Madala Ranga Rao
-
ఆ నటుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ, పైగా డిప్రెషన్.. దీంతో
ప్రతినాయకుడిగా పాత్రలో లీనమైపోయారు... విప్లవ సినిమాల ఒరవడి సృష్టించారు.. యువతరం పతాకం మీద అభ్యుదయ చిత్రాలు తీశారు.. పుస్తకాలు కాదు జీవితాన్ని చదివి తెలుసుకోవాలన్నారు.. ఆదర్శాలతో జీవించమని పిల్లలకు బోధించిన విప్లవ నటుడు మాదాల రంగారావు గురించి వారి పెద్ద కుమారుడు మాదాల రవి పంచుకున్న అందమైన జ్ఞాపకాలు... నాన్నగారు తన సొంత బ్యానర్ మీద అభ్యుదయ చిత్రాలే తీయాలనుకున్నారు, అలాగే తీశారు. నన్ను కూడా ఆ గీత దాటద్దన్నారు. ఇంతవరకు దాటలేదు. ప్రకాశం జిల్లా మైనంపాడు (ఒంగోలు దగ్గర) లో మాదాల కృష్ణయ్య, మాదాల హనుమాయమ్మ దంపతులకు నాన్న రెండో సంతానంగా పుట్టారు. పెద్దాయన మాదాల కోదండ రామయ్య. నాన్న ఒంగోలులోని శర్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లోనే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మ పేరు పద్మావతి. నేను పుట్టాక పెద్ద వాళ్లు అంగీకరించారు. మా తాతగారి కుటుంబీకులు ఆచార్య ఎన్జి రంగా మిత్రులు. అందుకే నాన్నకు రంగారావు అని పేరు పెట్టారు. నాన్న చాలా సింపుల్‌గా ఉండేవారు. తెల్ల ప్యాంటు, ఎర్ర చొక్కా, మఫ్లర్... లేదంటే ఎర్ర ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకునేవారు. నాన్నకి ఒక్క పైసా కూడా ఆస్తి లేదు. స్థలాలు ఇచ్చినా తీసుకోలేదు. ఆయన తీసుకునే ఆహారం చాలా సింపుల్‌గా ఉండేది. మాంసాహారం ఇష్టపడేవారు కాదు. సాంబార్ రైస్, పెరుగన్నం ఇష్టపడేవారు. చిరుతిళ్లలో ఆరోగ్యకరమైన సున్నుండలు, గారెలు ఇష్టపడేవారు. అది ఒక ప్రభంజనం... నాన్నగారికి మేం ముగ్గురు పిల్లలం. నేను మాదాల రవిచంద్... పెద్దబ్బాయిని. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మా తాతలంతా సంపన్న రైతులు. నాన్న శర్మ కాలేజీలో చేరాక, ప్రజానాట్య మండలి తరఫున నాటకాలు వేస్తున్న తరుణంలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి ప్రభావంతో కమ్యూనిజం భావాలు నాటుకున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సోషియాలజీ పూర్తయ్యాక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లారు. చైర్మన్ చలమయ్య చిత్రం నాన్న నటించిన మొదటి సినిమా. ఆ తరవాత కలియుగ మహాభారతం, హరిశ్చంద్రుడు (జాతీయ అవార్డు), వంటి సినిమాలలో నటించాక, 1980లో నవతరం పిక్చర్స్ స్థాపించి, ‘యువతరం కదిలింది’ చిత్రంతో అభ్యుదయ చిత్రాలకు, ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో విప్లవ సినిమాలకు ‘విప్లవ శంఖం’ సినిమాతో ప్రభుత్వ వ్యతిరేక విధానాల చిత్రాలకు ఆద్యులయ్యారు. చాలా సినిమాలు స్కూటర్ మీద తిరుగుతూనే తీశారు. ‘ఎర్రమట్టి’ సినిమా సమయంలో డిస్ట్రిబ్యూటర్ కన్నుమూయటంతో, సొంత బ్యానర్ మీద సినిమాలు తీయటం మానేశారు. ప్రపంచాన్ని చదవాలన్నారు.. నాన్న చాలా క్రమశిక్షణతో ఉండేవారు. అప్పుడప్పుడు కొంచెం కఠినంగానే ఉండేవారు. పుస్తకాలు రుబ్చి చదవటం కాదు, శాస్త్రీయంగా చదవాలనేవారు. నాన్న ఇంట్లోకి వస్తుంటే పుస్తకాలు మూసేసేవాళ్లం. ‘గాడ్ మేడ్ మి’ అని చదువుతుంటే, ‘పేరెంట్స్ మేడ్ మి’ అనాలనేవారు. నన్ను ప్రజా కళాకారుడిని చేయాలనుకునేవారు. అమ్మ మాత్రం వైద్యుడిని చేయాలనుకుంది. ‘వైద్యుడిగా శరీరానికి పట్టిన జబ్బు, కళాకారుడిగా సమాజానికి పట్టిన జబ్బు వదిలించాలి. కళ సామాజిక చైతన్యం కోసం. వైద్యం వ్యాపారం కాకూడదు, ఆదర్శంగా పీపుల్స్ హాస్పిటల్‌గా ఉండాలి’ అనేవారు. నేను ఎండి, డిఎం చేసి, పీపుల్స్ హాస్పిటల్ నిర్మించి, ఉచితంగా సేవ చేస్తున్నాను. కోవిడ్ సమయంలో చాలామందికి ఉచిత వైద్య సేవలు అందించి, నాన్నగారి కోరిక నెరవేరుస్తున్నాను. నువ్వు మా నాన్నవు... నేను వైద్య సేవలు చేస్తూ, దేశానికి అంకితం అయ్యాను. అందుకని ‘నువ్వు దేశానికి అంకితం అయ్యావు. నువ్వు మా నాన్నవు’ అనేవారు. బ్యాగ్‌లో ఉన్న డబ్బులు కూడా చాటుగా దానం చేసేసేవారు. స్కూటర్ పెట్రోట్కి డబ్బులు లేకపోయినా, చేతిలో ఉన్నది ఇచ్చేసేవారు. పాండ్యన్ అని తమిళనాడు సెక్రటరీ. ఒకసారి ఆయన నడిచి వస్తుంటే, తన స్కూటర్ ఆయనకు ఇచ్చి, ‘నా కంటె మీరు చేయవలసినవి చాలా ఉన్నాయి. నడుస్తూ వెళితే చేయటం కష్టం. ఈ స్కూటర్ మీద ప్రయాణించండి’ అన్నారు. నాన్నకి తగ్గట్లే ఉండేది అమ్మ. చాలా సాధారణంగా జీవించింది. అమ్మకి ఎక్కువ చీరలు ఉండేవి కాదు. బస్‌లో వెళ్లి, ట్రైబల్ పార్టీ ఆర్గనైజ్ చేశారు. యూనిటీ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఆదర్శాలతో జీవించాలనేవారు. మీటింగ్లకి సొంత ఖర్చుతో వెళ్లేవారు. నాన్నగారి వారసుడిగా అభ్యుదయ చిత్రాలు తీయాలనుకున్నాను. 2003లో ‘నేను సైతం’ తీస్తూ, నాన్నగారిని నటించమన్నాను. నాన్న అంగీకరించారు. అదే నాన్న నటించిన చివరి చిత్రం. ప్రజా పోరాటాలు, నిరాహార దీక్షలతో ఆరోగ్యం దెబ్బ తింది. అయినా తిరుగుతూనే ఉండేవారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. యాక్టివ్ లైఫ్ నుంచి ఇనాక్టివ్ కావటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. 2018 మే, 27న కాలం చేశారు. ఆయన కోరిన విధంగా.. ఆయన భౌతిక దేహానికి ఎర్ర జెండా కప్పి, పార్టీ ఆఫీసులో పెట్టాం. ఆయన జీవితమంతా ప్రజలకే అంకితం అయ్యారు. కనుక ప్రజా కళాకారులు, నాయకుల సమక్షంలోనే నాన్న అంత్యక్రియలు నిర్వహించాను. నాన్న కోరిక నెరవేర్చినందుకు తృప్తి చెందాను. ఒక్క రోజులో తీశారు.. ‘ఎర్ర మల్లెలు’ చిత్రం తీస్తున్న సమయంలో ఇంట్లో ‘నాంపల్లి టేషన్’ పాట పెడుతుంటే వింటూ డ్యాన్స్ చేస్తుండేవాడిని. అప్పుడు నాన్న నన్ను ఆ సినిమాలో చేయమన్నారు. డ్యాన్స్ మాస్టర్ లేకుండా, ఆ పాటను ఒక్క రోజులో తీశారు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ పట్ల అవగాహన ఉండేది. అప్పట్లో నాన్న దొరకటమే మాకు కష్టంగా ఉండేది. సినిమా షూటింగ్‌లతో పాటు, ఇంట్లో ఉన్నంతసేపు ప్రజల సమస్యలు వింటూ, వారికి సహాయం చేసేవారు. సొంత ఇల్లు ఉండాలని అందరూ అంటున్నా, నాన్న పట్టించుకోలేదు. నాన్నకు... పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు ఆదర్శం. నేను పెద్దవాడినయ్యాక ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. మా చెల్లి పెళ్లి చేశాను. ఆ సమయంలో నాన్న తన జీవితంలో మొట్టమొదటిసారిగా ‘రెండు లక్షలు ఉన్నాయా’ అని అడిగితే ఇచ్చాను. ఆ డబ్బులు చేతిలో పట్టుకుని, ‘నా కూతురు పెళ్లి సందర్భంగా రెండు కమ్యూనిస్టు పార్టీలకు లక్ష చొప్పున ఇస్తున్నాను’ అంటూ లక్ష రూపాయలు సిపిఐకి, లక్ష రూపాయలు సిపిఎంకి ఇచ్చారు. – మాదాల రవి సంభాషణ: వైజయంతి పురాణపండ -
Erra Mallelu: తెలుగుతెరపై అరుణోదయం.. ఎర్ర మల్లెలు
ఎర్ర బావుటాను ఎగరేసిన హిట్ చిత్రాలెన్నో చరిత్రలో ఉన్నాయి కానీ, ట్రెండ్ సెట్టర్ ఏది? ఓ చిన్న విప్లవ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టిస్తుందా? స్టేజ్ సాంగ్స్ సినిమాల్లోనూ సూపర్ హిట్టవుతాయా? వీటన్నిటికీ జవాబు – రెడ్ స్టార్ మాదాల రంగారావు నటించి, ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రమల్లెలు’. ‘నాంపల్లి టేసను కాడి..’, ‘ఓ లగిజిగి లంబాడీ..’, ‘బంగారు మా తల్లీ...’ పాటలు!! 40 ఏళ్ళ క్రితం బాక్సాఫీస్ వద్ద ‘ఎ ర్రమల్లెలు’ పూచాయి. నేటికీ జనం గుండెల్లో విప్లవ సుగంధాలు వెదజల్లుతూనే ఉన్నాయి. వెండితెర అలా ఎరుపెక్కింది! తెలుగు సిన్మాకు 1980 – 81 కాలం ఓ కీలక మైలురాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ (’77)తో మొదలైన పూర్తి కమర్షియల్ ఫార్ములా చిత్రాల హవా సాగుతున్న సందర్భం అది. కానీ, ఆ కాలంలోనే ‘చలిచీమలు’ (’78), తెలంగాణ సాయుధ పోరాటంపై ‘మాభూమి’ (’79), అభ్యుదయచిత్రం ‘యువతరం కదిలింది’ (1980 ఆగస్ట్ 15), ఆ వెంటనే దేశంలోని నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూ బాలచందర్ ‘ఆకలిరాజ్యం’ (1981 జనవరి 9) వచ్చాయి. అన్నీ విజయం సాధించాయి. ‘గరీబీ హఠావో’ అన్నది వట్టి నినాదంగానే మిగిలిపోయి, జనం మనసుల్లో అసంతృప్తి పెరుగుతున్న కాలంలో వచ్చిన జనజీవన పోరాట చిత్రాలివి. లోలోపల కుతకుతలాడుతున్న జనం... వాస్తవ జీవితానికీ, తమలో పేరుకున్న అసంతృప్తికీ తెరపై వ్యక్తీకరణగా ఈ సినిమాలను చూశారు, ఆదరించారు. ఆ నేపథ్యంలో ‘ఎర్రమల్లెలు’ వచ్చింది. దర్శకుడు ధవళ సత్యం నిజానికి, తెలుగు తెరపై సినీ పెద్దలెందరో అంతకు ముందూ విప్లవ చైతన్యం కథలో అంతర్లీనంగా చెబుతూ వచ్చారు. కాకపోతే, కమర్షియల్ షుగర్ కోటింగ్‌లో చూపారు. అవేవీ నేరుగా ఎర్ర జెండాను ఎత్తిపట్టుకున్నవి కావు! కమ్యూనిస్టు పార్టీ చిహ్నాలతో మే డే పాటలు పెట్టినవీ కావు!! కానీ, ‘ఎర్రమల్లెలు’ నుంచి తెలుగుతెర కమర్షియల్ చట్రంలో ఉంటూనే అరుణారుణమయ్యే నేర్పు నేర్చింది. జనమూ లాల్‌సలామ్ కొట్టారు. విప్లవ పంథాకు ట్రేడ్ మార్క్‌గా... మాదాల తెలుగులో రెడ్ సినిమాల ట్రెండ్ సెట్టర్ అంటే కచ్చితంగా నటుడు, నిర్మాత మాదాల రంగారావే! ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే! ‘‘...నా ఆశకు ఆశయం తోడై, జనాశయం చేయూతై వెండితెరను ఎరుపెక్కించాను. ఎరుపు విప్లవానికి చిహ్నం. సమసమాజమే విప్లవ లక్ష్యం. ఆ విప్లవమే నా ఊపిరిగా, నాలో ఊపిరున్నంత వరకు నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను...’’ అంటూ ‘ఎర్రమల్లెలు’ రిలీజు టైములోనే స్పష్టంగా ప్రకటించారు మాదాల. సమస్యలు, సెన్సార్ యుద్ధాలు ఎన్ని ఎదురైనా, మాదాల జీవితాంతం విప్లవభావాలకే కట్టుబడడం విశేషం. దటీజ్ కామ్రేడ్ మాదాల! ‘యువతరం’తో... కదలిక నిర్మాతగా మాదాల చేసిన తొలి ప్రయత్నం – ‘యువతరం కదిలింది’. కాలేజీ వాతావరణం, అందులోనే గ్రామీణ సమస్యలు, యువతరం ఆలోచనల్లో రావాల్సిన మార్పులు – ఇలా అనేక అంశాలను చర్చించిందీ సినిమా. మాదాల, రామకృష్ణ, సాయిచంద్, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఆ అభ్యుదయ చిత్రం సంచలన విజయం సాధించింది. 3 నందులు గెల్చింది. వామపక్షవాది – ప్రజానాట్యమండలిలో మాదాల మిత్రుడు ధవళ సత్యం అప్పటికే ‘జాతర’తో దర్శకుడై, మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రెండో సినిమాతో హిట్ సినిమా దర్శకుడనిపించుకున్నారు. దర్శకుడిగా ఆయనకు మూడో సినిమా ‘ఎర్రమల్లెలు’. నిజానికి, ‘యువతరం కదిలింది’ రిలీజై, సక్సెసయ్యాక ధవళ సత్యం, మాదాల రాజమండ్రిలో ఓ కమ్యూనిస్టు పార్టీ సభకు హాజరయ్యారు. ‘‘అక్కడే జనం మధ్య మాదాల ఉత్సాహంగా ‘ఎర్రమల్లెలు’ ప్రకటించారు. మద్రాసుకు తిరుగు ప్రయాణంలోని డిస్కషన్లలో మాదాల కథకు హంగులద్దా’’రు సత్యం. కార్మిక – కర్షక సమస్యల కథతో... తెల్లగా, స్వచ్ఛంగా ఉండే మల్లెలకు విప్లవ సూచకంగా ఎర్రదనమనే మాటను కలిపి, విరోధాభాసగా మార్చి, ‘ఎర్రమల్లెలు’ అనే వినూత్నమైన పేరు పెట్టడం ఓ ప్రయోగం. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం. ఊళ్ళోని చదువురాని జనాన్ని పావులు చేసి ఆడుకొనే ముగ్గురు దుష్టులు. ఆ ఊళ్ళో చదువు చెప్పడానికి ఓ మాస్టారు వస్తారు. ఆయన వల్ల జనంలో చైతన్యం రగిలి, ఆ ముగ్గురు దుష్టులకు తోడున్న పక్క ఊరి ఫ్యాక్టరీ ఓనర్ కూడా ప్రజా విప్లవ జ్వాలల్లో భగ్గుమనడం ఈ చిత్రకథ. ఏకకాలంలో అటు గ్రామీణ సమస్యల్ని, ఇటు కార్మిక సమస్యల్ని చూపిన సినిమా ఇది. దెబ్బకు దెబ్బే మార్గమనే ఉగ్రవాది రంగా (మాదాల), ఆవేశంతో పాటు ఆలోచన కావాలనే కార్మిక నేత సూరి (మురళీమోహన్), మాస్టారు (నల్లూరి) లాంటి మంచి పాత్రలు, కొన్ని దుష్టపాత్రల మధ్య ఆలోచింపజేసేలా కథ సాగుతుంది. సిన్మాలాగా కాక ఒక ఉద్యమంలా, ఎక్కడో చూసినట్టుగా – వాస్తవంగా జరుగుతున్నట్టు అనిపించే పద్ధతిలో ఒంగోలు, టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ధవళ సత్యం దీన్ని తీశారు. అదే ‘ఎర్రమల్లెలు’కు బలం. నరసాపురం నాటక రచయిత, ప్రజానాట్యమండలి ఎమ్జీ రామారావు రాసిన డైలాగ్స్ ప్లస్సయ్యాయి. ప్రజాగీతాలకు పట్టం సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభంజనం నడుస్తున్న రోజులవి. 1981లో వచ్చిన తెలుగు చిత్రాల్లో మూడొం తులుకు ఆయనదే మ్యూజిక్. ఆ కమర్షియల్ కింగ్ ఈ విప్లవాత్మక ‘ఎర్రమల్లెలు’కు సంగీతం అందించడం ఓ విచిత్రం. ‘ఎర్రమల్లెలు’ పాటలు ఆ రోజుల్లో వీధి వీధినా మారుమోగాయి. ఎర్రజెండాలు, సుత్తి – కొడవలి చిహ్నాలతో కార్మిక దినోత్సవ గీతం ‘అన్యాయం అక్రమాలు..’ (రచన అదృష్టదీపక్) కార్మిక సంఘాలకు కొత్త ఉత్సాహమిచ్చింది. ఇప్పటికీ మే డే అంటే ఆ పాట తెలుగునాట ఊరూవాడా మోగుతుంటుంది. ‘ఓ లగిజిగి లంబాడీ...’, ‘బంగారు మా తల్లీ...’ పెద్ద హిట్టయ్యాయి. ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రదర్శనలిచ్చిన రోజుల్లో ధవళ సత్యం రాసి, స్టేజీ పాడిన పాపులర్ గీతాలివి. మరో ప్రజానాట్యమండలి బిడ్డ ప్రభు రాసి, వేదికపై పాడే ‘నాంపల్లి...’ కూడా తెరకెక్కింది. సినీరంగానికొచ్చాక ధవళ సత్యం ఈ ‘నాంపల్లి..’, ‘బంగారు మాతల్లి...’ పాటల్ని సినిమాల్లో పెట్టుకోమని ఎందరినో అడిగారు. చివరకు తానే దర్శకుడయ్యాక వాడారు. మహామహులకు తెరంగేట్రం జంధ్యాల చిత్రాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న సుత్తి వీరభద్రరావుకూ, సీరియల్స్‌లో నేటికీ అలరిస్తున్న నటి శివపార్వతికీ ‘ఎర్రమల్లె’లే తెరంగేట్రం. ‘ఇదే అమెరికాలో అయితే...’ అనే లాయర్ పాత్ర వీరభద్రరావుకు మంచి పేరు తెచ్చింది. తర్వాతి కాలంలో దర్శకుడైన మాదాల మిత్రుడు టి. కృష్ణ తెరపై తొలిసారి కనిపించిందీ ‘ఎర్రమల్లె’లే. సినిమాలో పూర్తి నిడివి ఉండే పాలేరు పాత్ర కోసం కృష్ణ గడ్డం పెంచారు. గడ్డం గెటప్ బాగుందని అందరూ అనడంతో జీవితాంతం కంటిన్యూ చేశారు. సినీ విప్లవంలో... బాటసారులు ‘ఎర్రమల్లెలు’ వేసిన వెండితెర విప్లవమార్గం ఆ తర్వాత ఎందరెందరికో ఆదర్శమైంది. చివరకు హీరో కృష్ణ, మోహన్ బాబు, దర్శకుడు దాసరి లాంటి స్టార్లు కూడా ‘ఎన్కౌంటర్’, ‘అడవిలో అన్న’, ‘ఒసేయ్ రాములమ్మ’ (1997)తో ఈ దోవలోకి వచ్చి, సినిమాలు తీశారు. దాన్నిబట్టి ఇదెంత పెద్ద కమర్షియల్ ఫార్ములాగా వెలిగిందో అర్థం చేసుకోవచ్చు. మాదాల రెడ్ ఫిల్మ్స్ దశాబ్దం సాగితే, ఆయన మిత్రుడు టి.కృష్ణ లేడీ ఓరియంటేషన్తో మరింత ఎఫెక్టివ్‌గా ఇదే భావజాలం తెరపై చూపారు. దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ ‘మరోమలుపు’ (’82) వగైరాతో వచ్చారు. పూర్తి ఎర్ర సిన్మాలు కాకున్నా, సామాజిక సమస్యలతో చర్చ రేపారు. ఈ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ ‘అర్ధరాత్రి స్వతంత్రం’ (1986)తో మొదలెట్టి ‘ఎర్రసైన్యం’ (1994)తో ఆర్. నారాయణమూర్తి ఏకంగా ‘పీపుల్స్ స్టార్’ అయ్యారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అదే జెండా, ఎజెండాలను భుజానికెత్తుకొని, ఒంటరి పోరాటం చేస్తున్నారు. మిగతావారంతా ఆర్థిక ఆకర్షణతో అతిథులుగా వచ్చిపోయారు కానీ, అప్పుడు మాదాల – ఇప్పుడు నారాయణమూర్తి మాత్రం నిబద్ధతతో సమస్యాత్మక, విప్లవ పంథా చిత్రాలే తీయడం విశేషం. వీటన్నిటికీ ఊపునిచ్చింది కాబట్టే, ‘ఎర్రమల్లెలు’ ఇవాళ్టికీ ఓ చరిత్ర. మాదాల – ధవళ సత్యం బృందం అన్నట్టు, సమాజంలో ‘‘ఈ దోపిడీలు, ఈ దురంతాలు ఉన్నంతకాలం – ప్రతి మల్లియ మనసు ఎరుపెక్కుతుంది. ప్రతి రోజూ ఒక మేడే అవుతుంది!’’ రేపుల ఇమేజ్ నుంచి రెడ్ స్టార్‌గా.. ఒంగోలు దగ్గర భూస్వామ్య కుటుంబంలో పుట్టి, డాక్టర్ అవమంటే యాక్టరైన వ్యక్తి మాదాల రంగారావు. ఎన్జీ రంగాను ఇష్టపడే కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుల వైపు, కళల వైపు మొగ్గారాయన. గుంటూరు హిందూ కాలేజీ, ఒంగోలు సి.ఎస్.ఆర్. శర్మ కాలేజీ రోజుల్లోనే విద్యార్థి సంఘాలు, ప్రజానాట్యమండలి బృందాలతో దోస్తీ కట్టారు. ‘నల్లూరి అన్న’ శిక్షణలో రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివి, సినిమాల్లోకి వెళ్ళారు. ‘చైర్మన్ చలమయ్య’, ‘ఆడంబరాలు– అనుబంధాలు’ (1974), ‘బాబు’, ‘తీర్పు’ – ఇలా అనేక చిత్రాల్లో వేషాలు వేశారు. ‘ఎర్రమల్లెలు’లో... మాదాల ఎదురుదెబ్బలు తిన్నారు. నమ్మిన వామపక్ష భావాల్ని ప్రచారం చేస్తూ, తానే హీరోగా సినిమాలెందుకు నిర్మించకూడదని నిర్మాతయ్యారు. అలా తెలుగు సినిమాను అరుణ మార్గం పట్టించారు. ఆవేశం తెప్పించారు. అప్పట్లో ‘బంగారు చెల్లెలు’ (1979)లో శ్రీదేవిని రేప్ చేసే పాత్ర సహా, తెరపై పలుమార్లు రేపిస్టు పాత్రలేయడంతో కొందరు మాదాలను ‘రేపులరంగారావు’ అని గేలిచేశారు. కానీ అదే మాదాల వరుస విప్లవచిత్రాలతో విజయాలం దుకున్నాక ఆ ఇమేజే మారిపోయింది. ‘రేపుల రంగారావు’ అని వెక్కిరించిన నోళ్ళే ‘రెడ్ స్టార్’ అని ఆకాశానికెత్తాయి. బాక్సాఫీస్ మల్లెలు నిజాయతీ, నిబద్ధతతో తీసిన ‘ఎర్రమల్లెలు’కు జనం నీరాజనం పట్టారు. 23 కేంద్రాల్లో రిలీజై, 17 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం చేసుకుంది. ఆ జోరు కొనసాగి, విజయవాడ (రామా టాకీస్), గుంటూరు (శ్రీలక్ష్మీ), తిరుపతి (జయశ్యామ్) సహా ఏడెనిమిది కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. గత నలభై ఏళ్ళుగా తెలుగులో వస్తున్న రెడ్ ఫిల్మ్స్‌కు ట్రెండ్ సెట్టరైంది. తెలుగులో రిలీజైన వెంటనే ఈ చిత్రం తమిళంలోకి ‘సివప్పు మల్లి’ (1981 ఆగస్ట్ 15)గా రీమేకైంది. సంసారపక్ష సినిమాలు తీసే ప్రసిద్ధ ఏ.వి.ఎం. సంస్థ దీన్ని నిర్మించడం మరీ విశేషం. తిరుపతిలో సినిమా చూసిన తమిళ దర్శక, నిర్మాతలు రీమేక్‌లో కూడా మాదాలతోనే నటింపజేయాలనుకున్నారట. అయితే, అప్పటికే తదుపరి చిత్రం ‘విప్లవశంఖం’ (1982 ఏప్రిల్ 9)తో బిజీగా ఉన్న మాదాల చేయలేనన్నారట. చివరకు తమిళంలో హీరో విజయకాంత్, ముచ్చర్ల అరుణ నటించారు. తర్వాతి కాలంలో భక్తి చిత్రాలు తీసిన శతాధిక సినిమాల రామనారాయణన్ ఈ తమిళ విప్లవ రీమేక్‌కు దర్శకుడు! తమిళ రీమేక్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అభ్యుదయంలో... ఆత్మీయ మిత్రులు ఒంగోలులో రెండున్నర దశాబ్దాలు నడిచిన ‘స్టూడెంట్స్ ఫెడరేషన్’ (ఎస్.ఎఫ్) మెస్, విద్యార్థి సంఘం ఏ.ఐ.ఎస్.ఎఫ్. కార్యకలాపాలు, ‘ప్రజానాట్యమండలి’ నల్లూరి వెంకటేశ్వర్లు అన్న మార్గదర్శనం... ఇవన్నీ ఎందరికో అభ్యుదయ పాఠశాల. మాదాల, దర్శకుడు టి. కృష్ణ (నేటి హీరో గోపీచంద్ తండ్రి) నుంచి ‘వందేమాతరం’ శ్రీనివాస్ దాకా ఎంతోమంది అక్కడ తయారైనవాళ్ళే! ‘‘కళ కళ కోసం కాదు... ప్రజల కోసం’’ అని నమ్మినవాళ్ళే! ఆచరించినవాళ్ళే!! కాలేజీ నుంచి మాదాల – టి. కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్. నిండైన విగ్రహం ఉన్న మాదాలను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించింది కృష్ణే! మధ్యలో కొంతకాలం కృష్ణ వెనక్కి వచ్చేసి, ఒంగోలు పొగాకు వ్యాపారం చేసుకున్నారు. నల్లూరి, కె. రాధాకృష్ణ, ..., యు.విశ్వేశ్వరరావు, మాదాల, ..., ..., టి. కృష్ణ మాదాల మద్రాసులోనే చావో రేవో అని కూర్చున్నారు. మాదాల నిర్మాత అయినప్పడు మద్రాసు వచ్చి తొలి (‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’) చిత్రాలకు సాయంగా నిలిచిందీ కృష్ణే. తర్వాతి కాలంలో స్క్రిప్టులో మార్పులపై మాట వినని మాదాలతో విభేదించి, కృష్ణ తానే దర్శకుడయ్యారు. ఆత్మీయ ‘రంగన్న’కు దీటుగా ఎదిగారు. మాదాల ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’, ‘జనం– మనం’, ‘ఎర్రమట్టి’ – ఇలా 7 చిత్రాలు నిర్మించారు. 36 ఏళ్ళే జీవించిన టి.కృష్ణ దర్శకుడిగా తీసినవీ ఏడే ఫిల్మ్స్. కలసి ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు మిత్రుల జీవితంలో గమ్మతై ్తన పోలిక ఇది. ఆ పాట... శైలజకు టర్నింగ్ పాయింట్! అప్పుడప్పుడే గాయనిగా పైకి వస్తున్న ఎస్పీబీ చెల్లెలు ఎస్పీ శైలజకు ఈ ‘ఎర్రమల్లెలు’ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో ఆమె పాడిన ‘నాంపల్లి టేసను కాడి..’ మోత మోగిపోయింది. ఆమె కెరీర్‌కు ఈ పాట పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఎన్నో ప్రైవేట్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఎక్కడ సంగీత విభావరి జరిగినా, ఆమె ఈ పాట పాడాల్సిందే! ఈ పాటకు మాదాల కుమారుడు – నేటి నటుడు డాక్టర్ మాదాల రవి నటించడం విశేషం. బాలనటుడిగా అదే అతనికి తెరంగేట్రం. ఆపై ‘స్వరాజ్యం’(1983)లో ఫుల్ లెన్త్ రోల్లో రవి నటించారు. ‘‘నటనలోకి వస్తానని అనుకోలేదు. ‘ఎర్రమల్లెలు’ టైమ్‌కి ఏడో తరగతి చదువుతున్నా. రికార్డయిన పాటల్ని ఇంట్లో పదే పదే వింటూ, ఓ రోజు ‘నాంపల్లి...’ పాటకు హుషారుగా డ్యా¯Œ ్స చేస్తున్నా. నాన్న గారు అది చూసి, ఆ పాట నా మీదే తీశారు. డ్యా¯Œ ్స మాస్టర్ కూడా లేని ఈ పాటను ఒకే రోజున ఉదయం 8కి మొదలుపెట్టి సాయంత్రం 4 కల్లా చిత్రీకరించారు’’ అని రవి చెప్పారు. ఒంగోలులో రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ పాట తీశారు. ఆ పాట చిత్రీకరణలో ధవళ సత్యం వెంట టి. కృష్ణ, బి. గోపాల్ లాంటి నేటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆ పాట ఎంత ట్రెండ్సెట్టరంటే– తర్వాత వచ్చిన అభ్యుదయ, విప్లవ సిన్మాలన్నిట్లో ఇలాంటి సోషియో – పొలిటికల్ సెటైర్ సాంగ్స్ వచ్చాయి. ‘నేటిభారతం’(1983)లోని ‘అత్తో పోదాం రావే సర్కారు దవాఖానకు...’, ‘రేపటి పౌరులు’(1986)లోని ‘అయ్యా నే సదివి బాగుపడతా..’ లాంటి పాటలే అందుకు సాక్ష్యం! – రెంటాల జయదేవ -
లెఫ్ట్ భావజాలమే మాదాల ఊపిరి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సినిమా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మాదా ల రంగారావు వామపక్ష భావజాల వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేశా రని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రెడ్‌స్టార్ మాదాల రంగారావు సంస్మరణసభ నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం మాదాల చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. వామపక్ష సిద్ధాంతం, భావజాల వ్యాప్తే ఊపిరిగా పనిచేశారన్నారు. వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనేక చిత్రాలు తీశారని కొనియాడారు. వామపక్ష భావజాల సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు వచ్చినా, సమస్యలు ఎదురైనా, చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా ప్రజలకు చేర్చారన్నారు. విప్లవ సినిమాల దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ కళ కాసుల కోసం కాదని, కళ ప్రజల కోసమని చాటిన మహామనీషి మాదాల రంగారావు అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి. కార్యదర్శివర్గ సభ్యుడు అజీజ్‌పాషా, మాదాల తనయుడు రవి, పలువురు కళాకారులు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. -
రెడ్‌స్టార్ మాదాలకు అశ్రునివాళి
హైదరాబాద్: అభ్యుదయ చిత్రాల కథానాయకుడు, రెడ్‌స్టార్ మాదాల రంగారావుకు బంధువులు, అభిమానులు, కమ్యూనిస్టు పార్టీల నేతలతోపాటు పలు పార్టీల కార్యకర్తలు, ప్రజానాట్యమండలి కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. మాదాల భౌతికకాయానికి రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నగరం నుంచి ప్రత్యేక వాహనంలో భౌతికకాయాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. మాదాల కుమారుడు రవి స్వయంగా పర్యవేక్షించి అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ అంతిమయాత్ర నిర్వహించారు. ‘ఎర్రసూర్యుడా..’ అంటూ విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. చితికి నిప్పంటించే ముందు ప్రజాయుద్ధనౌక గద్దర్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తమ గీతాలాపనలతో మాదాలకు ఘనంగా నివాళులు అర్పించారు. చితికి నిప్పంటించిన కుమారుడు, పలువురు ప్రముఖులు తండ్రి చనిపోతే కుమారుడు చితికి నిప్పంటించడం ఆనవాయితీ. కాగా, మాదాల రంగారావుకు మాత్రం కుమారుడు మాదాల రవితోపాటు సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రామకృష్ణ, బీవీ రాఘవులు, వందేమాతరం, ప్రముఖ సినీనటులు జీవితా రాజశేఖర్ దంపతులు వేర్వేరుగా చితికి నిప్పంటించారు. మాదాలకు ఇష్టమైన ఎర్రటి టీషర్ట్‌పైనే భౌతికకాయాన్ని చితిపైకి చేర్చి నిప్పటించడం విశేషం. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, సీపీఐ ఏపీ, తెలంగాణ కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ బాషా, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతోపాటు పలువురు సీపీఐ, సీపీఎం, ప్రజానాట్యమండలి ప్రతినిధులు, అభిమానులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
మాదాల అంత్యక్రియలు పూర్తి
-
మాదాల మృతి తీరని లోటు
కొమురవెల్లి(సిద్దిపేట) : ప్రజా కళాకారుడు మాదా ల రంగారావు మృతి ప్రజా ఉద్యమాలకు, కళారంగానికి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కొమురవెల్లి మండల కేంద్రంలో మాదాల రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెండితెరపై అనేక విప్లవ భావాలు గల సినిమాలను తెరకెక్కించి ప్రజలను చైతన్య పరిచిన గొప్ప కళాకారుడని అన్నారు. ఆయన మృతి ఈ లోకానికి తీరని లోటన్నారు. కార్యక్రమంలో దాసరి కళావతి, రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, అత్తిలి శారద, అరుంట్ల రవి, శశికళలతో పాటు పలువురు పాల్గొన్నారు.మాదాల రంగారావు మృతదేహంకు వద్ద మరి ముచ్చాలకు చెందిన నర్సయ్య సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాల రంగారావుతో తనకు 20 ఏళ్ళుగా పరిచయముందని, ఆయన మృతి విప్లవ లోకానికి తీరని లోటని అన్నారు. సినిరంగంలో ఎర్రమందారంతో పాటు అనేక విప్లవ భావాలతో వెండి తెరపైకి తెచ్చి ప్రజలను చైతన్యం చేసి ప్రజలలో ఉత్తేజపరిచారని అన్నారు. ఆయన కుమారుడు మాదాల రవిని పరామర్శించారు. -
మాదాలకు నివాళి
-
మాదాల రంగారావు మృతి తీరని లోటు
-
ఎర్రసూర్యుడు వాలిపోయాడు...
తెలుగు సినిమా ఎర్రజెండాను చూసింది ఆయనతోనే. ఎర్రజెండాను హీరోగా మలుచుకుంది ఆయనే. సినీ పరిశ్రమలో మాదాల అడుగు పెట్టిన తర్వాత ఏ పరిస్థితిల్లోనూ తన సిద్ధాంతాలను విడవలేదు. ఎర్రజెండా గౌరవాన్ని తగ్గించలేదు. తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే చివరి శ్వాస వరకు ఉన్నారు. అనుకున్నట్లుగానే మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఆయనే రెడ్‌స్టార్ ‘మాదాల రంగారావు’. మే నెల 25వ తేది 1948 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పక్కన ఉన్న మైనంపాడు గ్రామంలో జన్మించారు. తను హైస్కూల్ చదువుకొనే రోజుల నుంచే వామపక్ష భావజాలానికి ప్రభావితమై సుమారు పదిహేనేళ్ల వయస్సులో ప్రజా నాట్యమండలిలో చేరారు. అతి కొద్ది కాలంలోనే కీలక సభ్యుడిగా వ్యవహరించారు. ప్రజా నాట్యమండలి నిర్వహించే సభలలో అనేక నాటకాలను ప్రదర్శించారాయన. అలా నటనపై ఏర్పడిన మక్కువతో చెన్నపట్నం చేరుకున్నారు రంగారావు . ప్రజా నాట్యమండలిలో చురుకుగా పాల్గొంటూనే సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి చెన్నై వెళ్లారు. తండ్రితో మాదాల రవి అక్కడ వేషాలొచ్చె పరిస్థితి కనుచూపుమేరలో కనపడక పోవడంతో తిరిగి పుస్తకాలు చేత పట్టి విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ ఆంధ్రా యూనివర్సిటీలో యం.ఏ పూర్తి చేసిన తర్వాత, తనకు అంతకుముందే ప్రజా నాట్యమండలిలో అన్నా అంటూ పరిచయమైన టి. కృష్ణను పిలిచి ‘నాకు వేషాలు రావట్లేదు, నీకు దర్శకత్వం చాన్స్ ఎవ్వరు ఇవ్వట్లేదు. మనకు మనమే ప్రయత్నం చేద్దామని’ టి.కృష్ణను వెంటపెట్టుకుని మద్రాసు చేరుకున్నారు మాదాల. అలా చెన్నై వెళ్లిన ఆయన మొదట ‘చైర్మన్ చలమయ్య’ అనే సెటైరికల్ సినిమాలో నటించారు. ఆ తర్వాత రంగారావు తన సొంత నిర్మాణ సంస్థ ‘నవతరం పిక్చర్స్’ను స్థాపించారు. నవతరం పిక్చర్స్ పతాకంపై తన మొదటి ప్రయత్నంగా ‘యువతరం కదిలింది’ అనే చిత్రాన్ని ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించారు. తన మొదటి చిత్రానికే ప్రేక్షకులు బ్రహ్మర«థం పట్టారు. ఆ సినిమాకు బంగారునంది అవార్డు వరించింది. అప్పటి వరకు ప్రేమ సినిమాలు ఎక్కువగా ఆడుతున్న రోజుల్లో విప్లవాత్మక సినిమాలతో ట్రెండ్ సెట్ చేశారాయన. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందాయి. నటుడిగా దాదాపు 70 సినిమాలు, నిర్మాతగా 15 సినిమాలు నిర్మించారు మాదాల రంగారావు. ఏ పసంగాన్నైనా ‘లాల్ సలామ్..’ అంటూ మొదలుపెట్టి, ముగించడం మాదాల స్టైల్. టి. కృష్ణతో పాటు ప్రజా నాట్యమండలి సభ్యులైన బి. గోపాల్, నర్రా వెంకటేశ్వరరావు, రచయిత ఎమ్వీఎస్ హరినాథరావు, ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు వీరంతా మద్రాసు చేరుకోవడానికి ఊతమిచ్చింది మాదాల రంగారావే. ప్రజా నాట్య మండలి సభ్యులలో తమ ఎర్రజెండాను హీరోగా చేస్తూ ఆ జెండాను పతాక స్థాయికి చేర్చి ‘రెడ్‌స్టార్’గా అందరితో పిలిపించుకున్నారు మాదాల రంగారావు. కొడుకు పేరును రవిచంద్ అని, దర్శకుడు టి. కృష్ణ కుమారుడుకి గోపీచంద్ అని నామకరణం చేసింది కూడా మాదాలనే. వీరితో పాటు ఇప్పటి ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు కూడా ఆయనే పేరు పెట్టారు. (మాదాల రంగారావు సొంత మరదలు కుమారుడే గోపీచంద్ మలినేని). కమ్యూనిజమే శ్వాసగా బతికారు – మాదాల రవి ‘‘ప్రజా కళాకారులకు మరణం ఉండదు. వారు ఎల్లపుడూ ప్రజల మనస్సులో సజీవంగా నిలిచి ఉంటారు. నాన్నగారు విప్లవాత్మక చిత్రాల్లో ట్రెండ్‌సెట్టర్. వెండి తెర మీద ఎర్ర జెండాను చూపెట్టిన విప్లవకారుడు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ విప్లవకారుడాయన. కమ్యూనిజమే శ్వాసగా బతికారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసమే నిలబడ్డారు. సినిమాలు హిట్ అయినప్పుడు సొంతగా ఏ ఆస్తులు కొన్నది లేదు. సినిమాల్లో హీరో అవ్వడానికి రాలేదు. జనంలో చైతన్యం తీసుకురావడానికి వచ్చారు. సినిమాను ఒక సాధనంగా ఉపయోగించాలి అని నమ్మారు. టి. కృష్ణ, నాన్నగారు కలసి అనేక నాటకాలు వేశారు. వాళ్లిద్దరూ ఆత్మ బంధువులు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు. ‘వైద్యుడి యొక్క ధర్మం శరీరంలో ఉన్న జబ్బును పోగొట్టడం. కళాకారుడి యొక్క ధర్మం సమాజానికి పట్టిన జబ్బు వదలకొట్టడం’ అని నాన్నగారు నాతో అంటుండేవారు. బయట బ్యానర్ సినిమా అనేది ఎలా ఉన్నా. మన సొంత సినిమాలో కచ్చితంగా ఒక సమాజిక అంశం ఉండాలి అనేవారు. శ్రీశ్రీగారు మా నాన్నాగారు చాలా మంచి స్నేహితులు. నాన్నగారి సినిమాలు అన్నింటికీ పాటలు రాశారు. శ్రీశ్రీగారిని ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీగారి పాత్రలోనే చూపించారు. మాట మీద నిలబడేవాడే కమ్యూనిస్టు మాదాల రంగారావుగారితో నాలుగు సినిమాలు పని చేశాను. సినిమా ఇండస్ట్రీలో కమ్యూనిస్ట్‌లు అని చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. కాని ప్రాక్టికల్‌గా అలా బతకడం చాలా కష్టం. ఆ కష్టంలో ఆయన ఆనందాన్ని వెతుక్కున్నారు. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. సినిమాల్లో పని చేస్తూ కూడా ఉద్యమాల్లో పాల్గొనేవారాయన. నా మొదటి సినిమా చిరంజీవి గారు చేసిన ‘జాతర’. ఆ సినిమా ప్రివ్యూ థియేటర్లోనే నువ్వు నా ‘యువతరం కదిలింది’ సినిమాకు డైరెక్టర్ అన్నారు. ‘జాతర’ కమర్షియల్‌గా ఆడలేదు. అయినా ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఒకసారి ‘‘జాతర’ ఫ్లాప్ కదా నన్ను ఎందుకు తీసుకున్నారు’ అని ఆయన్ను అడిగాను.ఫెయిల్యూర్, సక్సెస్‌లతో మాట మార్చేవాడు బజారోడు తమ్ముడు. మాట మీద నిలబడే వాడే కమ్యూనిస్ట్’ అన్నారు. ఆయన మాట అన్నాడంటే జరగాల్సిందే. దటీజ్ మాదాల రంగారావు. పొద్దున ఆయన మృతదేహాన్ని చూస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఎవరు సహాయనికి వచ్చినా చేసేవారు. ఏంటన్న అలా ఇచ్చేస్తున్నావు అని అడిగితే ‘వాళ్ళ డబ్బులే వాళ్లకు ఇస్తున్నాం కదా’ అనేవారు. ‘ఎర్రమల్లెలు’ టైటిల్‌కి నెగిటివ్ కామెంట్స్ వస్తున్న విషయాన్ని ఆయనకు చెబితే ‘ఎరుపంటే వాళ్లకు భయం తమ్ముడు. మనకు ఇష్టం’ అన్నారు. ధవళ సత్యం ఎర్రజెండాను తెరపై రెపరెపలాడించిన వీరుడు ఎర్రజెండాను వెండి తెరపై రెపరెపలాడించిన వీరుడు. వామపక్షాలు కలవాలి? ఏకమవ్వాలనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. రంగారావుగారు చేసిన కృషికి సెల్యూట్. నటుడిగా నేను జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తున్న రోజుల్లో ‘జనంమనం, మహాప్రస్థానం’ సినిమాల్లో అభిమానంతో నాకు వేషం ఇచ్చారు. వందేమాతరం శ్రీనివాస్, టి. కృష్ణా, నర్రా వెంకటేశ్వరరావు గారు,‘ఈతరం’ బాబురావుగారు వీళ్లంతా నల్లూరి వెంకటేశ్వరరావుగారి శిష్య బృందం. ఈయన ఫస్ట్ సినిమా ‘యువతరం కదిలింది. ‘నభూతో భవిష్యత్తు, ఎర్ర మల్లెలు’ సినిమాలు ఒక విప్లవం తీసుకు వచ్చాయి. ఆయన స్ఫూర్తితో చాలా మంది విప్లవ సినిమాలు తీశారు. మేం అధికార పక్షం కాదు, అపోజిషన్ కాదు. మేమంతా ప్రజల పక్షం. ఎర్ర సినిమాలు తీయడానికి ఆద్యులు మేము కాదు అంతం మేం కాదు. విప్లవాత్మక సినిమాల్లో మాదాలగారు తనదైన మార్క్ ఏర్పరుచుకున్నారు. సెల్యూట్ టూ హిమ్. మేం డాక్యుమెంటరీగా కాకుండా జనరంజకంగా చెబుతాం. