Actress Pragathi Shocking Comments About Casting Couch In Shooting, Deets Inside - Sakshi
Sakshi News home page

Pragathi: అతనొక స్టార్ కమెడియన్.. అలా చేస్తారనుకోలేదు: ప్రగతి

Published Mon, Jun 12 2023 10:49 AM | Last Updated on Mon, Jun 12 2023 11:24 AM

Actress Pragathi Shocking Comments About Casting Couch In Shooting - Sakshi

టాలీవుడ్‌ సీనియర్ నటి ప్రగతి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు తెరపై తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. యాక్టివ్‌గా ఉంటూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది ప్రగతి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఓ సినిమా సెట్‌లో క్యాస్టింగ్‌ కౌచ్ వేధింపులకు గురైనట్లు తెలిపింది. అందులోనూ ఓ స్టార్ కమెడియన్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు.  

(ఇది చదవండి: డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి )

ప్రగతి మాట్లాడుతూ..' ఆయన సెట్‌లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా ఉంటారు. అయితే ఒకరోజు  నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. ఆ రోజు నాకు ఏం వర్క్ చేయాలనిపించలేదు. లంచ్ చేయలేకపోయా. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదు.' అని అన్నారు. 

ఆ తర్వాత జరిగిన విషయం గురించి మాట్లాడుతూ.. 'ఆయన షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే క్యారవాన్‌లోకి తీసుకెళ్లి ప్రశ్నించా. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అడిగా. నేను అక్కడే రియాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటని నిలదీశా. మీరు కాబట్టే ఒక్క నిమిషం అలా సైలెంట్‌గా ఉండిపోయా.' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రగతి పట్ల మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ పేరు మాత్రం ఆమె బయటికి చెప్పలేదు. కాగా.. గతేడాది డీజే టిల్లు, రంగరంగ వైభవంగా, పెళ్లిసందడి చిత్రాల్లో కనిపించింది. 

(ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన నటి ప్రగతి )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement