Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ | Groom Misbehave With Bride On Wedding Stage Jaimala Ceremony Viral Video | Sakshi
Sakshi News home page

Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’

Published Sat, Oct 2 2021 8:09 PM | Last Updated on Mon, Oct 4 2021 12:06 PM

Groom Misbehave With Bride On Wedding Stage Jaimala Ceremony Viral Video - Sakshi

వివాహ వేడుకలో వధువరులు ఉత్సాహంగా ఉంటూ.. అన్ని కార్యక్రమాల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. వధువు, వరుడు ప్రవర్తించే తీరు.. వివాహానికి వచ్చినవారికి కూడా ఉత్సాహన్ని కలిగిస్తుంది. వధువరులు ఇద్దరూ ఒకరిపైఒకరు సంతోషంతో పెళ్లి వేడుకలోనే ప్రేమను కురిపిస్తారు. అయితే కొంతమంది మాత్రం పెళ్లిలో విచిత్రంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించిన వధువరుల వివాహాలు మధ్యలోనే ఆగిపోయినట్లు పలు వార్తల్లో చూశాం. కొన్ని జంటల్లో తమకు వివాహం జరుగుతుందన్న ఆసక్తి అసలు కనిపించదు. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువుపై వరుడు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన రిషెప్షన్‌ వేదికపై పెళ్లి దండలు మార్చుకునే క్రమంలో పెళ్లి కొడుకు విచిత్రంగా ప్రవర్తించాడు. ఇద్దరు వేదికపై నిల్చోని ఉంటారు. మొదటిగా పెళ్లి కూతురు.. వరుడి మెడలో దండ వేసి అలా నిల్చోని ఉంటుంది. అనంతరం వరుడు దండ వేయటం ఇష్టం లేదన్నట్లుగా దూరం నుంచే వధువుపైకి విసురుతాడు. దీంతో ఆ పూల దండ కిందపడుతుంది. ఇంత జరిగినా వధువు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా మౌనంగా అలా నిల్చుండి పోయింది.

ఈ ఘటనను చూసిన వివాహానికి వచ్చినవాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ వీడియోను అఫిషియల్‌ వైరల్‌ క్లిప్స్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పోస్ట్‌ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 8వేల మంది వీక్షించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు వరుడు ప్రవర్తించినపై కామెంట్లు చేస్తున్నారు. ‘వరుడు.. వధువును అవమానించాడు’, ‘వరుడు చాలా దారుణమైన వ్యక్తిగా ఉన్నాడు.. మీరు ఇప్పుడే విడిపోవటం మంచిది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement