హైదరాబాద్ సిటీ : నగర శివారులో మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. మహిళల మంగళసూత్రాలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా.. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సెవెన్‌హిల్స్ కాలనీకి చెందిన జెతైన్ అనే మహిళ గురువారం సాయంత్రం తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువెళ్తుండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.