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ మాదాల రంగారావుగారు. నా ఎర్ర సైన్యం, లాల్ సలామ్ సినిమా చూసి బాగా మెచ్చుకున్నారు. ‘విప్లవాత్మక సినిమాలు ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నావు. హ్యాట్సాఫ్ నారాయణమూర్తి’ అన్నారు రంగారావుగారు. ఆర్.నారాయణమూర్తి కథానాయకుడిగా, నిర్మాతగా ఒక నిబద్ధతతో సినిమాలు రూపొందించిన వ్యక్తి మాదాల రంగారావు. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జీవించిన మంచి మనిషి ఆయన. నాకు మంచి స్నేహితుడైన మాదాల రంగారావు మరణం నన్ను ఎంతగానో బాధించింది. చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ షిరిడీ సాయినా«థుని వేడుకుంటున్నాను. మోహన్‌బాబు విప్లవాత్మక సినిమాలు చేస్తూ కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చినా కూడా కాదని తాను నమ్మిన సిద్ధాంతాలతో ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి మాదాల. ఆర్. నారాయణ మూర్తి లాంటి వారికి మాదాల స్ఫూర్తి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు మాదాల రంగారావు, టి. కృష్ణ, పోకూరి బాబూరావులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల రంగారావు ఒకరు. చిరంజీవి ప్రజల సమస్యలపై అనేక గొప్ప సినిమాలు నిర్మించిన గొప్ప వ్యక్తి మాదాల. ఆయన సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోతే ప్రభుత్వాల మెడలు వంచి సెన్సార్ సర్టిఫికెట్‌ను సంపాదించుకున్నారు. ఆ వ్యక్తి అకాల మరణం చెందటం బాధాకరం. – తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను, రంగారావు చాలా మంచి స్నేహితులం. ఇద్దరం ఎప్పుడూ ఆయన స్కూటర్‌పైనే తిరుగుతూ ఉండేవాళ్లం. ఆ టైమ్‌లో నేను నిర్మాతగా చిరంజీవి నటించిన ‘కోతలరాయుడు, మొగుడు కావాలి’ రెండు సినిమాలను ఆయన స్కూటర్ మీద తిరుగుతూనే నిర్మించాను. అప్పుడు మా స్నేహితులందరూ ఎప్పుడు ఆయన స్కూటర్ మీద తిరుగుతుంటావు నీ సినిమాలో ఓ వేషం ఇవ్వచ్చు కదా అని నన్నడిగారు. అప్పుడు నేను ఆయన నాకు మంచి స్నేహితుడే కానీ నటించటానికి రంగారావు పనికిరాడని చెప్పాను. కట్‌చేస్తే ఎప్పుడు బ్యానర్ పెట్టాడో, సినిమా ఎప్పుడు తీశాడో కాని ‘యువతరం కదిలింది’ అనే పెద్ద హిట్‌తో ఒక్కసారిగా షాకిచ్చాడు. చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి రంగారావు. – తమ్మారెడ్డి భరద్వాజ మాదాల రంగారావుతో నాది 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. సినిమాలకు నన్ను పరిచయం చేసింది ఆయనే. ప్రజల కోసమే సినిమాలు తీశారాయన. మాదాల లేకపోతే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నేను లేను. – వందేమాతరం శ్రీనివాస్. రెడ్‌స్టార్ మాదాలగారి మరణంతో నిబద్ధతతో ఎగిరిన ఎర్రజెండా వాలిపోయింది. అర్థంలేని సెంటిమెంట్లకు, మూఢవిశ్వాసాలకు ఆలవాలమైన తెలుగు సినిమారంగంలో రంగారావుగారు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ‘యువతరం కదిలింది’ సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీకు పరిచయం చేశారాయన. ‘విప్లవశంఖం’ సినిమాకు సెన్సార్‌బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో వారి కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేసి మరో సంచలనానికి కారణం అయ్యాడు. పాటల రికార్డింగ్ రోజునే విడుదల తేది ప్రకటించేవారు. సినిమా నిర్మాణం వ్యాపారంలా కాకుండా ఆశయంగా భావించారు. ఆయన మరణ వార్త తెలుగు సినిమా రంగంలో ప్రగతిశీల శక్తులమీద పిడుగులా పడింది. – అదృష్ట దీపక్ -
నింగికేగిన‘రెడ్ స్టార్’
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు కల్చరల్: వెండి తెరకు ‘ఎర్ర’రంగులద్దిన విప్లవ శంఖం మూగబోయింది. సినీ వినీలాకాశంలో ‘రెడ్ స్టార్’గా వెలుగొందిన ఎర్ర సూరీడు అస్తమించాడు. విప్లవ, అభ్యుదయ భావాలతో ఓ తరాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ నటు డు, నిర్మాత మాదాల రంగారావు (70) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతు న్న ఆయన్ను చికిత్స కోసం 19న స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు డాక్టర్ మాదాల రవి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటి పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలి తం లేకపోయింది. రెండు మాసాల కిందట గుండెపోటు రావడంతో రంగారావుకు చైన్నైలో చికిత్స అం దించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమా ర్తె ఉన్నారు. సోమవారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో మాదాల అంత్యక్రియలు జరగనున్నాయి. నాటకాల నుంచి సినీరంగం వైపు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న మాదాల రంగారావు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఒంగోలు మున్సిపల్ హైస్కూలులో విద్యనభ్యసించారు. అనంతరం కళాకారుల పుట్టినిల్లైన సీఎస్ఆర్ శర్మ కాలేజీలో బీఏ చదివారు. నల్లూరి వెంకటేశ్వర్లు సాహచర్యంలో కళాకారుడిగా ఎదిగారు. అభ్యుదయ చిత్రాలకు నూతన ఒరవడి దిద్దిన టి.కృష్ణ, పోకూరు బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్, నర్రాతోపాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటివారు సినీరంగం వైపు ఆకర్షితులు కావడానికి మాదాలే స్ఫూర్తిగా నిలిచారు. సినీరంగంలోకి వచ్చే ముందు అనేక నాటకాల్లో నటించిన ఆయన మొదటిసారిగా నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై 1980లో ‘యువతరం కదిలింది’ సినిమా తీశారు. ఆ చిత్రం శత దినోత్సవం జరుపుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం గెల్చుకుంది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్ర పావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’తదితర చిత్రాల్లో నటించి రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కళ ప్రజల కోసం.. ప్రజా కళాకారుడిగా, ప్రజా నాట్యమండలి నీడన మా దాల ప్రజలను చైతన్యపరిచే చిత్రాలనే నిర్మించారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే గరికిపాటి రాజారావు మార్గంలో పయనించారు. సినిమాల ద్వా రా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల కు, దానధర్మాలకు వెచ్చించేవారు. గతంలో సినిమాలన్నీ స్టూడియోల్లోనే రూపుదిద్దుకునేవి. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని సినిమా మొత్తాన్ని ప్రజల మధ్య రూపొందించిన ఘనత మాదాలకే దక్కుతుంది. ప్రముఖుల నివాళి ఆదివారం ఉదయం మాదాల పార్థివ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. మంత్రి తలసానితో పాటు సినీ నటులు చిరంజీవి, శ్రీకాంత్, శివాజీరాజా, నరేశ్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, వామపక్షాల నేతలు నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పవన్ కల్యాణ్ ఆయన మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బాగ్ లింగంపల్లిలోని ఎస్వీకేలో అభిమానుల సందర్శనార్థం మాదాల భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న చిరంజీవి చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం: జగన్ మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. వామపక్ష భావజాలంతో కూడిన సినిమాలతో కీర్తి గడించిన రంగారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. మాదాల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేసీఆర్ సంతాపం మాదాల మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు తీయడం ద్వారా మాదాల అనేక మందికి స్ఫూర్తి కలిగించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమానికి తీరనిలోటు మాదాల రంగారావు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, కళారంగానికి తీరని లోటు. అభ్యుదయ, వామపక్ష భావాలు కలిగిన ఎన్నో సినిమాలు నిర్మించి ఆయన ప్రజలను చైతన్యపరిచారు. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి తలసాని, చిత్రంలో మాదాల రవి. -
నన్ను ప్రోత్సహించిన వారిలో ఆయన ఒకరు
విప్లవ నటుడు మాదాల రంగారావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మాదాల రంగారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ‘రంగారావు గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చినా.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం విప్లవాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి ఆయన. ఆర్. నారాయణమూర్తి లాంటి వారికి ఆయనే స్ఫూర్తి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు మాదాల రంగారావు, టి.కృష్ణ, పోకూరి బాబురావులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల రంగారావు ఒకరు’అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. -
విప్లవ నటుడు మాదాల రంగారావు మృతి
-
మాదాల రంగారావు మృతికి ప్రముఖుల సంతాపం
-
‘ఎర్ర నక్షత్రం’ కానరాకుండా పోయింది!
నక్సలైట్లు ప్రభావం చూపుతున్న తరుణం అది. అడవిలో అన్నలు... సమాజంలోని అంతరాలను ప్రశ్నిస్తున్న రోజులవి. సినీ ఇండస్ట్రీలో ప్రేమ కథలు, కుటుంబ కథలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవభావాలతో ‘ఎర్ర’ సినిమాలను తెరకెక్కించేందుకు ఓ వీరుడు వచ్చాడు. ఎరుపు రంగునే తన ఆయుధంగా మలుచుకుని.. వామపక్ష భావజాలంతో సమాజ అభ్యుదయమే ధ్యేయంగా సినిమాలు నిర్మిస్తూ... నటిస్తూ.. రెడ్ స్టార్‌గా ఎదిగారు. ఆయనే మాదాల రంగారావు. నేడు ఈ ఎర్ర సూర్యుడు అస్తమించాడు. ప్రకాశం జిల్లా మైనం పాడులో 1948 మే 25న జన్మించిన ఈయన తన భావాలకు అనుగుణంగా సినిమాలను నిర్మించారు. 'చైర్మన్ చలమయ్య' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు మాదాల రంగారావు. ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా 'యువతరం కదిలింది' చిత్రాన్ని తీసి మొదటిసారిగా బంగారునంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంస్థలో.. ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, విప్లవ శంఖం, స్వరాజ్యం, తొలిపొద్దు, ప్రజాశక్తి, ఎర్రసూర్యుడు లాంటి విప్లవ సినిమాలనే నిర్మించారు. తన సినీ జీవితాన్ని తాను నమ్మిన సిద్ధాంతానికే అంకితం చేశారు. వామపక్ష భావాజాలానికి అనుగుణంగానే సినిమాలను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు. ప్రస్తుత తరానికి ఆర్. నారాయణమూర్తి గురించి మాత్రమే తెలుసు. కానీ 80,90ల్లోనే విప్లవ సినిమాలకు నాంది పలికిన యోధుడు రంగారావు. కమ్యూనిస్టు పార్టీతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. ప్రజానాట్య మండలిలో క్రియాశీల సభ్యుడిగానూ వ్యవహరించారు. నేడు ఈ ఎర్ర నక్షత్రం కానరాకుండా పోయింది. రంగారావు మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్ నటుడు మాదాల రంగారావు కన్నుమూత
-
ప్రముఖ సినీనటుడు ‘రెడ్‌స్టార్’ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు(70) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈనెల 20న హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌లోని మాదాల రవి ఇంటికి తరలించనున్నారు. మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నటుడి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేపథ్యం.. ప్రకాశం జిల్లా మైనం పాడు మాదాల స్వగ్రామం. 1948 మే 25న ఆయన జన్మించారు. నవతరం పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల, ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీశారు. నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, విప్లవశంఖం, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించారు. -
హాస్పిటల్లో మాదాల
విప్లవ నటుడు, నిర్మాత ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ – ‘‘నాన్నగారికి గత ఏడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించాం. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. డయాలసిస్ జరుగుతోంది. ఆయన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మాదాల రంగారావు పరిస్థితి విషమం
విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్ హాస్పిటల్ వైద్యులు చికిత్స చేశారు. అప్పటి నుంచి రంగారావు స్టార్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో హాస్పిటల్ చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకు డయాలిసిస్ చేస్తున్నట్టుగా మాదాల రవి తెలిపారు. -
నాంపల్లి టేషనుకాడి...
‘‘రూపాయి నోటుకి కొత్త రూపం వచ్చింది. కానీ.. ధనిక–పేద అంతరాలు మారలేదు! సంపాదనకి కొత్త కొత్త మార్గాలు వచ్చాయి. కానీ.. ఇతరుల కష్టాన్ని దోచుకోవాలనే కొందరి స్వార్థం మారలేదు!’’ అన్నారు నటుడు మాదాల రవి. మాదాల రంగారావు, మురళీమోహన్ హీరోలుగా ‘ధవళ’ సత్యం దర్శకత్వంలో మాదాల రంగారావు నిర్మించిన చిత్రం ‘ఎర్ర మల్లెలు’. విప్లవ చిత్రాలకి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలోని ‘నాంపల్లి టేషనుకాడి..’ పాటను ‘ప్రజా నాట్యమండలి’ ప్రభు రాశారు. ఈ పాటతత్వం గురించి మాదాల రవి మాటల్లో... సుమారు ముప్ఫై ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ పాట వింటుంటే... అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదనిపిస్తుంది. పాట సందర్భం ఏంటంటే.... ఓ ధనవంతుడు నాంపల్లి నుంచి ఒంగోలుకి రైల్లో వస్తాడు. అక్కణ్ణుంచి ఆయన ప్రయాణం కోసం స్టేషన్ బయట ఖరీదైన కారు సిద్ధంగా ఉంటుంది. ఆ కారుని శుభ్రం చేస్తున్న కుర్రాణ్ణి చూసి జాలిపడిన వాళ్లావిడ ఏదైనా సహాయం చేయమంటుంది. అప్పుడా ధనవంతుడు కోపంతో ‘నాంపల్లి స్టేషన్లో ఎక్కింది మొదలు ఒంగోలు దిగే వరకు ఎక్కడ చూసినా ఇలాంటోళ్లే. ఇడియట్స్! కల్చర్ పెరిగిపోయి దేశమంతా రామరాజ్యం అయిపోతుంటే.. ఇలాంటి వెధవలంతా కలసి ఆ పేరుని పాడు చేస్తున్నారు’ అని వెళ్లిపోతాడు. అప్పుడీ పాట మొదలవుతుంది. పల్లవి: నాంపల్లి టేషనుకాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివాశంభు లింగా... లింగా (2) నాంపల్లి టేషనుకాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివాశంభు లింగా... లింగా (2) ‘ఒంగోలే కాదు.. నాంపల్లితో పాటు మన దేశమంతా ఇటువంటి పరిస్థితే ఉందా?’ అని పిల్లాడు ఈ పాట అందుకుంటాడు. అప్పుడు నాంపల్లి స్టేషన్, ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్స్... ప్రతిచోటా కారు శుభ్రం చేయడానికి వచ్చే పిల్లలు అప్పుడప్పుడూ కనిపిస్తారు. చరణం : తిందామంటే తిండీలేదు... ఉందామంటే ఇల్లే లేదు (2) చేద్దామంటే కొలువు లేదు... పోదామంటే నెలవు లేదు ‘‘ నాంపల్లి..‘‘ గుక్కెడు గంజి కరువైపాయే... బక్కటి ప్రాణం బరువైపాయే (2) బీదబిక్కి పొట్టలు గొట్టి... మేడలు గట్టె సీకటి శెట్టి ‘‘నాంపల్లి..‘‘ స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా మనిషి కనీస అవసరాలు తిండి, ఇల్లు, ఉద్యోగం లేని ప్రజలు మన దేశంలో ఉన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కానీ, ఇదే టెక్నాలజీని ఉపయోగించి పేదల కష్టాన్ని దోచుకుంటున్న ధనవంతుల గురించి అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. చరణం: లేని అమ్మది అతుకుల బతుకు.. ఉన్న బొమ్మకి అందం ఎరువు (2) కార్లలోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె ‘‘నాంపల్లి..‘‘ ఈ చరణం విన్నప్పుడల్లా ‘ప్రభుగారు ఎంత ముందు చూపుతో ఆలోచించారు’ అనిపిస్తుంది. పాశ్చాత్య సంస్కృతి పేరుతో చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం ఇప్పటి ట్రెండ్. ఓ పక్క పేదలు చిరిగిన బట్టలకు అతుకులు వేసుకుంటుంటే.. మరోపక్క డబ్బున్నోళ్లు అందంగా ముస్తాబవడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎవర్నీ తప్పుబట్టడం లేదు. కానీ, మన భారతీయ సంస్కృతికి సుదూరంగా ప్రజలు వెళ్తున్నారనేది అక్షర సత్యం. పైగా, ఇప్పుడు బట్టలు ఎంత కురచగా ఉంటే అంత ఎక్కువ రేటు ఉంటున్నాయి. చరణం: ముందు మొక్కులు ఎనక తప్పులు... ఉన్నవాడికే అన్నీ చెల్లును (2) ఉలకావేమి పలకావేమి... బండరాయిగ మారిన సామి ‘‘నాంపల్లి..‘‘ అప్పుడూ.. ఇప్పుడూ... వేలకోట్లకు టోపీ పెట్టేసినోళ్లు ఎక్కడైనా దర్జాగానే తిరుగుతున్నారు. పైకి దేవుడికి మొక్కుతున్నారు. వెనక తప్పులు చేస్తున్నారు. వాళ్లకు అన్నీ చెల్లుతున్నాయి. ఈ పరిస్థితులపై భగవంతుడు ఎప్పుడూ స్పందించడం లేదు! అని కుర్రాడు బాధతో పాటని ముగిస్తాడు. ఈ పాటకి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రముఖ గాయని ఎస్పీ శైలజగారు ఈ పాటతోనే చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి పాటతోనే ఉత్తమ గాయనిగా నంది పురస్కారం అందుకున్నారామె. నేను బాల నటుడిగా పరిచయమైంది కూడా ఈ పాటతోనే. ఇందులో నేను నటించడం వెనుక జరిగిన ఓ చిత్రమైన సంఘటన గురించి చెప్పాలి. ఈ చిత్రానికి నిర్మాత నాన్నగారే కదా. పాటల రికార్డింగ్ పూర్తయిన తర్వాత క్యాసెట్ ఇంటికి తీసుకొచ్చారు. ఓసారి ఈ పాట పెట్టుకుని నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఎక్కడో బయటకు వెళ్లొచ్చిన నాన్నగారు నన్ను చూశారు. పాటంతా పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మెచ్చుకున్నారు. తర్వాత సినిమాలో కూడా నా చేత నటింపజేశారు. ఒక్క రోజులోనే పాట చిత్రీకరణ పూర్తయింది. మరో విశేషం ఏంటంటే... ప్రముఖ దర్శకులు టి. కృష్ణగారు ఈ పాటకి దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ఈ పాటకి నృత్యదర్శకులు ఎవరూ లేరు. టి. కృష్ణగారితో పాటు చిత్ర దర్శకులు ‘ధవళ’ సత్యంగారు, చిత్రానికి కో–డైరెక్టర్‌గా పనిచేసిన బి. గోపాల్... ముగ్గురూ కలసి చిత్రీకరించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ‘ఎర్ర మల్లెలు’ చిత్రం సిల్వర్‌జూబ్లీ ఆడింది. సినిమాతో పాటు పాట కూడా సూపర్‌హిట్. ‘ప్రజా నాట్యమండలి ప్రభుగారు రాసిన ఏకైక పాట ఇది. తెలుగులోని అత్యుత్తమ వంద పాటల్లో ‘నాంపల్లి టేషనుకాడ..’ పాట ఒకటని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్ఎఫ్డీసీ) పేర్కొంది. ఇంటర్వూ్య: సత్య పులగం