సాక్షి, హైదరాబాద్: సినిమా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మాదా ల రంగారావు వామపక్ష భావజాల వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేశా రని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రెడ్‌స్టార్ మాదాల రంగారావు సంస్మరణసభ నిర్వహించారు.
నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం మాదాల చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. వామపక్ష సిద్ధాంతం, భావజాల వ్యాప్తే ఊపిరిగా పనిచేశారన్నారు. వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనేక చిత్రాలు తీశారని కొనియాడారు. వామపక్ష భావజాల సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు వచ్చినా, సమస్యలు ఎదురైనా, చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా ప్రజలకు చేర్చారన్నారు.
విప్లవ సినిమాల దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ కళ కాసుల కోసం కాదని, కళ ప్రజల కోసమని చాటిన మహామనీషి మాదాల రంగారావు అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి. కార్యదర్శివర్గ సభ్యుడు అజీజ్‌పాషా, మాదాల తనయుడు రవి, పలువురు కళాకారులు, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment