ఎన్యుమరేటర్ పట్ల అసభ్య ప్రవర్తన | TDP mla supporter misbehave with enumerator | Sakshi
Sakshi News home page

ఎన్యుమరేటర్ పట్ల అసభ్య ప్రవర్తన

Published Tue, Aug 19 2014 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులు అడ్డుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ : సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులు అడ్డుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి కథనం ప్రకారం సుల్తానా అనే ఎన్యుమరేటర్ ఎస్పీఆర్ హిల్స్లో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు ఇస్తూ సర్వే చెక్ లిస్టులను పంపిణీ చేస్తోంది.

అక్కడే నివాసం ఉంటున్న టీడీపీ నేత రాజు నాయుడు ఆమె వద్దకు వచ్చి సర్వే చేయడానికి వీలు లేదని, అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆమెను దుర్భాషలాడాడు. బాధిత యువతి తల్లి కూడా అక్కడికి వచ్చి తన కూతుర్ని ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించగా ఆమెను తిట్టాడు. దీంతో బాధితురాలు సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి రాజు నాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement