Ethnic
-
బ్లాక్ ఎంబ్రాయిడరీ వెస్ట్రన్ లుక్‌లో మృణాల్..ధర తెలిస్తే షాకవ్వుతారు!
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో మంచి మార్కులు కొట్టేసి అభిమానుల మనుసు దోచుకుంది. సీతగా నటించి మృణాల్ తెలుగు ప్రేక్షకులు మన అమ్మాయే అని ఫీలయ్యేలా చేసింది. చక్కటి అభినయం, నటనతో ఇట్టే అలరించింది. అంత చక్కటి మృణాల్ తన గ్లామర్‌ని ఇనుమడింప చేసే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్లు ఉన్నాయి. ఎప్పటి కప్పుడూ మంచి స్ట్రైయిలిష్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టే మృణాల్ ఈసారి ఇండో-వెస్ట్రన్ లుక్‌లో మిస్మరైజ్ చేసింది. వావ్! వాటే ఏ స్టన్నింగ్ లుక్ అనేలా కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది మృణాల్ అందం. ఎప్పుడూ సంప్రదాయ చీర లేదా ప్యాంట్ సూట్ వంటి దుస్తులతో సందడి చేసే మృణాల్ ఈసారి బ్యాక్ ఎంబ్రాయిడర్ త్రీ పీసెస్ డ్రస్ ధరించింది. ఆ డ్రస్‌పై సీక్విన్స్ ఎంబ్రాయిడరీ మృణాల్‌కి మంచి లుక్ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్ మల్హోత్రా బ్రాండ్ గోల్డెన్ చెవిపోగులను, బ్రాస్లెట్ని ధరించింది. ఇక కాళ్లకు బెల్లీషూస్ ధరించడంతో మరింత స్టయిలిష్‌గా కనిపించింది. ఇక ఆమె ధరించిన బ్లాక్ వెస్టర్న్ డ్రస్ ప్రఖ్యాత బ్రాండ్ మిశ్రుకు చెందింది దీని ధర ఏకంగా రూ. 88,000/-. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ బ్రాండ్ ప్రముఖ సెలబ్రెటీల ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. అందువల్లే దీని ధరలు అంత లగ్జరీగా ఉంటాయి. అలాగే మృణాల్ ఎక్కువగా ఫాన్సీ షరారా సెట్లు, అనార్కలీ వంటి డ్రస్‌లను ఇష్టపడతాని చెబుతోంది. ఇక మృణాల్ విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలి స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) (చదవండి: వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!) -
స్ఫూర్తిని మరిచారు
రియో డి జనీరో : స్నేహం.. సౌభ్రాతృత్వానికి మారుపేరుగా ఒలింపిక్స్‌ను పేర్కొంటారు. రెండు వారాలపాటు అంతా ఒక్కటై కలివిడిగా ఉంటూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనేందుకు ఇదో చక్కటి వేదిక. కానీ ఇక్కడ కూడా తమ జాతి ‘ప్రయోజనా’లే ముఖ్యమని లెబనాన్ అథ్లెట్లు భావించినట్టున్నారు. ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన బస్‌లో లెబనాన్, ఇజ్రాయెల్ అథ్లెట్లు కలిసి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలియని లెబనాన్ ఆటగాళ్లు ముందుగా ఎక్కి కూర్చున్నారు. అనంతరం ఇజ్రాయెల్ ఆటగాళ్లు లోనికి రావడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వారిని డోర్ దగ్గరే అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఇజ్రాయెల్ వారిని వేరే బస్‌లో పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇలా ప్రవర్తించడం ఒలింపిక్ చార్టర్‌ను అవమానించినట్టే అని ఇజ్రాయిల్ అధికారులు విమర్శిస్తున్నారు. వాండర్లీకి అనుకోని అదృష్టం ఏ దేశంలో ఒలింపిక్స్ జరిగినా జ్యోతి ప్రజ్వలన చేసేది ఎవరనే ఆసక్తి అందరికీ ఉంటుంది. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. రియో ఒలింపిక్స్‌లో ఇలాంటి అరుదైన అవకాశం మాజీ అథ్లెట్ వాండర్లీ డి లిమాకు చివరి నిమిషంలో దక్కింది. నిజానికి ఒలింపిక్స్ జ్యోతిని ఫుట్‌బాల్ దిగ్గజం పీలే వెలిగించాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాలతో తాను తప్పుకుంటున్నట్టు నిర్వాహకులకు తెలపడంతో కేవలం కార్యక్రమానికి ఓ గంట ముందే 46 ఏళ్ల వాండర్లీని ఇందుకోసం ఆహ్వానించారు. జ్యోతిని వెలిగిస్తానని తాను కలలో కూడా అనుకోలేదని ఆయన తెలిపారు. -
నలుదిశలా వేదనాదం!
సనాతన భారతీయ సంప్రదాయాన్ని దశదిశలా చాటి చెప్పే ఉద్దేశంతో కీసర మండలంలో నెలకొల్పిన వేద పాఠశాల దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. విద్యార్థులను వేదాల్లో నిష్ణాతులుగా మలచి పురాతన హిందూ సంస్కతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు కానుకగా అందజేస్తోంది. ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల ప్రస్తుతం వేదాల బోధనకు దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాఠశాల శనివారంతో 34వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. కీసర: దక్షిణ భారతదేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన వేదవిద్యను అందిస్తున్న కీసరగుట్ట టీటీడీ వేదపాఠశాల నేటితో 33 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 1981లో ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాలయం దినదిన ప్రవర్థమానం చెందుతూ దక్షణ భారతవనిలోనే వేదాల బోధనకు పేరుగాంచింది. ప్రాచీన గురుకుల సంప్రదాయన్ని అనుసరిస్తూ క్రమశిక్షణతో కూడిన వేద విద్యను ఇక్కడ నిష్ణాతులైన ఆచార్యులు బోధిస్తున్నారు. వేద పండితులైన ఆచార్యుల సంరక్షణలో విద్యార్థులు వేదాన్ని, శైవాగమాన్ని, స్మార్తాన్ని నేర్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ విద్యాలయంలో ఇటీవలే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. విశాలమైన స్థలంలో ప్రార్థనా మందిరం, విశ్రాంతి గదులు, తరగతి గదులు తదితర సౌకర్యాలతో ఈ పాఠశాల కొనసాగుతోంది. వేద విద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న టీటీడీ ఆశయాలకు అనుగుణంగా కీసరగుట్ట వేదపాఠశాల ఇప్పటి వరకు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు దేశంలోని వివిధప్రాంతాల్లో ఆచార్యులుగా, ఆలయ పూజారులుగా, పురోహితులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కృష్ణ యజుర్వేదం (12 సంవత్సరాలు), శైవాగమం, స్మార్తం (8 సంవత్సరాలు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాల్లో 125 విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. నేడు స్నాతకోత్సవం కీసర గుట్ట వేదపాఠశాల స్నాతకోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు జరగనుంది. టీటీడీ ఈఓ జి. గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో వేదవిద్యను పూర్తిచేసుకున్న 16 మంది విద్యార్థులకు (కృష్ణయజుర్వేదం-1, శైవాగమం-6 , స్మార్తం-9 ) పట్టాలతోపాటు, నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తారు. పెద్దమొత్తంలో విద్యార్థులకు గౌరవభృతి కీసరగుట్ట వేదపాఠశాలలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు టీటీడీ ఇచ్చే గౌరవభృతి పెద్ద మొత్తంలో ఉంటుంది. విద్యార్థులు ఈ పాఠశాలలో చేరిన రోజే ఈ మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుండటం విశేషం. వేదవిద్య కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థికి రూ 4.64 లక్షలు, శైవాగమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు 1.91 లక్షల నగదుపాటు సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. -
ఇంజినీరు - ఇంగ్లిషు పంచాంగం
తిథి వార నక్షత్రాలు... రాశి ఫలాలు... ముహూర్తాలు... రాహు కాలాలు... వర్జ్యాలు... యమగండాలు... తెలుగు, సంస్కృత భాషల అక్షరాలకు అంకెలు జత చేరడం... ఇదీ స్థూలంగా పంచాంగం... మరి ఇందులో తెలుగు, సంస్కృతాల స్థానంలో ఆంగ్ల అక్షరాలు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది..? ఈ ఆలోచనే ఆంగ్ల పంచాంగ రూపకల్పనకు నాంది పలికింది. దీనిని రూపొందించినది ఇంజనీరింగ్ చదివిన యువకుడు కావడం విశేషం... భారతీయ సంప్రదాయ, శాస్త్రీయ విద్యా విషయ విజ్ఞానం పట్ల విదేశీయులకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో 25వ ఏటనే ఆంగ్ల పంచాంగాన్ని రూపొందించడం ప్రారం భించారు శర్మ. సంస్కారానికి పర్యాయ పదాలైన మంచిచెడులను నిర్థారించే పంచాంగాన్ని విశ్వమంతటికీ అర్థ మయ్యేలా తయారుచేసి ‘ఔరా’ అనిపించుకున్నారు రాజమండ్రికి చెందిన ఈ 28 ఏళ్ల యువ ఇంజనీర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ఈ ఆలోచన వెనుక... భద్రాచలంలో బీటెక్ పూర్తిచేసిన శర్మ, ఎంటెక్ చేసేందుకు 2007లో డెహ్రాడూన్ పెట్రోలియం యూని వర్శిటీలో ఆయిల్ అండ్ గ్యాస్, పైప్లైనింగ్ కోర్సు పూర్తి చేశారు. చదువుకుంటూనే, వీలు చిక్కినప్పుడల్లా, దేశ సంస్కృతిని అధ్యయనం చేసేందుకు యాత్రలు చేశారు. అలా బదరీనాథ్, కేదారనాథ్లను సందర్శించినప్పుడు ఏదో మధురానుభూతిని పొందారు. సరిగా ఆ సమయం లోనే పలువురు విదేశీయులతో పరిచయం ఏర్పడింది. ‘‘నేను కలిసిన ఎందరో విదేశీయులు... మన పంచాగం, ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ మూఢ నమ్మకాలంటూ చులకనగా మాట్లాడారు. వారి మాటలకు నా మనసు బాధపడింది. మన దేశ గొప్పదనం గురించి వాళ్లకు ఏదో ఒక విధంగా తెలియచెప్పాలనుకున్నాను. అందుకు నేను ఎంచుకున్న మార్గం పంచాంగం. అందరికీ చేరువ కావాలంటే పంచాంగం ఆంగ్లంలో ఉండాలని భావించి, ఆ భాషలో రచనకు పూనుకున్నాను’’ అంటూ తన ఆలోచన వెనుక ఉన్న విషయాన్ని వివరించారు శర్మ. ప్రారంభంలో... 2008లో ఆంగ్లంలో పంచాంగ రచనకు పూనుకొన్న ప్పుడు శర్మ ఎందరో పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొ న్నారు. పంచాంగం అనేది చాలా మంది రాస్తున్నారు కదా! ‘అందులో నుంచి కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయడమే కదా!’ అని చులకనగానూ మాట్లాడారు. అయినప్పటికీ పట్టువదలని దీక్షతో తన రచన కొనసాగించి, 2011 నాటికి పంచాంగాన్ని పూర్తి చేశారు. ‘‘నన్ను ఎందరో విమర్శిస్తున్న తరుణంలో నా తల్లి భానుమతి, (ర్యాలి ప్రభుత్వ పాఠశాలలో సంస్కృతం టీచర్), భార్య పూర్ణిమ (బీటెక్ కంప్యూటర్స్) మా అత్తగారు కృష్ణప్రియ ముగ్గురూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి వల్లే నేను పంచాంగం నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను. మా అమ్మగారి ఆశీస్సులతో... నేను ఆరాధించే శ్రీరాముని సన్నిధి భద్రాచలంలో ఈ పంచాంగాన్ని ఆవిష్కరించాను. నాటి నుంచి ఏటేటా ఆంగ్ల పంచాంగాన్ని విడుదల చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం కొత్త అంశాలు జోడిస్తున్నాను. తాజా పంచాంగంలో సామాన్యులు సైతం వారికి వారు ముహూర్తాలు ఎలా పెట్టుకోవచ్చో తెలుసు కునేలా విపులీకరించాను. ఇంకా గోచారరీత్యా ఎవరు ఏ దేవుని ప్రార్థించాలో సూచించడమే కాకుండా, చేయాల్సిన ప్రార్థన వివరాలు కూడా పొందుపరిచాను’’ అని తన పంచాంగం గురించి వివరించారు శర్మ. యువత కోసం... నేటి యువత మన సంస్కృతి సంప్రదాయాలను మరచి పోతోంది. వారికి వాటి గురించి చెప్పాలను కున్నాను. ఆంగ్లం అయితే యువత తొందరగా చదువు తారు కనుక, వారికోసం సరళమైన భాషలో పంచాంగాన్ని రాయాలనుకున్నాను. ‘‘కొన్ని సంస్కృత పదాలకు ఆంగ్ల పదాలు ఉండవు. అలా లేని పదాలను, కొన్ని సంస్కృత శ్లోకాలను యథాతథంగా ఉంచేశాను. అవసరమైన చోట సైంటిఫిక్‌గా కూడా చెప్పాను’’ అని చెబుతున్న శర్మ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా వాస్తు విషయాంశాలపై ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని అచ్చు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాచలం తిరుమల పీఠం ద్వారా ‘జ్యోతిష మార్తాండ’ పురస్కారాన్ని అందు కున్నారు ఈ యువ ఇంజినీరు. శర్మ రూపొందించిన ఆంగ్ల పంచాంగం తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం విశేషం. - డి.సూర్యనారాయణమూర్తి, సాక్షి, రాజమండ్రి ఫొటో: టి.కె.ధనంజయ, సాక్షి, బెంగళూరు సంస్కృత నేపథ్యం... భద్రాచలంలో బీటెక్ చదువుతున్న రోజుల్లో అక్కడే సంస్కృతం చదువుకున్నాను. సిద్ధాంత భాగంలో విద్యాభూషణ్ చేశాను. ప్రస్తుతం ‘వాస్తు ఫర్ కామన్ మ్యాన్’ అని పుస్తకం రాస్తున్నాను. మా గురువులు శ్రీమన్నారాయణాచార్యుల దగ్గర వాస్తు, పంచాంగం తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేశాను. పంచాంగ రచనకు అవసరమైన సలహాలు తీసుకున్నాను. అలాగే వచ్చే సంవత్సరం ప్రచురించనున్న ఆంగ్ల పంచాంగంలో మరిన్ని కొత్త అంశాలను చేర్చే ఆలోచనలో ఉన్నాను. ఆన్లైన్లో ఆంగ్ల పంచాంగం కోసం http:// chilakamarthi.com/(చిలకమర్తి.కామ్) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. - చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