వివాదంలో మరో ఎంపీ
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన ఎంపి పప్పూ యాదవ్ విమాన సిబ్బందిని వేధించిన వివాదంలో ఇరుక్కున్నారు. పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మిగిలిన ఆహార పదార్థాలను కింద వేయొద్దు అని ఎంపీని వారించినందుకు తనపై అన్యాయంగా విరుచుకు పడ్డారని, వేధించారని ఎయిర్ హోస్టెస్ ఆరోపించారు.
దీనిని జెట్ ఇండియా వర్గాలు వర్గాలు ధృవీకరించాయి. విమానం ఢిల్లీలో దిగేముందు రక్షణ కావాలని కెప్టెన్ తమకు సమాచారం అందించారని తెలిపాయి. ఓ ప్రయాణీకుడు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని..సెక్యూరిటీ సాయం కావాలనే కోరడంతో అప్రమత్తమైనట్లు వెల్లడించాయి. అయితే ఈ వివాదంలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. కాగా ఈ ఆరోపణలను ఎంపీ పప్పూ యాదవ్ ఖండించారు. ఇదంతా తనపై రాజకీయంగా జరుగుతున్న కుట్ర అన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రాష్ట్రీయ జనతాదళ్ గత మే నెలలో పప్పూని పార్టీని తొలగించింది.