యువతిపట్ల అసభ్య ప్రవర్తన.. కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు | Case Against Persons who Behaved Indecently at Hyderabad | Sakshi
Sakshi News home page

యువతిపట్ల అసభ్య ప్రవర్తన.. కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు

Published Thu, Dec 23 2021 8:12 AM | Last Updated on Thu, Dec 23 2021 8:12 AM

Case Against Persons who Behaved Indecently at Hyderabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: పబ్‌లో పార్టీ ముగించుకుని బయటకు వచ్చిన యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు.. టోలీచౌకి ప్రాంతానికి చెందిన యువతి(28) సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి మరో స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 36లోని రోగ్‌ క్లబ్‌ పబ్‌కు విందు కోసం వచ్చింది.

చదవండి: (Hyderabad: మసాజ్‌ సెంటర్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు)

పబ్‌ మూసిన తర్వాత కిందకు వచ్చిన యువతి వ్యాలెట్‌ డ్రైవర్‌ కోసం వేచి ఉన్న సమయంలో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చారు. ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారు. తమ కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు వేశారు. దీంతో బాధితురాలు బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement