బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో మంచి మార్కులు కొట్టేసి అభిమానుల మనుసు దోచుకుంది. సీతగా నటించి మృణాల్ తెలుగు ప్రేక్షకులు మన అమ్మాయే అని ఫీలయ్యేలా చేసింది. చక్కటి అభినయం, నటనతో ఇట్టే అలరించింది. అంత చక్కటి మృణాల్ తన గ్లామర్‌ని ఇనుమడింప చేసే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్‌లు ఉన్నాయి. ఎప్పటి కప్పుడూ మంచి స్ట్రైయిలిష్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టే మృణాల్ ఈసారి ఇండో-వెస్ట్రన్ లుక్‌లో మిస్‌మరైజ్ చేసింది. వావ్! వాటే ఏ స్టన్నింగ్ లుక్ అనేలా కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది మృణాల్ అందం.
ఎప్పుడూ సంప్రదాయ చీర లేదా ప్యాంట్ సూట్ వంటి దుస్తులతో సందడి చేసే మృణాల్ ఈసారి బ్యాక్ ఎంబ్రాయిడర్ త్రీ పీసెస్ డ్రస్ ధరించింది. ఆ డ్రస్‌పై సీక్విన్స్ ఎంబ్రాయిడరీ మృణాల్‌కి మంచి లుక్ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్ మల్హోత్రా బ్రాండ్ గోల్డెన్ చెవిపోగులను, బ్రాస్‌లెట్‌ని ధరించింది. ఇక కాళ్లకు బెల్లీషూస్ ధరించడంతో మరింత స్టయిలిష్‌గా కనిపించింది. ఇక ఆమె ధరించిన బ్లాక్ వెస్టర్న్ డ్రస్ ప్రఖ్యాత బ్రాండ్ మిశ్రుకు చెందింది
దీని ధర ఏకంగా రూ. 88,000/-. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ బ్రాండ్ ప్రముఖ సెలబ్రెటీల ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. అందువల్లే దీని ధరలు అంత లగ్జరీగా ఉంటాయి. అలాగే మృణాల్ ఎక్కువగా ఫాన్సీ షరారా సెట్లు, అనార్కలీ వంటి డ్రస్‌లను ఇష్టపడతాని చెబుతోంది. ఇక మృణాల్ విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలి స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
(చదవండి: వర్కౌట్‌లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!)
Comments
Please login to add a commentAdd a comment