
మృతి చెందిన కుక్క
బోడుప్పల్: వీధి కుక్కకు ఇంజిక్షన్ ద్వారా విషం ఇచ్చి చంపిన ఘటన బుధవారం మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య కథనం ప్రకారం.. బోడుప్పల్ వీరారెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి ఓ వీధి కుక్కకు గుర్తు తెలియని వ్యక్తి ఇంజిక్షన్ ద్వారా విషం ఇచ్చి ^è ంపేశాడు. స్థానికంగా ఉండే పీపుల్స్ ఆఫ్ ఏనిమల్ సంస్థ సభ్యురాలు లత ఈ విషయాన్ని గమనించి బుధవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన కుక్కకు పోచారంలోని వెటరర్నీ హాస్పిటల్‌లో పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక కుక్క ఎలా చనిపోయిందనేది తెలుస్తుందని, అనంతరం నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.