది సర్వికల్ కేన్సర్. దీనివల్ల వార్షికంగా దాదాపు 74,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఆయా వ్యాధుల బారిన పడితే వైద్య వ్యయాలు భరించలేని భారంగా మారుతున్నాయి. నేటి మహిళ ఇంటి పనులకే పరిమితం కావడంలేదు. ఒకవేళ ఇంట్లోనే ఉంటున్నా... కుట్లో... అల్లికలో... ఇలా ఏదో ఒక కష్టంచేసి... ఎంతోకొంత సంపాదిస్తున్నారు. ఒక్కొక్క సందర్భాల్లో వీరి రెక్కల కష్టమే సంసారం గడవడానికి సాధనమవుతోంది. ఇలాంటి మహిళల విషయంలో ఆమె ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే... మొత్తం కుటుంబంపై ఈ ప్రతికూల పరిస్థితి పడుతుంది. ‘క్రిటికల్ ఇల్నెస్’ బీమా... ధీమా ఈ నేపథ్యంలో మహిళలకూ ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మామూలు ఆరోగ్య బీమా పాలసీలు వైద్య అవసరాలను పెద్దగా తీర్చలేకపోవచ్చు. ముఖ్యంగా ‘తీవ్ర వ్యాధుల’ (క్రిటికల్ ఇల్నెస్) సమస్యలు ఎదురయినప్పుడు ఆయా ఇబ్బందులను అధిగమించడానికి ‘క్రిటికల్ ఇల్నెస్’ రైడర్లతో సమగ్ర పాలసీలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు అపారం. ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ‘తీసుకున్న బీమా మొత్తం అంతా చెల్లించేలా’(లమ్సమ్) బీమా కంపెనీలు ప్రొడక్టులు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇవి ఒక్కొక్క సందర్భంలో ఆసుపత్రి వ్యయాలకే సరిపోని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ‘క్రిటికల్ ఇల్నెస్’ రైడర్‌తో కూడిన ఆరోగ్య బీమా పాలసీల ఎంపిక అవసరం. అవసరాలకు తగిన పాలసీలు... పలు బీమా కంపెనీలు ప్రస్తుతం మహిళల ఆరోగ్యానికి, వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక బీమా ప్రొడక్టులను అందిస్తున్నాయి. బ్రెస్ట్ కేన్సర్, ఫ్యాలోపియన్ ట్యూబ్ కేన్సర్, యూటెరిన్ కేన్సర్, ఓవేరియన్ కేన్సర్, వెజైనల్ కేన్సర్, సర్వికల్ కేన్సర్ వంటి వ్యాధులను కవర్ చేసే బీమా ప్రొడక్టులు ఇందులో ఉన్నాయి. ఆసుపత్రిలో, అటుపై డిశ్చార్జ్ అనంతరం వ్యయాలను సైతం కవర్చేసే ప్రొడక్టులు ఉన్నాయి. వ్యక్తిగత ప్రమాద బీమా, పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్... వంటివి కూడా ప్రత్యేకంగా మహిళలకు ఉద్దేశించినవి ఉన్నాయి. లమ్సమ్ (ఏకమొత్తం) నుంచి రికవరీ సమయంలో ప్రయోజనం చేకూర్చేలా... అంటే ఈఎంఐ, స్కూల్ ఫీజులు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, రోజూవారీ జీవన వ్యయాల వరకూ కవర్చేసే ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ తోడు... హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్ను శాఖ 80డీ సెక్షన్ కిందకు కూడా వచ్చే విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. అవసరాలకు అనుగుణంగా ఈ ప్రొడక్టులను వినియోగించుకుంటే... మీ కుటుంబ ఆర్థిక ఆరోగ్యానికి ‘బీమా’ రక్ష. డివిడెండ్ ధమాకా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీ డివిడెండ్లను ప్రకటిస్తున్నాయి. టాటా మ్యూచువల్ ఫండ్ ప్యూరీ ఈక్విటీ పథకంపై 40 శాతం, యూటీఐ ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌పై 22 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్స్‌కు రికార్డు తేదీ జనవరి 19గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి యూనిట్లు కలిగి వున్న వారికి ప్రతీ యూనిట్‌పై టాటా ఈక్విటీ ఫండ్ రూ. 4.4, యూటీఐ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ రూ. 2.2 డివిడెండ్ లభిస్తుంది. ఐసీఐసీఐ ఎంఎఫ్‌కి గుర్తింపు 2014 సంవత్సరానికి గాను అత్యుత్తమ ఫండ్ హౌస్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎంపికయ్యింది. ఆసియాలో గత 12 ఏళ్లుగా మంచి పనితీరును కనపరుస్తున్నందుకు గాను ఆసియా అసెట్ మేనేజ్మెంట్ జర్నల్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కొటక్ బ్యాంక్ సోషల్ సేవింగ్ సోషల్ నెట్వర్క్ సైట్స్ ఫేస్బుక్, ట్వీటర్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి సేవర్’ పేరుతో సోషల్ సేవింగ్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్ చేసిన మొత్తంపై 6%, అంతకంటే తక్కువ మొత్తంపై 5% వడ్డీని జిఫి సేవర్ అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ ఖాతాదారుల్లో 20-25% మంది ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. -
కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. -
'కాకా పరిస్థితి విషమంగానే ఉంది'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేర్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కేర్ ఆస్పత్రి డాక్టర్లు.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా వెంకటస్వామికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు. -
‘క్రిటికల్ ఇల్నెస్’ బీమాతో ధీమా
ఆర్థిక సంస్కరణలు జెట్ స్పీడులో అమలవుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల నిర్వహణలో తీరికలేకుండా అదేస్పీడులో గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడీ తప్పడం లేదు. దీంతో కార్యకలాపాల నిర్వహణ అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ క్రమంలో గుండెపోటు, కేన్సర్, అవయవ మార్పిడి, పక్షవాతం, అంధత్వం, అచేతనం (డిజెబిలిటీ), ప్రాణాంతక అనారోగ్యం (టెర్మినల్ ఇల్నెస్) వంటి సమస్యలు జీవిత గమనాన్ని నిర్దేశించుకున్న మంచి లక్ష్యానికి చేరువకాకుండా చేస్తున్నాయి. దీనివల్ల అటు సంపాదించిన సొమ్ము కరిగిపోవడమే కాకుండా, కుటుంబం మొత్తం కష్టాల్లో చిక్కుకునే పరిస్థితి. ఈ తరహా పరిస్థితులు తలెత్తినప్పుడు సమర్థవంతమైన రీతిలో ఎదుర్కొనడానికి, ఆర్థిక కష్టనష్టాల నుంచి బయటపడ్డానికి కూడా మార్గం ఉంది. అదే ‘క్రిటికల్ ఇల్నెస్’ను (తీవ్ర అస్వస్థత) కవర్చేసే బీమా. ప్రాధాన్యత జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఎక్కువమందికి అవగాహన ఉంటుంది. అయితే ్ర‘కిటికల్ ఇల్నెస్’ బీమా పాలసీపై అవగాహన చాలా తక్కువ. దీనివల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ‘క్రిటికల్ ఇల్నెస్’ అనే విభాగంలో ఉన్న వ్యాధులకు గురైనప్పుడు ఈ పాలసీ పరిధిలో ఉన్న వారు కొండంత ధైర్యంగా ఉండడానికి ఈ బీమా ఎంతో దోహదపడుతుంది. ప్రయోజనాల విషయానికి వస్తే... క్రిటికల్ ఇల్నెస్ జాబితాలోని అనారోగ్యం బారిన పడ్డారని పరీక్షల్లో వెల్లడికాగానే బీమా చేసిన మొత్తం చేతికి అందుతుంది. బీమా చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా అందించలేని ప్రయోజనాలు క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్సులో ఉన్నాయి. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారీమొత్తం అందుతుంది తప్ప అదే వ్యక్తి తీవ్ర అనారోగ్యంపాలై కోలుకున్నపుడు నయా పైసా కూడా రాదు. ఇక ఆరోగ్య బీమాలో చాలా రకాల తీవ్ర అస్వస్థతలను మినహాయిస్తుంటారు. చికిత్స వ్యయాలు పూర్తిగా బీమా పరిధిలోకి రాని పరిస్థితులూ ఉంటాయి. వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం. ప్రాణాల మీదకు వచ్చిన వ్యాధి భవిష్యత్తులో మీ భవిష్యత్తు వ్యాపార లేదా ఉద్యోగ కార్యకలాపాల బాధ్యతల నిర్వహణకుగానీ లేదా వృద్ధికి గానీ విఘాతం కలిగించకూడదు. చికిత్స వ్యయాలతో సంబంధం లేకుండా బీమా సొమ్ము మొత్తం చేతికి అందుతుంది. అయితే ప్లాన్‌కూ ప్లాన్‌కూ వేర్వేరు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. ‘క్రిటికల్ ఇల్నెస్’ బీమా తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన నాలుగు అంశాలు ఇవి... 1. కవరేజ్... మీకు బీమా కవరేజ్ ఎంత అవసరం. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ మీ నుంచి పాలసీ నిమిత్తం ఎంత మినహాయిస్తోంది. ప్రయోజనాలు ఏమి ఉన్నాయి. ఆయా అంశాలు పరిశీలించిన మీదట మీకు మరెంత పాలసీ పరమైన రక్షణ కావాలో మీరు నిర్ణయించుకోవాలి. రికవరీకి అయ్యే వ్యయాలు, చికిత్స వ్యయాలు, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వయో పరమైన ప్రయోజనాలు ఇలా ప్రతి ఒక్కదానిని ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. 2. పాలసీ తరహా క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను విడిగా ఓ బీమా పాలసీగా తీసుకోవచ్చు. లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు రైడర్‌గానూ తీసుకోవచ్చు. పాలసీ నియమ నిబంధనలు రెండింటిలోనూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను విడిగా తీసుకుంటే బీమా మొత్తం ఎంతుండాలన్న అంశాన్ని నిర్దిష్టంగా ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రైడర్లతో పోల్చితే, స్టాండలోన్‌గా కవరేజ్ బాగుంటుంది. 3. చదవండి క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ లిస్ట్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. దాదాపు 20 తీవ్ర అస్వస్థతలను కవర్చేసే పాలసీలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 4. తగినంత బీమా తీవ్ర అస్వస్థత సంభవించినప్పుడు ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనడానికి తగిన బీమా ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అవసరం. వార్షిక పన్ను చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడమే ధ్యేయంగా ఆరోగ్య బీమా పాలసీని కొనకూడదు. -
పిల్లల ఫీజులకూ పనికొస్తుంది..
ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి కనక.. ఏదో ప్రీమియం కట్టామా.. పాలసీ తీసుకున్నామా అనే ధోరణిలోనే చాలా మంది ఉంటారు తప్ప.. వీటి ద్వారా వచ్చే పూర్తి ప్రయోజనాలపై అవగాహన మాత్రం ఉండటం లేదు. పాలసీదారు మంచాన పడినప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా కూడా ఈ పాలసీలు తోడ్పడతాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇలాంటి సందర్భాల్లో పనికొచ్చే ‘క్రిటికల్ ఇల్నెస్’ కవరేజీపై అవగాహన పెంచుకోవాలి. ఇటీవల వస్తున్న వ్యాధుల్లో ప్రాణాంతకమైనవీ ఉంటున్నాయి. దీంతో వైద్యఖర్చులు కంపెనీ పరంగానో వ్యక్తిగతంగానో తీసుకునే ప్రాథమిక పాలసీల కవరేజీని మించిపోతున్నాయి. పైగా, ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టేస్తోంది. సెలవులు తప్పవు. జీతం రాకపోనూ వచ్చు. కానీ ఆదాయం లేకున్నా పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటద్దె, కారు ఈఎంఐలు, ఇంట్లో నిత్యావసరాలు, క్రెడిట్ కార్డు చెల్లింపుల వంటివి తప్పవు. ఇలాంటపుడు అప్పటిదాకా కూడబెట్టిన సొమ్మేమైనా ఉంటే బయటకు తీయాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి సమయాల్లో ఆదుకోవడానికి ‘క్రిటికల్ ఇల్నెస్’ కవరేజీ పనికొస్తుంది. క్రిటికల్ కవరేజీ అంటే... ప్రత్యేకంగా కీలకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యల (క్రిటికల్ ఇల్నెస్) కోసం ఉద్దేశించిన కవరేజీ ఇది. ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా జత చేసుకోవచ్చు. బీమా సంస్థను బట్టి... ఆసుపత్రిలో చేరడానికి ముందు, ఆ తర్వాత, కోలుకోవడానికి పట్టే కాలంలో తలెత్తే ఖర్చులను కూడా దీని ద్వారా పొందవచ్చు. అవయవ మార్పిడి వ్యయాలు కూడా పొందవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) బయటపడినప్పుడు కావాలనుకుంటే పాలసీ మొత్తాన్ని ఒకేసారిగా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఆస్పత్రి ఖర్చులకే కాకుండా రోజువారీ ఖర్చుల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కవరేజీ తీసుకునేటప్పుడు... ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఇచ్చే బీమా సంస్థను ఎంచుకోవాలి. ఐఆర్డీఏ ఆదేశాల ప్రకారం బీమా సంస్థలు కనీసం 12 క్రిటికల్ వ్యాధులకు తప్పనిసరిగా కవరేజీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు 20 దాకా కూడా ఇస్తున్నాయి. మన సౌలభ్యానికి అనుగుణంగా క్యాష్‌లెస్ లేదా బెనిఫిట్ పాలసీ ప్రయోజనాలు అందించే బీమా సంస్థను ఎంచుకోవాలి. బెనిఫిట్ పాలసీ ఉంటే.. ఏకమొత్తంగా పాలసీ డబ్బు తీసుకునే వీలుంటుంది. ట్రీట్మెంట్తో పాటు రోజువారీ ఖర్చులకూ ఇది ఉపయోగపడుతుంది. ఈ పాలసీ మొత్తం కుటుంబానికి పనికొస్తుంది. పాలసీదారు లేదా జీవిత భాగస్వామి లేదా సంతానంలో (ఇద్దరు) ఎవరికి సీఐ వచ్చినా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. చిన్న వయసులోనే ఇలాంటి పాలసీలు తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ఏ ఏడాదైనా క్లెయిమ్ గానీ చేయకపోతే అదనంగా 5% మేర రెన్యువల్ డిస్కౌంటు కూడా లభిస్తుంది. ప్రస్తుతం చాలా చిన్న వయసులోనే సీఐలు వస్తున్నందున సాధ్యమైనంత ముందుగా ఇలాంటి పాలసీలు తీసుకోవడం ఉత్తమం. తగినంత బీమా ఉండాలి.. కీలక వ్యాధుల చికిత్స ఖర్చులకు సరిపడేంతగా బీమా కవరేజీ ఉండాలి. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది. కనీసం రూ.5 లక్షల కవరేజీ అయినా ఉండేలా చూసుకోవాలి. పాలసీ తీసుకునేటప్పుడు ఏవేవి పాలసీ పరిధిలోకి వస్తాయో, ఏవి రావో క్షుణ్నంగా చదివి, అడిగి తెలుసుకోవాలి. మొత్తం మీద ఒక బేసిక్ హెల్త్ పాలసీకి జతగా సీఐ కవరేజీ తీసుకుంటే కుటుంబం మొత్తానికి గరిష్టమైన కవరేజీ లభిస్తుంది.