ఇంటి ముందు నిలబడి ఉన్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఇద్దరు యువకులు తెంచుకుని పారిపోయిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బోడుప్పల్ (హైదరాబాద్): ఇంటి ముందు నిలబడి ఉన్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఇద్దరు యువకులు తెంచుకుని పారిపోయిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. బోడుప్పల్ ఎన్‌ఐఎన్ కాలనీలో నివసించే మేకల ప్రవళిక(32) మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆదివారం రాత్రి తమ ఇంటి ముందు నిలబడి ఉన్నారు.
ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో పుస్తెల తాడును తెంచుకుని పారిపోయే ప్రయత్నం చేయగా ఆమె పుస్తెలతాడును గట్టిగా పట్టుకుంది. దాంతో పుస్తెలు ఆమె చేతిలో ఉండి పోగా, నాలుగున్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు మంగళవారం మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.