బోడుప్పల్ లో చైన్ స్నాచింగ్ చేసిన ముగ్గురిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: బోడుప్పల్ అంబేద్కర్ నగర్‌లో చైన్ స్నాచింగ్ చేసి కారులో ముగ్గురు పారిపోతుండగా పోలీసులు వెంబడించి నాచారంలో అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఉషారాణి(52) అనే మహిళ స్థానికంగా ఉన్న దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి ఆమె చైన్‌ను లాక్కొని పారిపోయారు.
మహిళ కేకలు వేయడంతో పాటు స్థానికులను అప్రమత్తం చేసింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితులను నాచారంలో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన 5 తులాల బంగారు గొలుసును, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.