విద్యార్థినితో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ | Floor incharge arrested for misbehaving with girl student | Sakshi
Sakshi News home page

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన, అరెస్ట్

Published Tue, Mar 15 2016 7:12 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Floor incharge arrested for misbehaving with girl student

మల్కాజిగిరి : విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్లోర్ ఇన్‌చార్జిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ నరసయ్య కథనం ప్రకారం... విజయనగరం జిల్లా రావికర్రవలస గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ పులి(29) మౌలాలిలోని డాక్టర్ కెకెఆర్ గౌతం పాఠశాలలో నాలుగు సంవత్సరాల నుంచి ఫ్లోర్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని పట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.

బాధిత విద్యార్థిని ఈ నెల 11వ తేదీన కుటుంబసభ్యులకు విషయం తెలియజేయడంతో ఆమె తండ్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పాఠశాల వద్దకు వెళ్లి వెంకటరమణను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement