musunuru police
-
టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు.. కాలేజీ విద్యార్థినిలతో అసభ్య ప్రవర్తన
సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం గోపవరంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. గోపవరానికి చెందిన విద్యార్ధినులతో టీడీపీ కార్యకర్త వడ్లపట్ల మురళి(50) అసభ్యంగా ప్రవర్తించాడు. గోపవరం గ్రామానికి చెందిన 20 మంది విద్యార్ధులు ఏలూరులోని శ్రీ చైతన్య కాలేజ్‌లో చదువుతున్నారు. వీరంతా గత నెల 30వ తేదీన కాలేజ్ బస్సులో ఏలూరు నుంచి గోపవరం వస్తుండగా వడ్లపట్ల మురళి అసభ్యంగా ప్రవర్తించాడు. మురళి చేష్టలపై ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు సమాచారమచ్చింది.. దీంతో గోపవరంలో బస్సును ఆపిన తల్లిదండ్రులు.. మురళిని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త విద్యార్థిని తండ్రితో ఘర్షణకు దిగి గాయపరిచాడు.మురళి చర్యలతో భయపడిన బాధితులు.. తమకు రక్షణ కల్పించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయింంచారు. స్పందించిన ఎమ్మెల్యేక టీడీపీ కార్యకర్త మురళిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విద్యార్ధినులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మురళి గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అన్ని కేసులను పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి -
ఏలూరు జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న తల్లీ కూతుర్ని కిరాతకంగా..
సాక్షి, ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామం హరిజనవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కూతురును దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతులను సొంగా జేసు మరియమ్మ(33), సొంగా అఖిల (14) గా గుర్తించారు. సీఐ అంకబాబు, ముసునూరు ఎస్సై కుటుంబరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరియమ్మ భర్త నుంచి ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుంది. కూతురితో కలిసి జీవిస్తోంది. మీర్జాపురానికి చెందిన వ్యక్తితో మరియమ్మ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. చదవండి: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి! -
కూతుర్ని అమ్మేసి, తల్లిపై హత్యాయత్నం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. భార్య కళ్లుగప్పి ఓ భర్త కన్న కూతురిని అమ్మేశాడు. వివరాలు.. నవీన్‌బాబు అనే వ్యక్తి ఆడపిల్లలు పుడుతున్నారని తన తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన నవీన్‌బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది. గాయాల నుంచి కోలుకున్న రజనీ తన బిడ్డ ఎక్కడనీ భర్త, అత్తమామలను నిలదీసింది. దీంతో వారంతా కలిసి మరోసారి రజనీపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న రజనీ తన తల్లి దండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్ఐ మరోలా చేశాడు. బిడ్డను కొన్న దంపతులను స్టేషన్‌కి పిలిపించి తల్లి రజనీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించాడు. ఎస్ఐ తీరుపై రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన బిడ్డను ఇప్పించాలని బాధితురాలు నూజివీడు ఎమ్మెల్యేని ఆశ్రయించింది. (చదవండి: నకిలీ పోలీసుల గుట్టురట్టు) -
తల్లి కళ్లుగప్పి బిడ్డను అమ్మేసిన తండ్రి
-
రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి
సాక్షి, నూజివీడు: కృష్ణా జిల్లా ముసునూరులో రెవెన్యూ ఉద్యోగి ఒకరు రెచ్చిపోయాడు. దరఖాస్తుదారుడిపై విచక్షణారహింగా దాడి చేశాడు. మద్దాల బాబురావు అనే వ్యక్తి బుధవారం ముసునూరు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. కులధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల నుంచి తిప్పించుకుంటున్నారని అతడు వాపోయాడు. లంచం ఇవ్వకపోతే పని చేయరా అంటూ కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్‌ను నిలదీశాడు. కోపంతో ఊగిపోయిన పవన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి బాబూరావుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడున్నవారు అతడిని అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తనను రక్తమోచ్చేలా కొట్టిన పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాబూరావు ఫిర్యాదు మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబూరావు తనను దూషించాడని పవన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్ దాడిలో బాబూరావు కంటికి గాయమైంది. -
టీడీపీ ఎమ్మెల్యే పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
నూజివీడు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన గన్‌మెన్‌తో సహా 52 మందిపై కృష్ణాజిల్లా ముసునూరు పోలీస్ స్టేషన్లో నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయింది. వారిపై 353, 334, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్వార్వో వనజాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బుధవారం కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా ముసునూరు మండలం రంగంపేట ఇసుకరేవులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వుతున్న వారిని ఎమ్మార్వో వనజాక్షి, ఆమె వెంట ఉన్న సిబ్బంది ప్రశ్నించారు. దాంతో ఆగ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చింతంనేని ప్రభాకర్... వనజాక్షిపై తన అనుచరులతో దాడిచేయించి ఇసుకలో ఈడ్చికొట్టారు. ఆయనతోపాటు తీసుకొచ్చిన ఆరుగురు మహిళలు తహశీల్దార్‌పై దాడిచేసి గోళ్లతో ఆమె ముఖంపై రక్కారు. ఇసుక తవ్వుకుంటాం... ఎవడడ్డొస్తాడో చూస్తా..నంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించారు. 25 ట్రక్కుల ఇసుక, పొక్లెయిన్లు తీసుకొని వెళ్లిపోతూ ఎమ్మెల్యే చింతంనేని తహశీల్దార్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దానికి ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే గన్మెన్లు కూడా తహశీల్దార్‌పై దాడి చేశారు. అంతేకాకుండా ఆమెతో పాటు ఆర్ఐ, ముగ్గురు వీఆర్వోలు, ముగ్గురు వీఆర్ఏలు, కంప్యూటర్ ఆపరేటర్లపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కొట్టారని తహశీల్దార్ వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దాంతో గురువారం ఎమ్మెల్యే ఆయన అనుచరులపై ముసునూరు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిని రెవెన్యూ సంఘాలు మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ దాడిపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుంటే గోదావరి పుష్కరాలు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ విధులకు దూరంగా ఉండాలని రెవెన్యూ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.