
సాక్షి, ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామం హరిజనవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కూతురును దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతులను సొంగా జేసు మరియమ్మ(33), సొంగా అఖిల (14) గా గుర్తించారు. సీఐ అంకబాబు, ముసునూరు ఎస్సై కుటుంబరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మరియమ్మ భర్త నుంచి ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుంది. కూతురితో కలిసి జీవిస్తోంది. మీర్జాపురానికి చెందిన వ్యక్తితో మరియమ్మ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
చదవండి: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!
Comments
Please login to add a commentAdd a comment