
నిందితుడు సంతోష్
మల్కాజిగిరి: సోదరి వరుసయ్యే బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ సంజీవరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి పటేల్‌నగర్‌కు చెందిన బాలరాజ్, భాగ్యలక్ష్మి దంపతులు నాచారంలోని ఓ కంపెనీ క్యాంటిన్‌లో పని చే సేవారు.
ఆలేరులో ఉంటున్న తన సోదరుడితో బాలరాజ్‌కు స్ధల వివాదం నడుస్తోంది. మంగళవారం ఈ విషయం మాట్లాడేందుకు అతడి సోదరుడి కుమారుడు సంతోష్ మల్కాజిగిరికి వచ్చాడు. సాయంత్రం స్థలం విషయం మాట్లాడుకున్న అనంతరం బాలరాజ్ భార్యతో కలిసి పనికి వెళ్లాడు. ఆ తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చిన సంతోష్ బాలరాజ్ కుమార్తె పట్ల అసభ్యకంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయం తల్లితండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం నిందితుడడు సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment