ఓ మహిళా ఉద్యోగిని పట్ల హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్.లక్ష్మి భర్త నాగరాజు అనుచితంగా ప్రవర్తించాడు.
అనంతపురం (హిందూపురం) : ఓ మహిళా ఉద్యోగిని పట్ల హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్.లక్ష్మి భర్త నాగరాజు అనుచితంగా ప్రవర్తించాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాగరాజు మంగళవారం ఉదయం 12వ వార్డుకి వెళ్లాడు. వార్డులో ఉన్న ఓ మహిళా ఉద్యోగి ఇంటి ముందు పూలమొక్కలు ఉన్నాయి.
పూలమొక్కలు ఎందుకు పెంచావు.. ఎవరి కోసం పెంచావ్.. వెంటనే తీసేయ్.. అంటూ అందరి ముందు నానా బూతులు తిట్టాడు. ఈ విషయం గురించి బాధిత మహిళ హిందూపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.