నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్ | Salman Khan defends Sohail, says he didn't misbehave | Sakshi
Sakshi News home page

నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్

Published Fri, May 20 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్

నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్

ముంబై: జర్నలిస్టు పట్ల దరుసుగా ప్రవర్తించిన తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. పెళ్లి వార్తల గురించి తన కుటుంబాన్ని వేధించొద్దని మీడియాను కోరారు. తన తమ్ముడు దురుసుగా ప్రవర్తించలేదని, అతడు ఎప్పుడూ అలా చేయడని అన్నాడు.

తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్ కు గురువారం రాత్రి డిన్నర్ కు వెళ్లిన అర్బాజ్ ఖాన్ ను జర్నలిస్ట్ ఒకరు సల్మాన్ పెళ్లి గురించి అడిగాడు. దీంతో సహనం కోల్పోయిన అర్బాజ్.. జర్నలిస్ట్ పట్ల పౌరుషంగా ప్రవర్తించాడు. తన తమ్ముడు స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారని సల్మాన్ సమర్థించాడు. తన పెళ్లి వార్తల గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల వెంట పడొద్దని విజ్ఞప్తి చేశాడు.

తాను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ట్విటర్ ద్వారా వెల్లడిస్తానని చెప్పాడు. ప్రియురాలు లులియాను పెళ్లాడేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement