wear
-
గ్లామర్‌లో వేరే లెవల్.. సైనా నెహ్వాల్‌ను ఇలా ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
బనారసీ చీర గౌనులో కరీనా స్టన్నింగ్ లుక్స్..! (ఫోటోలు)
-
బ్లాక్ ఎంబ్రాయిడరీ వెస్ట్రన్ లుక్‌లో మృణాల్..ధర తెలిస్తే షాకవ్వుతారు!
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో మంచి మార్కులు కొట్టేసి అభిమానుల మనుసు దోచుకుంది. సీతగా నటించి మృణాల్ తెలుగు ప్రేక్షకులు మన అమ్మాయే అని ఫీలయ్యేలా చేసింది. చక్కటి అభినయం, నటనతో ఇట్టే అలరించింది. అంత చక్కటి మృణాల్ తన గ్లామర్‌ని ఇనుమడింప చేసే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్లు ఉన్నాయి. ఎప్పటి కప్పుడూ మంచి స్ట్రైయిలిష్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టే మృణాల్ ఈసారి ఇండో-వెస్ట్రన్ లుక్‌లో మిస్మరైజ్ చేసింది. వావ్! వాటే ఏ స్టన్నింగ్ లుక్ అనేలా కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది మృణాల్ అందం. ఎప్పుడూ సంప్రదాయ చీర లేదా ప్యాంట్ సూట్ వంటి దుస్తులతో సందడి చేసే మృణాల్ ఈసారి బ్యాక్ ఎంబ్రాయిడర్ త్రీ పీసెస్ డ్రస్ ధరించింది. ఆ డ్రస్‌పై సీక్విన్స్ ఎంబ్రాయిడరీ మృణాల్‌కి మంచి లుక్ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్ మల్హోత్రా బ్రాండ్ గోల్డెన్ చెవిపోగులను, బ్రాస్లెట్ని ధరించింది. ఇక కాళ్లకు బెల్లీషూస్ ధరించడంతో మరింత స్టయిలిష్‌గా కనిపించింది. ఇక ఆమె ధరించిన బ్లాక్ వెస్టర్న్ డ్రస్ ప్రఖ్యాత బ్రాండ్ మిశ్రుకు చెందింది దీని ధర ఏకంగా రూ. 88,000/-. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ బ్రాండ్ ప్రముఖ సెలబ్రెటీల ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. అందువల్లే దీని ధరలు అంత లగ్జరీగా ఉంటాయి. అలాగే మృణాల్ ఎక్కువగా ఫాన్సీ షరారా సెట్లు, అనార్కలీ వంటి డ్రస్‌లను ఇష్టపడతాని చెబుతోంది. ఇక మృణాల్ విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలి స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) (చదవండి: వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!) -
Celebrities In Face Masks: కరోనా టైమ్‌లో మాస్క్‌లు ధరించిన నటీనటుల ఫోటోలు మళ్లీ వైరల్ (ఫొటోలు)
-
బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు అన్ని ఈజీగా ఇందులోనే!
పూరీలు, పునుగులు వంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌తో పాటు.. గవ్వలు, గోరుమిటీలు, మురుకులు వంటి పిండి వంటకాలు.. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ వంటి వెరైటీలనూ తయారు చేసుకోవాలంటే శ్రమ తప్పదు అనుకుంటున్నారా? అలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ మినీ డీప్ ఫ్రైయర్. నూనె తక్కువ పీల్చుకుంటూ.. హెల్దీ రుచులను అందిస్తుంది.1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బేస్ పాత్రకు లోపల.. ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది. దాని ప్రకారం ఆయిల్ పోసుకుని.. నెట్ బాస్కెట్లో పిండి వంటకాలు, ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు. బాస్కెట్‌కి పొడవైన హ్యాండిల్ ఉంటుంది. దాంతో ఈ డివైస్‌ని వినియోగించడం చాలా తేలిక. ఇందులో 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 190 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. సుమారు 4 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు ఇందులో ఎలాంటి ఆహారాన్నైనా సిద్ధం చేసుకోవచ్చు. యాంటీ స్కాల్డింగ్ డిజైన్‌తో రూపొందిన ఈ గాడ్జెట్‌ను క్లీన్ చేయడం, ఇతర ప్రదేశాలకు మూవ్ చేసుకోవడం చాలా సులభం. (చదవండి: గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!) -
క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!
సాధారణంగా రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారెవరైనా... ‘ఇన్నాళ్లూ పనిచేసి అలసిపోయాం, ఇక విశ్రాంతి తీసుకుందాం’ అనుకుంటారు. అయితే సుకన్య, సంధ్యారావులు మాత్రం ఇలా అనుకోలేదు. రిటైర్మెంట్ తరువాత కొత్త వ్యాపారం చేయాలనుకున్నారు. అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్నా వారిలోని హుషారు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అక్క సుకన్య ఎమ్మెస్సీ చేసింది. దానికితోడు టీచింగ్, ఫార్మా, ఆడిటింగ్, ఆర్ట్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ ఇంజినీర్ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్‌లో పనిచేసిన అనుభవం వాటికి తోడైంది. అయితే అనుకోకుండా ఎదురైన ఒక సంఘటన వల్ల వారు క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అయిన ప్రత్యేక తరహా దుస్తులను రూపొందిస్తూ తమ వైవిధ్యాన్ని కూడా చాటుకుంటున్నారు. అత్తయ్య అవస్తలు చూసి... దుస్తుల పరిశ్రమలో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన సంధ్య తనకు తనే బాస్ కావాలి అనుకునేది. ఈ క్రమంలోనే ఏదైనా దుస్తుల తయారీ కంపెనీ పెడితే బాగుంటుందని అనుకున్నారు అక్కాచెల్లెళ్లు. వీరు ఇలా ఆలోచిస్తున్న సమయంలో... వీరిద్దరికీ ఎంతో ఇష్టమైన వీరి మేనత్తకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సుకన్య, సంధ్యలకు మంచి స్నేహితురాలిలా ఉండే మేనత్త క్యాన్సర్‌తో బాధపడడం వారిని కలచి వేసింది. ఒకపక్క క్యాన్సర్ బాధిస్తుంటే మరోపక్క ఆమె ధరించే దుస్తులు ఆమెకు సౌకర్యంగా లేకపోవడాన్ని ఇద్దరూ గమనించారు. క్యాన్సర్‌తో బాధపడే ఎంతోమంది రోగులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ రోగులు ధరించడానికి వీలుగా ఉండే దుస్తులు రూపొందిస్తే వందలాది మంది క్యాన్సర్ రోగులకు సాయం చేసినట్లే అనుకుని ‘వీకీ వేర్’ పేరిట క్యాన్సర్ రోగులకు దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. సలహాలు... సూచనలతో... ఆంకాలజిస్టులు, క్యాన్సర్ రోగుల సలహాలు, సూచనలు తీసుకుని 2017లో తలకు పెట్టుకునే టోపీని రూపొదించారు. కాటన్‌తో తయారు చేసిన ఈ టోపీని కీమోథెరపీ చేయించుకునేటప్పుడు ధరించడానికి అనుకూలంగా తయారు చేశారు. తరువాత మాస్టెక్టమీ బ్రాలను రూపొందించారు. చర్మానికి సౌకర్యంగా ఉండే బ్రాలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా క్యాన్సర్ రోగులకు అవసరమైన వాటిని స్వయం సహాయక గ్రూపులతో తయారు చేయిస్తూ సాటి మహిళ లకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరి వీకీ వేర్ ఉత్పత్తులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. రోగులకు ఇలా... వీకీ వేర్ ఉత్పత్తులు తయారయ్యాక క్యాన్సర్ రోగులకు టెస్టింగ్ కోసం పంపించి, వారికి అన్నివిధాల సౌకర్యంగా ఉన్నాయన్న నిర్ధారణ అయిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నారు. క్యాన్సర్ కేర్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను కలిసి వీకీ వేర్ గురించి చెప్పడం, క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న రోగులకు వాటిని ఇవ్వడం ద్వారా వీకీ వేర్ రోగులకు చేరుతున్నాయి. వీకీ వేర్ వెబ్సైట్, సోషల్ మీడియా, ఈ కామర్స్ సైట్ల ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు సుకన్య, సంధ్యారావులు. ‘‘మీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు కంటోన్న కల మీద నమ్మకం ఉంచండి. అది తీరడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు. అయినా వెనక్కి తగ్గవద్దు. కలను నిజం చేసుకునే క్రమంలో ఎవరినైనా సాయం అడగడానికి సిగ్గుపడవద్దు. ఇలా నిజాయితీగా ముందుకు సాగితే వ్యాపారం ఏదైనా రాణించగలుగుతారు’’ అని సుకన్య, సంధ్యలు యువతరానికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
రిలయన్స్ స్పోర్ట్స్‌వేర్ భారీ ప్రణాళికలు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌కు చెందిన స్పోర్ట్స్‌వేర్ వ్యాపారం ‘పెర్ఫార్మెక్స్’ భారీ వృద్ధి ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో సంస్థ వ్యాపారం ఐదు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ ప్రెసిడెంట్ అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. క్రీడా కార్యకలాపాలు పెరగడం, ఆరోగ్యకరమైన జీవనం పట్ల అవగాహన విస్తృతం కావడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండడం డిమాండ్‌కు సానుకూలంగా పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్తో (ఏఐఎఫ్ఎఫ్) పెర్ఫార్మెక్స్ తాజాగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత ఫుట్‌బాల్ జట్టుకు కిట్, మర్చండైజ్ భాగస్వామిగా పెర్ఫార్మెక్స్ వ్యవహరించనుంది. ‘‘ప్రస్తుతం భారత్‌లో స్పోర్ట్స్‌వేర్ పరిమాణం చాలా చిన్న స్థాయిలోనే ఉంది. ఎక్కువ శాతం స్థానిక బ్రాండ్లే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కనుక వృద్ధి చెందేందుకు భారీ అవకాశాలున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ రిటైల్ ప్రేరణగా నిలవనుంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే అందుబాటు ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడంపై దృష్టి సారించాం’’అని ప్రసాద్ తెలిపారు. రిలయన్స్ రిటైల్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఇప్పటికే 11 స్టాండలోన్ స్పోర్ట్స్‌వేర్ స్టోర్లను ఏర్పాటు చేసింది. నాన్ మెట్రో సహా దేశవ్యాప్తంగా ఇతర పట్టణాల్లోనూ స్టోర్లను తెరిచే ప్రణాళికతో ఉంది. స్టాండలోన్ స్టోర్ల పరంగా తాము మంచి స్పందన చూస్తున్నట్టు ప్రసాద్ వివరించారు. పెర్ఫార్మెక్స్ ఉత్పత్తులు ట్రెండ్స్, ఇతర చైన్ స్టోర్లలోనూ లభిస్తాయని చెప్పారు. ప్రజలకు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పంపిణీ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలు ఆరోగ్యపరంగా స్పృహను కలిగి ఉంటున్నారని, స్పోర్ట్స్‌వేర్ విభాగంలో అందుబాటు ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు లభించడం కష్టంగా ఉందన్నారు. ఈ విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటి ధరలు ఎంతో ఖరీదుగా ఉంటున్నాయని, ఎగువ మధ్య తరగతి వారికి సైతం ఇవి అందుబాటులో లేవని చెప్పారు. -
చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!
విదేశాల్లో ఉంటే కచ్చితంగా ఏ దేశస్తులైనా అక్కడి ఆహార్యానికి తగ్గట్టుగా ఉంటాం. మన సంప్రదాయాలకు సంబంధించిన దుస్తులు పర్సనల్‌గానే వాడతాం గానీ. అంత తేలిగ్గా అవి వేసుకుని బయటకు రాం. లేదా అక్కడ మన కమ్యూనిటీ వాళ్లు ఉంటే..అంతా ఒకచోట కలిస్తే గనుక మన దేశ సంప్రదాయాన్ని ఫాలో అవుతాం. అలా కాకుండా ఎలాంటి సందర్భం లేకుండా ఫారినర్స్ రద్దీగా ఉండేచోట మనం గనుక మన వేషధారణలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటి వీడియోని పల్లవి రాజ్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఓ మహిళ ఇటలీలోని రోమ్ వీధుల గుండా ఓ మహిళ చీర కట్టుకుని ఓ దేవతా మాదిరి వెళ్లింది. అక్కడ సరిగ్గా వందలాదిమంది విదేశీయులు బారులుతీరి ఉన్నారు. వారంతా ఒక్కసారిగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయారు. మరికొందరూ ఫోటోలు తీశారు. మరికొందరూ వావ్ అంటూ నోరెళ్లబెట్టారు కూడా. ఎక్కడైన మన సంప్రదాయానికి అందరూ ఫిదా కావల్సిందే కదా. ఎప్పటకీ మన చీరే ట్రెండీ ఫ్యాషన్ దానికి మించిది మరోకటి లేదు అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by Pallavi Raj (@myshadowbeats) (చదవండి: 46 వేల ఏళ్లనాగి పురుగుకి జీవం పోస్తే..పిల్లల్ని కనడం ప్రారంభించింది!) -
అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు!
అలా సరదాగా పిక్నిక్ కు వెళ్లి.. ఆరుబయట ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వేడివేడిగా భోజనం తింటే ఎంత ఆనందంగా ఉంటుంది? చిన్నప్పుడు ఊళ్లలో వంటలకని వెళ్లేవాళ్లు. అక్కడే దొరికే కర్రముక్కలతో వంట పొయ్యి చేసి కుండల మీద వండి భోజనాన్ని సిద్ధం చేసుకునేవారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం. మరేం చేయాలి? ఇదిగో మా దగ్గర జవాబు ఉందంటున్నాయి కంపెనీలు. క్యాంపింగ్స్, పిక్నిక్స్, లాంగ్ డ్రైవ్స్ లాంటివి మెమొరీస్‌గా నిలిచిపోవాలంటే.. అక్కడ పరిసరాలతో పాటు చక్కటి ఆహారం దొరకాలి. లేదంటే ఆరోగ్యం చెడి.. ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఆనందాన్ని మిస్ అవుతాం. అందుకే చాలా మంది.. మంచి కుక్వేర్ని వెంట తీసుకెళ్తుంటారు. చిత్రంలోని కుక్వేర్ అలాంటిదే. ఈ పరికరాన్ని చేత్తో సులభంగా పట్టుకెళ్లొచ్చు. దీని హ్యాండిల్స్ డివైస్‌కి ఇరువైపులా బల్ల మాదిరిగా ఉండి.. స్టోరేజ్‌కి ఉపయోగపడతాయి. outdoor cooking - something healthy & fresh ... my daughters volunteered to cook 👌 mahimahi slices, baigani tavu & roasted corn 🤙 pic.twitter.com/3yLBwMMTnr— Moira Vilsoni-Raduva (@mvilsoni_fj) July 8, 2023 గ్స్ కూడా ఫోల్డ్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. కిందవైపు సొరుగుల్లో చెక్కముక్కలు లేదా బొగ్గులు వేసుకుని నిప్పు రాజేసుకోవాలి. దానికి ప్రత్యేకమైన డోర్ ఉంటుంది. పొగవాసన బయటికి పోవడానికి వెనుకవైపు ప్రత్యేమైన గొట్టాన్ని అమర్చుకోవచ్చు. దీన్ని వేరుచేసి డివైస్ లోపల సొరుగులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరంపై అన్ని రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందుకు తగ్గ పాత్రలను మార్చుకోవచ్చు. లాంగ్‌డ్రైవ్‌లో చక్కగా ఉండటమేగాక హాయిగా ఇంటి భోజనం చేశామన్నా సంతృప్తి దొరకుతుంది కదా!. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరీ. (చదవండి: ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..) ఔట్ డోర్ లో సులభంగా వండే 30 వంటలు 30 Picnic Recipes (and 6 Complete Menus) for a Perfect Outdoor Feast. Picnic as single person with my walker??? Not really, I cook/eat at home only.https://t.co/cTcHwkzWif pic.twitter.com/CAyMhdHqBE— Marion Friedl #ForUkraine #Boostered #PostVac (@marillion13) July 15, 2023 -
కబళించిన కడలి
► మరో ఇద్దరిని మింగేసిన కెరటాలు ► రుషికొండ వద్ద మళ్లీ విషాదం ► మృతులు హైదరాబాదీలు అలల నవ్వులతో అందంగా కనిపించే కడలి మళ్లీ పంజా విసిరింది. కెరటాల మాటున దాగిన మృత్యువు మరో ఇద్దరు యువకుల ప్రాణాలను మింగేసింది. సంద్రాన్ని చూసి ఉప్పొంగిన సంతోషంతో స్నానానికి వెళ్లిన వారిని ఆపద అమాంతం కబళించింది. ఆదివారం నాడు అందమైన రుషికొండ తీరంలో అలలతో ఆటలాడుదామనుకుంటే.. జీవితమే అర్థాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ నుంచి పని కోసం వచ్చి.. సెలవు రోజున సరదాగా గడుపుదామ నుకుంటే.. శాశ్వత విషాదం సంప్రాప్తమైంది. ఆరుగురు యువకులబృందంలో నలుగురు మత్స్యకారుల తెగువతో కెరటాల కాటు నుంచి బయటపడగా, ఇద్దరికి మాత్రం ఆపాటి అదృష్టం లేకుండా పోయింది. వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో శోక సంద్రం ఉప్పొంగిపోయింది. సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : రాకాసి అలలకు ఇద్దరు యువకులు బలైపోయారు. ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి విశాఖ నగరానికి వచ్చిన రాహుల్ ఉపాధ్యాయ(33), నావల్పాండ్య (25) కెరటాలకు చిక్కి విగతజీవులయ్యారు. సరదాగా తీరంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురిలో ఐదుగురు తీరంలో గల్లంతవగా... ఒడ్డునే ఉన్న స్నేహితుడి సమాచారంతో స్థానిక మత్స్యకారులు ముగ్గురిని సురక్షితంగా రక్షించగలిగారు. వారంతా ప్రస్తుతం గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరూ విగత జీవులయ్యారు. వీరిలో నావల్ పాండ్య అనే యువకుడిని కొన ఊపిరితోనే ఒడ్డుకు చేర్చామని... ఆ క్షణంలో వైద్యం అందితే బతికేవాడని మత్స్యకార యువకులు ఆర్.పెదకొండ, టి.సతీష్, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన యూషఫ్, హైదరాబాద్‌కు చెందిన అక్బర్, హుస్సేన్, మోహిజ్, రాహుల్ ఉపాధ్యాయ, నావల్ పాండ్య డైమాండ్ పార్కు సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన కరాచీ బేకరీలో పనిచేస్తున్నారు. వీరంతా కరాచీ బేకరీ రీ మోడలింగ్ చేస్తూ మురుళీనగర్లో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం 6.30 గంటలకు రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. సాయిప్రియ రెసిడెన్సీ వెనుక తీరంలో ఐదుగురు సముద్రంలో దిగి స్నానాలు చేస్తుండగా ఉధృతమైన అలలకు వారంతా గల్లంతయ్యారు. వెంటనే ఒడ్డున ఉన్న యూషఫ్ మెరైన్ టవర్ వద్ద ఉన్న మత్స్యకార యువకులకు సమాచారం అందించాడు. దాంతో ఆర్.పెదకొండ, టి.సతీష్, ఎద్దిపల్లి అప్పన్న, గద్దిపల్లి దుర్గ పరిగెత్తుకుంటూ వచ్చి మునిగిపోతున్న అక్బర్, హుస్సేన్, మోహిజ్‌లను రక్షించారు. అప్పటికే కనిపించకుండా పోయిన వారిలో నావల్ పాండ్యను కొన ఊపిరితో ఒడ్డుకు చేర్చినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు రాహుల్ ఉపాధ్యాయ చనిపోయి తేలడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం తెల్లవారుజామునే జరగడంతో ఆ సమయంలో లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో మత్స్యకార యువకులే ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఐ సంతోష్, పీఎం పాలెం ఎస్ఐ కె.శ్యామ్‌సుందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డేంజరస్ జోన్ రుషికొండ తీరం, సాయిప్రియ రెసిడెన్సీ వెనుక ప్రాంతాలు రిప్ కరెంట్ జోన్ (భయంకరమైన కెరటాలు వచ్చే జోన్)గా ప్రకటించినా సందర్శకులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ప్రాంతంలో ఈత కొట్టడం ప్రమాదకరమని తెలిసినా స్నానాలకు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పహారా కాసే లైఫ్ గార్డులు, పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు రుషికొండ తీరంలో ఎక్కడా జీవీఎంసీ గాని, పోలీసులు గాని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు హుద్‌హుద్ తుఫాన్ సమయంలో కూలిపోయాయి. వాటి స్థానంలో మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సందర్శకులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్, నవీన్ మంచి స్నేహితులు హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన రాహుల్ ఉపాధ్యాయ, నావల్ పాండ్య మంచి స్నేహితులు. వీరిద్దరూ కరాచీ బేకరీ రీ మేకింగ్ కోసం రెండేళ్ల కిందట విశాఖపట్నం వచ్చారు. ప్రతీ వారం రుషికొండ బీచ్‌కు వస్తుంటాం. ఈ వారం ఇలా జరిగింది. ఎంతో హుషారుగా అందరితో కలిసిపోయేవారు. వీరిలో నవీన్‌కు ఏడాది కిందటే వివాహం జరిగింది. – లోకేష్, కరాచీ బేకరీ ఉద్యోగి కళ్లెదుటే జరిగిపోయింది ఐదుగురు లోపలకు దిగి స్నానాలు చేస్తుండగా రాహుల్, నావల్ ఒక్కసారిగా కన్పించలేదు. మిగిలిన అక్బర్, హుస్సేన్, మోహిజ్ కంగారుపడిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి వెంటనే మెరైన్ టవర్ వద్ద ఉన్న మత్స్యకారులను రక్షించమని వేడుకున్నాను. వారు ప్రయత్నించి ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. కొన ఊపిరితో నావల్ పాండ్యను ఒడ్డుకు చేర్చినా ఫలితం లేకపోయింది. –యూషఫ్, మృతుల సహ ఉద్యోగి వెళ్లొద్దని చెప్పినా వినలేదు స్నానాలు చేయడానికి ఆ తీరం వైపు వెళ్లవద్దని యువకులకు చెప్పినా వారు వినలేదు. సముద్రంలోకి దిగి కెరటాలు కబళిస్తుంటే వారిలో ఒకరు పరుగున వచ్చి రక్షించమని అడిగారు. వెంటనే వెళ్లి సాధ్యమైనంతవరకు ముగ్గురిని రక్షించాం. మిగితా ఇద్దరినీ రక్షించలేకపోయాం. – టి.సతీష్, రుషికొండ, మత్స్యకార యువకుడు -
హెల్మెట్ ధరించటం తప్పనిసరి
-
కాషాయం ధరించని కర్మయోగి-శివానంద
నివాళి ధర్మశాస్త్రాలు మథించవచ్చు. ఆచరించినవారు ఎంతమంది ఉంటారు? ధన సంపదలు కొల్లలుగా ఉండవచ్చు. వాటిని సద్వినియోగం చేసుకొన్న వారు ఎంత మంది? ధర్మాన్నీ, ధనాన్నీ, జ్ఞానాన్నీ ఆచరణలో సద్వినియోగం చేసిన కర్మ యోగి... భూస్వామిగా జన్మనె త్తినా.. నిరుపేద వైపు నిలిచిన మానవతామూర్తి శివానం ద మూర్తి (డిసెంబర్ 21, 1928-జూన్ 10, 2015). శివానందమూర్తిగారి గురించి ఒక్కమాటలో చెప్ప మని ఎవరినైనా అడిగితే, ఆయన ‘ప్రేమమూర్తి’ అని వెంటనే చెబుతారు. తెల్లని బట్టల్లో, తెల్లని విభూతిరేఖల మధ్య, వికసించే తెల్లని నవ్వుతో ఆశీర్వదించే ఆ రూపం -ఆనందస్వరూపంగా దర్శనమిస్తుంది. ప్రాథమిక పాఠ శాల తెలుగు ఉపాధ్యాయునిలా కనిపించే ఆ మూర్తి ఎం దరికో జీవితపాఠాలు చెప్పింది. శివానందమూర్తిగారు పీఠాధిపతి కాదు. కానీ ఎందరో పీఠాధిపతులకు ఆద ర్శంగా నిలుస్తారు. ప్రేమ, సేవ ఆయన మార్గాలు. కందుకూరి శివానందమూర్తి ఉర్లాం (శ్రీకాకుళం జిల్లా) సంస్థానానికి వారసులు. పూర్వులంతా సంస్థానా ధీశులు, భూస్వాములు. సర్వమంగళ, వీరబసవరాజు దంపతులకు రాజమండ్రిలో జన్మించా రు. 1949లో విజయనగరం ఎమ్మార్ కళాశాలలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సంస్థానాధీశుల నేపథ్యం ఉన్నా, శివానందమూర్తి సామాన్యుడి గా జీవించడానికే ఇష్టపడ్డారు. ఆ తత్వ మే ఉద్యోగం వైపు తీసుకువెళ్లింది. హన్మకొండలో పోలీస్‌శాఖలో చేరారు. అది కొంతకాలమే. తరువాత సామా జిక సేవ కోసం ఉద్యోగాన్ని వదిలిపె ట్టారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ‘ఆనందవనం’ పేరుతో ఆశ్రమాన్ని స్థాపించుకున్నారు. సనాతన ధర్మ ప్రచారం, భారతీయ సంస్కృతి, వారస త్వాల గురించి బోధించడం; సంగీతం, సాహిత్యం వంటి లలితకళలకు చేయూతనిచ్చి సేవచేయడం కోసం మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. ఆధ్యాత్మిక దృష్టి, జ్ఞానతృష్ణ, పేదసాదలకు సేవ తండ్రిగారి నుంచి శివా నందమూర్తి వారసత్వంగా పొందారు. ఆ మార్గం లోనే జీవితమంతా గడిపారు. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నో రచనలు చేశారు. యోగశాస్త్రాన్ని తనివితీరా మథించారు. ‘భారతదేశం పేదది కాదు, ప్రజలే పేదల య్యారు’ అన్నది ఆయన అభిప్రాయం. సంపద ఏ ఒక్క రి సొత్తూ కారాదు, భౌతిక సంపద, జ్ఞాన సంపద అం దరికీ అందాలన్నది ఆయన భావన. శివానందమూర్తి ఎన్నో గిరిజన ప్రాంతాలను సందర్శించారు. అక్కడి జనంతో మమేకమయ్యారు. భీమిలి లోని ఆనందవనం పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఉంటుంది. అక్క డ జరిగే కార్యక్రమాలకు ఎక్కువగా పేదవాళ్లే వస్తూ ఉంటారు. వారి దయ నీయ జీవనం చూసి శివానందమూర్తి కన్నీళ్లు పెట్టుకునే వారు. వారికి ఏదైనా చేయాలని తపన పడేవారు. శివానందమూర్తిగారికి జర్నలిజం అంటే ఇష్టం. ఇం గ్లిష్ పత్రిక ఒకటి స్థాపించాలన్న ఆలోచన కూడా ఉం డేది. చదువుకునే రోజులలో ఖాసా సుబ్బారావుగారితో ఎక్కువ అనుబంధం పెంచుకున్నారు. ‘సుపథ’ పేరుతో ఒక పత్రిక శివానందమూర్తి ఆధ్వర్యంలో నడిచింది. శివానందమూర్తి గొప్ప పుస్తకాభిమాని. వ్యక్తిగత గ్రంథాలయంలోనే కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. తన తండ్రి పుస్తక భాండాగారంలోని 13 వేల పుస్తకాలను ఆయన చదివారట. సనాతన ధర్మం, చరిత్ర, లలిత కళలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, యోగం, సైన్సు, వైద్యం, సాంకేతిక శాస్త్రం, జర్నలిజం- ఇలా అన్ని రంగాలపైన ఆయన అసాధారణమైన జ్ఞానాన్ని సంపాదించారు. దానిని పదిమందికీ పంచారు. ‘కఠోపనిషత్’ మీద శివానందమూర్తి రాసిన పుస్త కం కంచి పరమాచార్య, శృంగేరి శంకరాచార్యుల మన్నన లను పొందింది. హిందూ వివాహ వ్యవస్థ, మహర్షుల చరిత్ర, గౌతమబుద్ధ వంటి అంశాలపై ఆయన వెలు వరించిన రచనలు చిరస్థాయిగా ఉన్నాయి. సనాతన చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్ర మ్యూజిక్ అకా డమీలు స్థాపించి ధర్మానికీ, జ్ఞానానికీ సిసలైన వేదికలను నిర్మించి పెట్టారు. పీవీ నరసింహారావు వంటి రాజనీతి జ్ఞుని మొదలు, ఆధునిక సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరకు అంతా ఆయన అభిమానులే. దేశవిదేశాల్లో ఎందరో శిష్యులు, అభిమానుల ప్రేమకు పాత్రులైన వారు శివానందమూర్తి. ‘నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి పెద్దగా ఆలోచ నలు లేవు. ఆర్ట్ ఆఫ్ లీవింగ్ కోసమే నేను ఆలోచిస్తాను’ అని శివానందమూర్తిగారు నాతో అనేవారు. నిజంగానే.. తన చివరి మజిలీలో కూడా చిరునవ్వు చిందిస్తూ, అంద రినీ ఆశీర్వదిస్తూనే వెళ్లిపోయారు. ఎక్కడి ఉర్లాం? ఎక్కడి ఓరుగల్లు? (శివానందమూర్తి ఇక్కడే కన్నుమూశారు.) విశ్వమానవునిగా జీవించి, తోటి జీవులను ప్రేమించి సేవించిన కర్మయోగి శివానందమూర్తిగారికి అంజలి ఘటిస్తున్నాను. - మా శర్మ (వ్యాసకర్త టాలీవుడ్ చానల్ సీఈఓ) మొబైల్: 9393102305