
సాక్షి, కరీంనగర్‌క్రైం: బాలుడిపై వికృతచేష్టలకు పాల్పడడంతోపాటు ఎవరిౖకైనా చెబితే చంపుతానని బెదిరించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం... చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బాలుడిని 2017 మార్చి 19 తేదీన ఆదే గ్రామానికి చెందిన నూనె రవి అనే వ్యక్తి భూపాలపట్నంలో ఎవరూ లేని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తన మర్మాంగాన్ని బాలుడి నోట్లో పెట్టి వికృతచేష్టలకు పాల్పడ్డాడు.
చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. సీఐ సిహెచ్ రమేశ్ కేసును విచారణ చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్షులను ఏపీపీ వెంగళదాస్ శ్రీనివాస్ విచారించారు. కరీంనగర్ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మాధవికృష్ణ, నూనె రవికి ఏడేళ్ల జైలుతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.