జీవితంపై విరక్తి చెంది ఓ మహిళా లెక్చరర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
బోడుప్పల్ (హైదరాబాద్) : జీవితంపై విరక్తి చెంది ఓ మహిళా లెక్చరర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్‌కు చెందిన శంకరయ్య కుమార్తె నాగమణి(35)కి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నర్సింహాచారితో వివాహం అయ్యింది. వీరికి 14 సంవత్సరాల కుమారుడున్నాడు. నర్సింహాచారి రెండు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో కొంత కాలంగా నాగమణి బోడుప్పల్ బృందావన్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు దగ్గరలో ఉంటోంది.
కుమారుడిని చదివించుకుంటూ స్థానిక ఎస్‌ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. అయితే శుక్రవారం కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో నాగమణి ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. తనకు బతకాలని లేదని, తన కుమారుడిని బాగా చూసుకోవాలని చెప్పి సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు