
సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం గోపవరంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. గోపవరానికి చెందిన విద్యార్ధినులతో టీడీపీ కార్యకర్త వడ్లపట్ల మురళి(50) అసభ్యంగా ప్రవర్తించాడు. గోపవరం గ్రామానికి చెందిన 20 మంది విద్యార్ధులు ఏలూరులోని శ్రీ చైతన్య కాలేజ్‌లో చదువుతున్నారు. వీరంతా గత నెల 30వ తేదీన కాలేజ్ బస్సులో ఏలూరు నుంచి గోపవరం వస్తుండగా వడ్లపట్ల మురళి అసభ్యంగా ప్రవర్తించాడు. మురళి చేష్టలపై ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు సమాచారమచ్చింది..
దీంతో గోపవరంలో బస్సును ఆపిన తల్లిదండ్రులు.. మురళిని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త విద్యార్థిని తండ్రితో ఘర్షణకు దిగి గాయపరిచాడు.మురళి చర్యలతో భయపడిన బాధితులు.. తమకు రక్షణ కల్పించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయింంచారు. స్పందించిన ఎమ్మెల్యేక టీడీపీ కార్యకర్త మురళిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విద్యార్ధినులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మురళి గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అన్ని కేసులను పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చదవండి: విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి