పనాజీ : దేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనలు సాగుతుంటే గోవాలోని బస్సులో ఓ వ్యక్తి తన జననాంగాలు చూపుతూ ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ పట్టుబడ్డాడు. బస్సులో బాధిత బాలికకు దగ్గరగా వచ్చిన సదరు వ్యక్తి తన మర్మాంగాలను చూపుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడు.
బాలిక పక్కనే మరో మహిళ కూర్చుని ఉన్నా లెక్కచేయని నిందితుడు తనను తాకుతూ వికృతానందం పొందాడని బాధితురాలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చేసి పట్టుబడిన అనంతరం పొరపాటుగా ఇదంతా జరిగిందని ఆ వ్యక్తి చెబుతున్నాడని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ ఎస్‌ఎం కోఆర్డినేటర్ హసిబా అమిన్ ట్వీట్ చేశారు. సిగ్గుమాలిన పనిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment