మాదాల మృతదేహానికి నివాళులర్పిస్తున్న నర్సయ్య
కొమురవెల్లి(సిద్దిపేట) : ప్రజా కళాకారుడు మాదా ల రంగారావు మృతి ప్రజా ఉద్యమాలకు, కళారంగానికి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కొమురవెల్లి మండల కేంద్రంలో మాదాల రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వెండితెరపై అనేక విప్లవ భావాలు గల సినిమాలను తెరకెక్కించి ప్రజలను చైతన్య పరిచిన గొప్ప కళాకారుడని అన్నారు. ఆయన మృతి ఈ లోకానికి తీరని లోటన్నారు.
కార్యక్రమంలో దాసరి కళావతి, రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, అత్తిలి శారద, అరుంట్ల రవి, శశికళలతో పాటు పలువురు పాల్గొన్నారు.మాదాల రంగారావు మృతదేహంకు వద్ద మరి ముచ్చాలకు చెందిన నర్సయ్య సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాల రంగారావుతో తనకు 20 ఏళ్ళుగా పరిచయముందని, ఆయన మృతి విప్లవ లోకానికి తీరని లోటని అన్నారు. సినిరంగంలో ఎర్రమందారంతో పాటు అనేక విప్లవ భావాలతో వెండి తెరపైకి తెచ్చి ప్రజలను చైతన్యం చేసి ప్రజలలో ఉత్తేజపరిచారని అన్నారు. ఆయన కుమారుడు మాదాల రవిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment