‘ఎర్ర నక్షత్రం’ కానరాకుండా పోయింది! | Telugu Film Producer And Actor Madala Ranga Rao Has Died | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 9:42 AM | Last Updated on Sun, May 27 2018 3:02 PM

Telugu Film Producer And Actor Madala Ranga Rao Has Died - Sakshi

నక్సలైట్లు ప్రభావం చూపుతున్న తరుణం అది. అడవిలో అన్నలు... సమాజంలోని అంతరాలను ప్రశ్నిస్తున్న రోజులవి. సినీ ఇండస్ట్రీలో ప్రేమ కథలు, కుటుంబ కథలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవభావాలతో ‘ఎర్ర’ సినిమాలను తెరకెక్కించేందుకు ఓ వీరుడు వచ్చాడు. ఎరుపు రంగునే తన ఆయుధంగా మలుచుకుని.. వామపక్ష భావజాలంతో సమాజ అభ్యుదయమే ధ్యేయంగా సినిమాలు నిర్మిస్తూ... నటిస్తూ.. రెడ్‌ స్టార్‌గా ఎదిగారు. ఆయనే మాదాల రంగారావు. నేడు ఈ ఎర్ర సూర్యుడు అస్తమించాడు. 

ప్రకాశం జిల్లా మైనం పాడులో 1948 మే 25న  జన్మించిన ఈయన తన భావాలకు అనుగుణంగా సినిమాలను నిర్మించారు. 'చైర్మన్ చలమయ్య' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు మాదాల రంగారావు. ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా 'యువతరం కదిలింది' చిత్రాన్ని తీసి మొదటిసారిగా బంగారునంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంస్థలో.. ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, విప్లవ శంఖం, స్వరా​జ్యం, తొలిపొద్దు, ప్రజాశక్తి, ఎర్రసూర్యుడు లాంటి విప్లవ సినిమాలనే నిర్మించారు. తన సినీ జీవితాన్ని తాను నమ్మిన సిద్ధాంతానికే అంకితం చేశారు. వామపక్ష భావాజాలానికి అనుగుణంగానే సినిమాలను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు. 

ప్రస్తుత తరానికి ఆర్‌. నారాయణమూర్తి గురించి మాత్రమే తెలుసు. కానీ 80,90ల్లోనే విప్లవ సినిమాలకు నాంది పలికిన యోధుడు రంగారావు.  కమ్యూనిస్టు పార్టీతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. ప్రజానాట్య మండలిలో క్రియాశీల సభ్యుడిగానూ వ్యవహరించారు. నేడు ఈ ఎర్ర నక్షత్రం కానరాకుండా పోయింది. రంగారావు మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement