తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. అందులోనూ క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటూంటారు. ఏదైన జబ్బుపడి ఆసుపత్రిలో చేరితేనే ఆ బీమా పరిహారం వస్తుంది. కానీ ట్రీట్‌మెంట్‌కు ముందు, తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడినపుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు
క్యాన్సర్..లివర్..గుండెజబ్బు వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమికంగా గుర్తించినపుడే పరిహారం అందించే పాలసీలు క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ కేటగిరీలోకి వస్తాయి. ప్రమాదవశాత్తు ఏదైనా వ్యాధి బారిన పడినా పాలసీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. ఈ పాలసీలో భాగంగా బీమా సంస్థలు కనీసం రూ.5 లక్షల నుంచి బీమా అందిస్తున్నాయి. గరిష్ఠంగా ఎంత పాలసీ తీసుకోవాలనేది పాలసీదారుల ప్రత్యేక అవసరాలపై ఆధారపడుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే బీమా కంపెనీలు డబ్బు చెల్లిస్తాయి. కాబట్టి ట్రీట్‌మెంట్ అయిపోయి ఇంటికి వచ్చాక కూడా వైద్య ఖర్చులు భరించే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: క్రూడ్ దిగుమతులు 40 శాతం పెంపు.. అయినా భారత్‌కు మేలే!
ఒక్కో ప్రాణాంతక వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలున్నాయి. కుటుంబంలో తీవ్ర వ్యాధులున్నవారికి ఎలాంటి పాలసీ నప్పుతుందో దాన్నే తీసుకోవచ్చు. ఈ రోగాలకు నిత్యం వైద్యం అవసరమవుతూనే ఉంటుంది. కాబట్టి చాలిచాలని జీతాలు, ఆదాయాల వల్ల కుటుంబం చితికిపోకుండా ఉండాలంటే ఈ పాలసీలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలసీ తీసుకునేముందు కచ్చితంగా అన్ని నిబంధనలు తెలుసుకోవాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment