
నటితో కపిల్ అసభ్య ప్రవర్తన
ముంబై: 'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదా సంపాదించుకున్న కపిల్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. మరాఠి నటి దీపాలి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి అభాసుపాలయ్యాడు. తాను చేసిన పనికి ట్విటర్ లో క్షమాపణలు చెప్పాడు.
ఇంటర్నేషనల్ మరాఠి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2015 పార్టీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాగినట్టు కనబడిన కపిల్ పలువురు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తనతో డాన్స్ చేయాలని బలవంతపెట్టాడు. మరాఠి నటి దీపాలిని కూడా ఇదే విధంగా బలవంతం చేశాడు. అతడితో డాన్స్ చేసేందుకు ఆమె నిరాకరించింది.
'నాతో డాన్స్ చేయాలని ఉందని కపిల్ చెప్పాడు. కానీ నేను అంగీకరించలేదు. అతడికి దూరంగా వెళ్లిపోయా. కపిల్ ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసినవారితోనే నేను డాన్స్ చేస్తా' అని దీపాలి తెలిపింది. ఈ ఘటనపై కపిల్ శర్మ క్షమాపణ చెప్పాడు. తాను అందరిలాంటి వాడినేనని, తప్పులు చేయడం మానవ సహజమని ట్వీట్ చేశాడు.
I fall, I rise, I make mistakes, I live, I learn, I've been hurt but I am alive.i am human, I am not perfect but I am thankful :)
— KAPIL (@KapilSharmaK9) November 3, 2015